syllabus change
-
అలా మార్చేస్తే ఎలా?
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి విద్యా విధానంలో మార్పులు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఇండియా పేరును భారత్‌గా మార్చడం పక్కన బెడితే, కొన్ని చాప్టర్లు తీసివేయడం వల్ల అనేక సమస్యలు ఎదురయ్యే వీలుందని విద్యావేత్తలు అంటున్నారు. పురాతన చరిత్ర స్థానంలో క్లాసికల్ హిస్టరీని తేవాలని తాజాగా జాతీయ విద్య, పరిశోధన శిక్షణ మండలి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. దీన్ని తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు స్వాగతించడం లేదు. ఇప్పటికే రాష్ట్రాల పరిధిలో స్థానిక అంశాలతో సిలబస్ ఉంది. వీటిని పరిగణనలోనికి తీసుకుని సిలబస్‌లో మార్పులు చేస్తేనే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. వేర్వేరు సిలబస్‌లతో ఇబ్బందులు ప్రపంచీకరణ ప్రభావం విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రం వేర్వేరు సిలబస్‌లు అమలు చేయడం వల్ల పోటీ పరీక్షల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్న వాదన విద్యావేత్తల నుంచి విన్పిస్తోంది. మారిన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా రాష్ట్రాల్లోని సిలబస్‌లో మార్పులు తేవాలనే అంశంపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. పోటీ పరీక్షలుసవాలే.. ఎన్సీఈఆర్టీ సూచించిన మార్పుల్లో అనేక అంశాలున్నాయి. క్లాసికల్ హిస్టరీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటోంది. ప్రాచీన చరిత్రను ఎత్తివేయడమే సమంజసమని భావిస్తోంది. ఇప్పటికే కొన్ని సబ్జెక్టులను తీసివేయాలనే ప్రతిపాదన రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. మొఘల్ సామ్రాజ్యం, గాందీజీ హత్య, ప్రజాస్వామ్యం–రాజకీయ పారీ్టలు అనే చాప్టర్స్‌ను ఎన్సీఈఆర్టీ అనవసరమైనవిగా చెబుతోంది. పాత చరిత్రలో విజయాలకన్నా, అపజయాల గురించే ఎక్కువగా ఉందనేది ఎన్సీఈఆర్టీ అభిప్రాయం. అయితే ఇవి రాష్ట్రాల పరిధిలో ఇప్పటికీ బోధనాంశాలుగా కొనసాగుతున్నాయి. పోటీ పరీక్షల్లోనూ వీటిలోంచి ప్రశ్నలు ఇస్తున్నారు. ఎడ్‌సెట్, లాసెట్, గ్రూప్స్, వివిధ రకాల పోటీ పరీక్షల్లో ఆర్ట్స్’ విద్యార్థులు వీటిని చదవాల్సి ఉంటుంది. సీబీఎస్ఈ సిలబస్ చదివే వాళ్ళకు ఈ చాప్టర్లు చదివే వీలుండదు. దాంతో రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీ పరీక్షల్లో విద్యార్థులకు నష్టం కల్గించే వీలుందని నిపుణులు అంటున్నారు. సైన్స్ నేపథ్యంతో సీబీఎస్ఈ చదివే విద్యార్ధులకు... సైన్స్‌లో డార్విన్ సిద్ధాంతాన్ని కేంద్ర విద్యా సంస్థ ఎత్తివేయాలని ప్రతిపాదించింది. మానవ పరిణామ క్రమాన్ని సహేతుకంగా నిరూపించే సిద్ధాంతాన్ని ఎన్సీఈఆర్టీ కమిటీ విభేదించినట్టు తెలుస్తోంది. దీంతో పాటే పైథాగరస్ సిద్ధాంతానికి స్వస్తి పలకాలని సూచి స్తోంది. దీనివల్ల కూడా సైన్స్ నేపథ్యంతో సీబీఎస్ఈ చదివే విద్యార్థులు రాష్ట్రాల్లోని పోటీ పరీక్షలకు హాజరవ్వడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. కేంద్ర స్థాయిలో నిర్వహించే పరీక్షలకు సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగానే ప్రశ్నలు ఇస్తారు. రాష్ట్ర బోర్డు పరిధిలో ఉండే విద్యార్థులు కొత్త చాప్టర్స్ చదివే వీలుండదు. వాళ్లు చదివిన పురాతన భారత చరిత్ర వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి