
'సర్కార్ వైఖరితో విద్యారంగంలో అయోమయం'
టీఆర్ఎస్ ప్రభుత్వ అస్పష్ట వైఖరితో విద్యారంగంలో అయోమయం నెలకొందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. పాఠ్యాంశాల మార్పు, ఫాస్ట్ పథకం, ఎంసెట్, పోటీ పరీక్షల అంశంపై గందరగోళాన్ని తొలగించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ దృక్కోణంతో పాఠ్యాంశాల మార్పు పేరుతో తెలుగు నేతల చరిత్రను తొలగించాలనుకోవడం సరికాదని చెప్పారు. దేశం, తెలుగుజాతి కోసం కృషిచేసిన మాదిగల చరిత్రను తెలంగాణ పాఠ్యాంశాల నుంచి తొలగించడం తగదన్నారు. సిలబస్ మార్పు పేరుతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు పెండింగ్లో పెట్టడం అన్యాయమని పొంగులేటి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.