అనేక సమస్యలు ఎదురయ్యే వీలుందని పలువురు అంటున్నారు. అన్ని రాష్ట్రాలనూ పరిగణనలోకి తీసుకోవాలి ప్రపంచవ్యాప్తంగా విద్యా విధానంలో వస్తున్న మార్పులను ఆకళింపజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా విద్యార్థి విద్యా విధానంలోనే స్కిల్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ దిశగా పాఠ్యాంశాలు ఉండటం మంచిది. అయితే, మార్పు జరిగేటప్పుడు రాష్ట్రాల పరిధిలోని విద్యా విధానాన్ని పరిగణనలోనికి తీసుకోవాలి. లేనిపక్షంలో అనేక మంది విద్యార్థులు రెండు సిలబస్‌లతో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. –ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యామండలి చైర్మన్) వక్రీకరణ సరికాదు చరిత్రను వక్రీకరించే విధానం ఎన్సీఈఆర్టీ సిఫార్సుల్లో బోధపడుతోంది. ప్రాచీన చరిత్రను తీసివేయాలనే ధోరణి మంచిది కాదు. చరిత్ర తెలుసుకుంటేనే ప్రతిభ పెరుగుతుంది. ఇది తెలియకుండా ఇష్టానుసారంగా చరిత్రను పాఠ్యాంశాల్లో జోడిస్తే ప్రతికూల ఫలితాలొస్తాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో వేర్వేరు సిలబస్‌లు వల్ల కూడా నష్టం జరుగుతుందనే విషయాన్ని కేంద్రం గుర్తించాల్సిన అవసరం ఉంది. – చావా రవి (యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) -
సీబీఎస్ఈ సిలబస్‌లో భారీ మార్పులు
న్యూఢిల్లీ: 2022–23 విద్యా సంవత్సరానికి 11, 12వ తరగతుల సిలబస్‌లో సీబీఎస్ఈ పలు మార్పులు ప్రకటించింది. చరిత్ర, రాజనీతి శాస్త్రాల్లోని అలీనోద్యమం, ప్రచ్ఛన్నయుద్ధ కాలం, ఆసియా–ఆఫ్రికా దేశాల్లో ముస్లిం సామ్రాజ్యాల అవతరణ, మొగలుల పాలన, పారిశ్రామిక విప్లవం పాఠ్యాంశాలను తొలగించింది. 10వ తరగతిలో ఫుడ్ సెక్యూరిటీ చాప్టర్లోని ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ అగ్రికల్చర్‌ను తీసేసింది. ఉర్దూ కవి ఫయీజ్ అహ్మద్ ఫయిజ్ అనువాద కవితలను, డెమోక్రసీ అండ్ డైవర్సిటీ చాప్టర్లను తీసేసింది. సిలబస్‌లో హేతుబద్ధత కోసమే ఈ మార్పులు చేసినట్టు చెప్పింది. గత విద్యా సంవత్సరంలో రెండు దఫాలుగా నిర్వహించిన ఫైనల్ పరీక్షను ఈసారి ఒకే దఫా నిర్వహించాలని నిర్ణయించింది. 2020లోనూ 11వ తరగతి రాజనీతి శాస్త్రంలో పలు చాప్టర్లు తొలగించిన సీబీఎస్ఈ, నిరసనలతో మరుసటి ఏడాది నుంచి వాటిని పునరుద్ధరించింది. -
సీబీఎస్ఈ సిలబస్ హేతుబద్ధీకరణ
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా క్లాసులను కోల్పోయిన విద్యార్థుల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సిలబస్‌ను హేతుబద్ధం చేసేందుకు సిద్ధమైంది. 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల కోసం రానున్న విద్యాసంవత్సరంలో ఈ మేరకు మార్పులకు అవకాశం ఉంది. లాక్డౌన్ కారణంగా విద్యార్థులు నష్టపోయిన కాలాన్ని, పర్యవసానాలను బోర్డు అంచనా వేస్తోంది. 1–5 తరగతులకు కొత్త కేలండర్‌ను నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విధానాన్నే పై తరగతులకు కూడా వర్తించే దిశగా చర్యలు చేపడుతోంది. 1 నుంచి 8 తరగతులకు ఎన్సీఈఆర్టీ కొత్త విద్యా సంవత్సర కేలండర్ ను విడుదల చేసినట్లే సీబీఎస్ఈ కూడా 9 నుంచి 12 తరగతుల వారికి సిలబస్‌ను హేతుబద్ధం చేసే పనిలో ఉందని బోర్డులోని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అయితే పరీక్షలు ఎప్పుడు ఉంటాయో ఇప్పుడే చెప్పడం కష్టమని, కనీసం 10 రోజుల ముందే విద్యార్థులకు సమాచారం అందుతుందని తెలిపారు. -
బొమ్మల పాఠం
అంగన్వాడీల్లో మారిన సిలబస్ చిన్నారుల్లో సృజనాత్మకతకు పదును పూర్వ ప్రాథమిక విద్యతో గట్టి పునాది జిల్లాలో మొత్తం అంగన్వాడీ కేంద్రాలు: 5,126 మొత్తం చిన్నారులు :2,58,948 సొంత భవనాలున్న సెంటర్లు :1540 అద్దె, తాత్కాలిక భవనాల్లో నడుస్తున్న సెంటర్లు :2705 అంగన్వాడీ సిబ్బంది :5,120 ప్రస్తుత విద్యా విధానంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కంఠస్త విధానానికి స్వస్తి చెప్పి విద్యార్థుల్లో సృజనాత్మకకు పదును పెట్టేలా బోధనలు సాగుతున్నాయి. పరీక్షల్లోనూ స్వతహాగా జవాబులు రాసేలా విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. పూర్వ ప్రాథమిక విద్యనుంచే విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించే దిశగా సిలబస్‌లో రూపకల్పనలు జరుగుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాలనుంచే తొలి అడుగులు పడుతున్నాయి. గుమ్మఘట్ట : అంగన్వాడీ కేంద్రాల తీరుతెన్నులు మారుతున్నాయి. ఇప్పటివరకు పిల్లలకు పౌష్టికాహారం.. ఆటపాటలు.. అక్షరాల అభ్యసనకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేవారు. మారుతున్న కాలానికనుగుణంగా చిన్నారులను తీర్చేందుకు అంగన్వాడీల్లో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం బోధన విద్యావిధానంలో మార్పులు చేశారు. కొన్నేళ్లుగా అమలు చేస్తున్న పూర్వ ప్రాథమిక విద్యకు మరింత పదును పెట్టారు. వివిధ రకాల కృత్యధార విజ్ఞానదాయక సిలబస్‌ను రూపకల్పన చేశారు. సృజనాత్మకతకు పెద్దపీట బడిమెట్లు ఎక్కేలోగా పిల్లలు స్వతహాగా బొమ్మచూసి బోలెడు విషయాలు చెప్పేలా, వారిలో నైపుణ్యాన్ని వెలికితీసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. అందుకోసం అంగన్వాడీ కేంద్రాల వేళలతో పాటు సిలబస్ మార్పుచేశారు. అంతేకాకుండా ప్రత్యేక బోధన కిట్లు తయారుచేసి అన్ని కేంద్రాలకు సరఫరా చేశారు. వీటి సాయంతో బోధన గురించి సీడీపీఓ, పర్యవేక్షకురాళ్లు, అంగన్ వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. జిల్లాలో 1.16 లక్షల మంది చిన్నారులను చురుగ్గా తయారుచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 14 అంశాలతో కూడిన బోధన పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమం, కృత్యదార బోధన నిర్వహణకు అందించిన పరికరాలను విధిగా వినియోగించాలి. పిల్లల్లో చురుకైన ఆలోచన, సృజనత్మాకత, చేతి కండరాల అభివృద్ధి, మంచి అలవాట్లు పెంపొందించేందుకు దోహదపడేలా చూడాలి. ఇందుకోసం పూర్వ ప్రాథమిక విద్య కిట్లలో 14 అంశాలకు సంబంధించిన పరికరాలను పొందుపర్చారు. ఏఏ అంశాలను ఎలా బోధించాలి. ఏ పరికరం వల్ల ఎటువంటి ప్రయోజనం పొందవచ్చునో అంగన్వాడీ సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించారు. పరికరాలు.. ప్రయోజనాలు ఇలా.. కృత్యమాలికలు (యాక్టివిటీ బుక్స్): 20 డ్రాయింగ్ పుస్తకాలను ఇచ్చారు. మూడు, నాలుగేళ్లు పై బడిన పిల్లలతో వీటిలో గీతల ఆధారంగా అక్షరాలపై రంగులు వేయించాలి. తద్వార పిల్లల్లో మేధాశక్తిని పెంపొందుతుంది. సృజనాత్మకత, స్వతహాగా ఆలోచించేందుకు ఉపయోగ పడుతుంది. వర్క్‌బుక్: ఒక్కో విద్యార్థికి ఒక్కో పుస్తకం ఇచ్చి వారే అందులో రాసేలా చూస్తారు. దీనివల్ల అక్షరాల సంసిద్ధత, వాటిని గుర్తించడం, పదాలు పలకటం అలువడుతుంది. రాయడం, చదవడంపై ఆసక్తి పెరుగుతుంది. చేయికి కంటికి సమన్వయం కలిగేలా దీన్ని రూపొందించారు. ఆకృతులు: వివిధ ఆకారాలు, పరిమాణాల పూసలు, వివిధ ఆకారాల్లో చిన్న, పెద్ద పరిమాణంలో ప్లాస్టిక్ ఆకృతులు ఇచ్చారు. వృత్తం, త్రికోణం ఇలా వివిధ ఆకృతుల్లోని వస్తువులను చిన్నవాటి నుంచి పెద్ద వాటిని వేరు చేయడం చిన్నారులకు నేర్పాలి. దీనిద్వారా ఆకృతులపై అవగాహన పెరుగుతుంది. తద్వారా చిన్న, పెద్ద కండరాల అభివృద్ధి, ఆలోచించడం, ఆనందించడం, మేధాశక్తి పెంపొందించడం, రంగులు గుర్తించడం, పరిశీలన శక్తి పెరుగుతుంది. బొమ్మలు: ఫింగర్ పప్పెట్లు, బొమ్మలు, రంగు రంగుల మైనం పెన్సిళ్లు, టచ్ టాబ్ లెట్స్, స్టిక్ పప్పెట్స్, (మంచి అలవాట్లు), ముసుగుల (మాస్కులు), కన్స్ట్రక్షన్ బ్లాక్‌లు, నట్టులు, బోల్టులు, బాస్కెట్‌బాల్, గడియారం, సీతాకోకచిలుక, షూలెస్, లేస్ బోర్డులు అందించారు. ఈ కిట్లలో ఇచ్చిన పరికరాల ప్రయోజనాలను తెలియజేయడం ద్వారా పిల్లల్లో మేధాశక్తి, సృజనాత్మకతను వెలికి తీసేలా సిలబస్ రూపొందించారు. సక్రమంగా అమలయ్యేలా చూస్తాం అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య సక్రమంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాం. 14 అంశాలకు సంబంధించిన కిట్లను అన్ని కేంద్రాలకు సరఫరా చేశాం. ఈ విధానంతో చిన్నారుల్లో సృజనాత్మకత వెలికితీసేలా అంగన్వాడీలు బోధన సాగుతుంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చిన్నారులకు నాణ్యమైన బోధన సాగేలా చూస్తాం – కృష్ణకుమారి, ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీ, అనంతపురం -
'సర్కార్ వైఖరితో విద్యారంగంలో అయోమయం'
టీఆర్ఎస్ ప్రభుత్వ అస్పష్ట వైఖరితో విద్యారంగంలో అయోమయం నెలకొందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. పాఠ్యాంశాల మార్పు, ఫాస్ట్ పథకం, ఎంసెట్, పోటీ పరీక్షల అంశంపై గందరగోళాన్ని తొలగించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ దృక్కోణంతో పాఠ్యాంశాల మార్పు పేరుతో తెలుగు నేతల చరిత్రను తొలగించాలనుకోవడం సరికాదని చెప్పారు. దేశం, తెలుగుజాతి కోసం కృషిచేసిన మాదిగల చరిత్రను తెలంగాణ పాఠ్యాంశాల నుంచి తొలగించడం తగదన్నారు. సిలబస్ మార్పు పేరుతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు పెండింగ్‌లో పెట్టడం అన్యాయమని పొంగులేటి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. -
సిలబస్ మార్పులపై కమిటీ
* పోటీ పరీక్షల విషయంలో టీఎస్పీఎస్సీ కసరత్తు సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1, గ్రూప్-2 తదితర పోటీ పరీక్షల సిలబస్‌లో మార్పులపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) దృష్టిసారించింది. దీనిపై రెండు మూడు రోజుల్లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. పరీక్షల సిలబస్‌లో చేయాల్సిన మార్పులను సూచిస్తూ ఈ కమిటీ వారంలోగా నివేదిక ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. అందులోని సిఫారసులను పరిశీలించిన తర్వాత సిలబస్ మార్పులపై తుది నిర్ణయం తీసుకుని ఫైలును ప్రభుత్వామోదం కోసం పంపించాలని కమిషన్ భావిస్తోంది. ప్రస్తుత సిలబస్‌లో గ్రూప్-1లో 25 శాతం వరకు, గ్రూప్-2 తదితర పోటీ పరీక్షల్లో 50 శాతం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమాచారమే ఉన్నట్లు సమాచారం. ఈ సిలబస్‌ను తెలంగాణ రాష్ట్రానికే పరిమితం చేయాలని కమిషన్ భావిస్తోంది. ఏపీకి సంబంధించిన చాలావరకు సమాచారం అవసరం లేదని, భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, చరిత్రకు సంబంధించిన అంశాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివరాలనే సిలబస్‌లో పెట్టాలని భావిస్తోంది. తద్వారా ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు నష్టం ఉండదని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. పైగా నోటిఫికేషన్ల తర్వాత విద్యార్థులకు కొంత సమయం ఉంటుంది కనుక వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నాయి. ఇక వచ్చే నెల మొదటి వారంలో టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌ను ప్రారంభించేందుకు కూడా కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు సంబంధిత ఐటీ విభాగం అధికారులతో కమిషన్ సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు ఒకట్రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్‌లో(ఏపీపీఎస్సీ) పని చేస్తున్న తెలంగాణ సిబ్బందిని తెలంగాణకు కేటాయించే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయి. నోటిఫికేషన్ల జారీలో తప్పని జాప్యం! రాష్ట్ర విభజనలో భాగంగా వివిధ శాఖల్లో సిబ్బంది విభజనే పూర్తి కానందున కొత్త నోటిఫికేషన్ల జారీపై ప్రభావం పడుతోంది. ప్రభుత్వ శాఖలు తమ అవసరాల మేరకు ఉద్యోగ నియామకాల కోసం ఇండెంట్లు(ప్రతిపాదనలు) ఇస్తే తప్ప నోటిఫికేషన్లు జారీ చేయడం టీఎస్పీఎస్సీకి సాధ్యం కాదు. శాఖలవారీగా ఖాళీ పోస్టులు, కేడర్లవారీగా అర్హతల వివరాలను ఆయా శాఖలే కమిషన్‌కు అందజేయాలి. అలాగే ఆయా పోస్టుల భర్తీకి సర్ప్లస్ మ్యాన్‌పవర్ సెల్(ఎస్ఎంపీసీ), ఆర్థిక శాఖలు అనుమతివ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏ శాఖలోనూ ఉద్యోగుల విభ జన పూర్తి కాలేదు. అది పూర్తయితేనే శాఖలవారీ అవసరాలపై స్పష్టమైన సమాచారం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ఇప్పటికిప్పుడు ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇటు టీఎస్పీఎస్సీలోనూ చైర్మన్, ముగ్గురు సభ్యులు, కార్యదర్శి మినహా మరే సిబ్బంది లేరు. కమిషన్‌లో పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ పోస్టుల్లోకి ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న సిబ్బంది రావాల్సి ఉంది. ఉద్యోగుల విభజన పూర్తయితేనే ఈ పరిస్థితి చక్కబడుతుంది. అప్పటివరకు ఇతర అంశాలపై కమిషన్ దృష్టి సారించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు మరింతకాలం వేచి చూడక తప్పదు. కమిషన్‌కు పోస్టుల మంజూరు టీఎస్పీఎస్సీకి 121 పోస్టులను సృష్టిస్తూ ఆర్థికశాఖ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. అదనపు కార్యదర్శి స్థాయి నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకు పోస్టులను మంజూరు చేసింది. ఉద్యోగుల విభజనలో భాగంగా ఏపీపీఎస్సీ నుంచి కమిషన్‌కు వచ్చే ఉద్యోగులు మినహా మిగతా పోస్టులను భర్తీ చేసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. కమిషన్‌కు అదనపు కార్యదర్శి-1, డిప్యూటీ కార్యదర్శి-2, అసిస్టెంట్ సెక్రటరీ-6, అసిస్టెంట్ సెక్రటరీ(అకౌంట్స్)-1, సెక్షన్ ఆఫీసర్-26, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-26, జూనియర్ అసిస్టెంట్-26, ష్రాఫ్-1, రికార్డు అసిస్టెంట్-5, రెనో ఆపరేటర్-2, జామేదార్-1, దఫేదార్-2, డ్రైవర్-2, ఆఫీస్ సబార్డినేట్-20 పోస్టులు కొత్తగా వచ్చాయి. -
ప్రి‘పరేషాన్’..
‘సిలబస్ మార్పు’ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆందోళన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ పరీక్షల ‘సిలబస్ మార్పు’ అంశం అలజడి సృష్టిస్తోంది.. విద్యార్థులు, నిరుద్యోగుల్లో నిరాశను నింపుతోంది.. ఇప్పట్లో ఎలాంటి నోటిఫికేషన్లు ఉండవన్న రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి ప్రకటనతో లక్షలాది మంది నిరుద్యోగులు అయోమయంలో పడిపోయారు. తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు అనుగుణంగా గ్రూప్ పరీక్షల సిలబస్ మార్చిన తరువాతే కొత్త నోటిఫికేషన్లు ఉంటాయనడంతో.. పోటీ పరీక్షల కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదువుకుంటున్న విద్యార్థులు, నిరుద్యోగులు గందరగోళంలో పడిపోయారు.. వేలకు వేలు చెల్లించి తీసుకుంటున్న కోచింగ్ వృథా అయిపోతుందేమోనని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి జాప్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని, ప్రస్తుతమున్న సిలబస్‌ల ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ, బీసీ సంక్షేమ సంఘం తదితర సంఘాల ఆధ్వర్యంలో అభ్యర్ధులు ఇటీవల భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. రాష్ట్రం వచ్చినా ఉద్యోగాలేవి..? అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడతామని ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడి, సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించినా... ఇప్పుడు ఉద్యోగ నియామకాలపై మీనమేషాలు లెక్కిస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వయోపరిమితి దాటేందుకు దగ్గరలో ఉన్న అభ్యర్థులు ఈ జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, హైదరాబాద్‌లోని కోచింగ్ కేంద్రాలు, ఉస్మానియా, కాకతీయ సహా విశ్వ విద్యాలయాల లైబ్రరీల్లో... ఇలా ఎక్కడ చూసినా వేల సంఖ్యలో అభ్యర్థులు పోటీ పరీక్షల కోసం చదువుతూనే కనిపిస్తారు. ఇప్పటివరకు తాము కష్టపడి చదువుకున్న సిలబస్ అంతా పనికిరాకుండా పోతుందనే ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. వేలకు వేలు పెట్టి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు ఉంటాయన్న ఉద్దేశంతో లక్షలాది మంది కోచింగ్ కేంద్రాలకు పరుగులు తీశారు. వేల రూపాయలు వెచ్చించి శిక్షణ తీసుకుంటున్నారు. ఇలా నిరుద్యోగుల నుంచి డిమాండ్ వెల్లువెత్తడంతో.. కోచింగ్ సెంటర్లు నిండిపోయాయి. ఇది ఎంతగా పెరిగిపోయిందంటే.. తరగతి గదుల కొరత ఏర్పడి, ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాల్లో కోచింగ్ కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, వీఎస్టీ, రాంనగర్, దోమల్‌గూడ తదితర ప్రాంతాల్లోని ఫంక్షన్‌హాళ్లు, ఆడిటోరియాలు అద్దెకు తీసుకొని శిక్షణ ఇస్తున్నారు. కోచింగ్‌కు ఫీజులు కూడా భారీగా పెంచారు. రూ. 10 వేలలోపు ఉన్న కోచింగ్ ఫీజులు.. రూ. 20 వేల వరకు పెరిగాయి. ఈ క్రమంలో రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో ప్రారంభమైన గ్రూప్-1, 2, ఇతర పోటీ పరీక్షల కోచింగ్ ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది. ఇలా వేలకు వేలు చెల్లించి లక్షలాది మంది అభ్యర్థులు కోచింగ్ పొందారు.. కానీ కొత్త నోటిఫికేషన్ల కోసం మరో ఆరు నెలలదాకా ఆగాల్సిందేనంటూ ప్రభుత్వం నుంచి ప్రకటనలు వెలువడడం, సిలబస్‌ను మార్చుతామని పేర్కొనడం.. ఇటు విద్యార్థులను, అటు కోచింగ్ కేంద్రాలను గందరగోళంలోకి నెట్టింది. భగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు.. నోటిఫికేషన్ల విడుదలలో జాప్యం పట్ల విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. లక్షలాది మంది యువత కొత్త రాష్ట్రంలో బంగారు భవితవ్యంపై కలలుగన్నారని... కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఆరునెలలు దాటిపోయినా ఉద్యోగాల భర్తీ ఊసెత్తకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు ఉద్యమం చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ఉన్నపళంగా మార్చితే ఎలా..? ‘చాలా కాలంగా గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నాం.. ఉన్నపళంగా సిలబస్ మార్చితే ఎలా? ఇప్పటివరకు పడిన మా శ్రమ అంతా వృథా అయినట్లేనా? ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని సహించబోం. ఒక్క నోటిఫికేషన్ అయినా పాత సిలబస్ ప్రకారంగా ఇవ్వాలి.’ - వెంకట్, గ్రూప్స్ అభ్యర్థి వేలకు వేలు ఖర్చు చేశాం.. ‘గ్రూప్స్ పరీక్షల ప్రిపరేషన్ కోసం వేలకు వేలు ఖర్చు చేశాం. పుస్తకాలు, వివిధ మెటీరియల్‌ను కొనుగోలు చేసి.. రాత్రీపగలూ కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతున్నాం. ఇప్పుడు అవన్నీ పక్కన పడేసి కొత్తవి కొనుక్కోవాల్సిందేనా? మళ్లీ కొత్తగా కోచింగ్ తీసుకోవాలన్నా par కష్టమే.’ - శాంతి, గ్రూప్స్ అభ్యర్థిని వర్సిటీలకు అప్పగించండి.. ‘ఉద్యోగ పరీక్షల కోసం లక్షలాది మంది ఐదేళ్లుగా కష్టపడి చదువుతున్నారు. ఉద్యోగాల భర్తీ పరీక్షలను టీఎస్పీఎస్సీసీ ద్వారా కాకుండా వర్సిటీలకు అప్పగించాలి. కేసీఆర్ వైఖరిపై ఆందోళనలు చేపడతాం.’ - మానవతారాయ్, తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సిలబస్ మార్పు ఓ డ్రామా.. ‘రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ వెంటనే భర్తీ చేయాలి. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారంలోకి వ చ్చిన టీఆర్ఎస్.. ఇప్పుడు కాలయాపన చేయడం సరికాదు. సిలబస్ మార్పు అనేది డ్రామా. ఎక్కడైనా సరే సిలబస్ మార్చాలంటే మూడేళ్ల ముందుగా కసరత్తు చేపట్టాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం విరుద్ధంగా వ్యవహరిస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం..’’ - ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు -
పోటీ పరీక్షల సిలబస్‌లో మార్పులు!
* ‘సాక్షి’తో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి * ఉద్యోగార్థులకు తెలంగాణపై అవగాహన ఉండాల్సిందే * సిలబస్‌లో మార్పులపై నిపుణులతో కమిటీ వేస్తాం * పోటీ పరీక్షల స్థాయినిబట్టి ప్రశ్నలుంటాయి * ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లకుండా మరో సెల్ * నాలుగైదు నెలల్లో నోటిఫికేషన్ల ప్రక్రియ వేగవంతం * ఉద్యోగ నోటిఫికేషన్లోనే సమస్త వివరాలుంటాయి * వీలైతే వచ్చేనెలలో ఏదైనా చిన్న నోటిఫికేషన్ ఇస్తాం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగం చేయబోయే ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర సామాజిక, రాజకీయ, భౌగోళిక అంశాలపై అవగాహన ఉండాల్సిందేనని టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి స్పష్టంచేశారు. ఈ అంశాలన్నింటిపై పోటీ పరీక్షల్లో ప్రశ్నలుంటాయని చెప్పారు. ఈ మేరకు పోటీ పరీక్షల సిలబస్‌లో మార్పులు తెస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) తొలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. కమిషన్‌లో తీసుకురాబోయే సంస్కరణలు, నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించేందుకు చేపట్టబోయే చర్యలను సంస్కరణలను వివరించారు. ‘‘తెలంగాణలో ఉద్యోగం చేయబోయే వారికి ఇక్కడి చరిత్ర, సంస్కృతి, నైసర్గిక స్వరూపం తెలిసి ఉండాలి. ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులు, ఉద్యమాలు, పోరాటాలు అన్నింటిపై కచ్చితమైన అవగాహన అవసరం. అవి తెలియకపోతే ఉద్యోగి తెలంగాణలోని ప్రజలకు సంపూర్ణ న్యాయం అందించలేరు. అందుకే పోటీ పరీక్షల్లో ఈ అంశాలన్నింటిపై ప్రశ్నలు ఉంటాయి. అందుకు సిలబస్‌లో మార్పులు తెస్తాం. అయితే పోటీ పరీక్ష స్థాయిని బట్టి ఈ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఆ దిశగా కసరత్తు చేస్తున్నాం. ఇందుకోసం ప్రొఫెసర్లు, అధికారులు, కమిషన్ సభ్యులతో కూడిన ప్రత్యేక అకడమిక్ కమిటీని ఏర్పాటు చేస్తాం. బ్రిటిష్ కాలంలో ఐసీఎస్‌కు లండన్‌లో శిక్షణ ఏర్పాటు చేసినా ఉద్యోగం చేయాల్సిన భారతదేశానికి సంబంధించిన అంశాలపైనే శిక్షణ ఇచ్చేవారు. అలాగే తెలంగాణలో ఉద్యోగం చేయబోయే ప్రతి ఒక్కరికి తెలంగాణకు సంబంధించిన అంశాలపై సంపూర్ణ అవగాహన ఉండాల్సిందే. అందుకోసమే సిలబస్‌లో మార్పులు తెస్తాం’’అని చక్రపాణి చెప్పారు. పలు అంశాలపై ఆయన ఏం చెప్పారంటే.. వారంలో సిలబస్ మార్పులపై కమిటీ గ్రూపు-1, గ్రూపు-2, గ్రూపు-4 తదితర పోటీ పరీక్షల్లో పరీక్ష వారీగా సిలబస్‌లో తీసుకురావాల్సిన మార్పులపై వారం రోజుల్లో కమిటీ ఏర్పాటు చేస్తాం. ఆ కమిటీ చేసే సిఫారసులను నెల రోజుల్లోగా తెప్పించుకొని అమల్లోకి తెస్తాం. పోటీ పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నపత్రాల్లో అనువాద, అన్వయ దోషాలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నోటిఫికేషన్ల వారీగా అర్హతలు, వివాదాలు తలెత్తనివిధంగా చేపట్టాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు మరో అకడమిక్ సెల్‌ను ఏర్పాటు చేస్తాం. ప్రశ్నపత్రాలకు సంబంధించిన వ్యవహారాలను చూస్తుంది కనుక ఈ కమిటీ కాన్ఫిడెన్షియల్. ఏ పరీక్షలకు ఇంట ర్వ్యూలు ఉండాలి. ఏ పరీక్షలకు ఇంటర్వ్యూలు అవసరం లేదనే అంశాలను ఈ సెల్ చూస్తుంది. అంతేకాదు యూపీఎస్సీ తరహా పరీక్ష విధానాన్ని అమలు చేస్తాం. అందులో లోపాలుంటే తొలగించి మంచివి తీసుకుంటాం. భవిష్యత్తు పాలన ఈ లక్ష ఉద్యోగాల భర్తీపైనా ఆధార పడి ఉంటుంది కనుక జాగ్రత్తగా వ్యవహరిస్తాం. ప్రతి పరీక్షకు కేలండర్ ఏటా నోటిఫికేషన్ల అంశానికి సంబంధించి కాకుండా, పరీక్ష వారీగా కేలండర్‌ను అమలు చేస్తాం. నోటిఫికేషన్లోనే పరీక్ష దరఖాస్తు తేదీ నుంచి చివరి తేదీ, హాల్‌టికెట్ల జారీ, రాత పరీక్ష, ఫలితాలు, పోస్టింగ్ ఇచ్చే తేదీలతో సహా కేలండర్‌ను జారీచేస్తాం. ఇదంతా ఆన్లైన్లోనే చేపడతాం. ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఐదారు నెలల్లో ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేస్తాం. ఆన్లైన్ ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగుల వివరాలను సేకరిస్తాం. ఆన్లైన్లో వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తాం. తద్వారా రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారన్న స్పష్టమైన వివరాలు వస్తాయి. సవాళ్లను అధిగమిస్తాం మా ముందు మూడు ప్రధాన సవాళ్లు ఉన్నాయి. పక్కా చర్యలతో వాటిని విజయవంతంగా అధిగమిస్తాం. కమిషన్ ఏర్పాటుతో ఇప్పటికే ఓ అడుగు ముందుకు పడింది. నిరుద్యోగుల్లో నమ్మకం వచ్చింది. ఇన్నాళ్లు ఉద్యమాల్లో ఉన్న వారు నోటిఫికేషన్ల జారీతో పోటీ పరీక్షల వైపు మళ్లేలా చూస్తాం. పారదర్శకంగా నియామకాలు చేపట్టి టీఎస్పీఎస్సీపై నమ్మకాన్ని కల్పిస్తాం. లక్ష ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వానికి అవసరమైన అర్హతలు, బాధ్యతలతో కూడిన వారిని అందిస్తాం. వారి విషయంలో విధాన నిర్ణయం మేరకే.. కమిషన్ చేపట్టే నియామకాలన్నీ ప్రభుత్వ విధానపర నిర్ణయాల ప్రకారమే ఉంటాయి. తెలంగాణ ఉద్యమంలో కేసులు ఎదుర్కొంటున్న యువత విషయంలో.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్నే అమలు చేస్తాం. కమిషన్ విధానపర నిర్ణయాలు చేయదు.