All parties meeting
-
వారికి ఒక్కో కుటుంబానికి 10 లక్షలు.. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి
►దళిత సాధికారతను సాధించడానికి ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేయాలని నిశ్చయించుకుంది. మీరందరూ కలిసిరావాలి. నాకు భగవంతుడిచ్చిన సర్వ శక్తుల్నీ ఉపయోగించి ఈ పథకాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలన్నదే నా దృఢ సంకల్పం. ►పైరవీలకు ఆస్కారం లేని, పారదర్శక విధానం అమలు చేద్దాం. నిధుల బాధ్యత నాది. రాజకీయాలకు అతీతంగా సమష్టి కార్యాచరణ మనందరి బాధ్యత. ►దళిత సాధికారత విషయంలో సీఎంవోలో ప్రత్యేక అధికారిని నియమిస్తాం. ఎస్సీ రైతుల వద్ద ఉన్న 13,58,000 ఎకరాల్లో అసైన్డ్ భూములు ఎన్ని? ఇందులో ఉన్నదెంత ? పోయిందెంత? లెక్కలు తీయాలి. దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ప్రైవేటు రంగంలో దళితులకు రిజర్వేషన్ల అమలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం. సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి దళిత సాధికారత పథకం కింద ఎంపిక చేసే అర్హులైన ఒక్కో దళిత కుటుంబం (ఒక యూనిట్) బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని జమ చేయాలి. మొదటి దశలో ప్రతి శాసనసభ నియోజకవర్గం నుంచి 100 కుటుంబాలు చొప్పున రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల పరిధిలో ఎంపిక చేసిన 11,900 కడుపేద దళిత కుటుంబాలకు రైతుబంధు తరహాలో నేరుగా ఈ ఆర్థిక సహాయాన్ని అందజేయాలి. రూ.1,200 కోట్లతో సీఎం దళిత సాధికారత పథకం అమలుకు శ్రీకారం చుట్టాలి..’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష భేటీ సమిష్టి నిర్ణయం తీసుకుంది. ఆదివారం ప్రగతిభవన్‌లో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం.. తమ అభివృద్ధిని తామే నిర్వచించుకుని, తమ స్కీమ్‌ను తామే నిర్ణయించుకునే స్వేచ్ఛను ఈ పథకం కింద ఎంపికైన కుటుంబాలకు కల్పించాలని సమావేశం నిర్ణయించింది. ఆర్థిక సాధికారత, స్వావలంబన కోసం దళితుల స్వీయ నిర్ణయాధికారాన్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు దాదాపు 10 గంటలపాటు జరిగిన ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అఖిలపక్ష నేతలతో పాటు దళిత ప్రజాప్రతినిధులు, మేధావులు, అధికారులు చర్చలో పాల్గొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం.. ‘దళితుల అభ్యున్నతి కోసం సీఎం దళిత సాధికారత పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోంది. ఈ బడ్జెట్లో ఈ పథకానికి రూ.1,200 కోట్లు కేటాయించాం. వచ్చే మూడు నాలుగేళ్లలో రూ.35–40 వేల కోట్లను ఖర్చు చేయాలని యోచిస్తున్నాం. ఎస్సీ సబ్‌ప్లాన్ కేటాయింపులకు ఈ నిధులు అదనం. బ్యాంక్ గ్యారెంటీ జంజాటం లేకుండానే ఈ పథకం ద్వారా దళితులకు సహకారం అందిస్తాం.’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశంలో కీలక ప్రకటన చేశారు. దళితుల్లో అర్హులైన పేద కుటుంబాల గణన జరపాలని అధికారులను ఆదేశించారు. రైతు బంధు, ఆసరా పెన్షన్ల తరహాలో అత్యంత పారదర్శకంగా, మధ్య దళారులకు ఆస్కారం లేకుండా నేరుగా అర్హులైన దళితులకు ఆర్థిక సహాయం అందించేందుకు సలహాలు అందించాలని అఖిలపక్ష నేతలను కోరారు. దళితుల పట్ల వివక్ష దేశానికే కళంకం ‘దళితులు సామాజిక, ఆర్థిక వివక్షకు గురవడం భారత సమాజానికే కళంకం. ఇది మనసున్న ప్రతి ఒక్కరినీ కలచి వేసే విషయం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దళితుల సంక్షేమం, అభివృద్ధికి అనేక కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నది. విద్య, వ్యవసాయం సహా పలు రంగాల్లో గుణాత్మక అభివృద్ధిని సాధిస్తున్నది. అయినా ఇంకా దారిద్య్రరేఖకు దిగువన, బాటమ్ లైన్లో విస్మరించబడిన దళిత కుటుంబాలను గుర్తించి వారిని అభివృద్ధి పథాన నడిపించడమే ప్రధాన ధ్యేయంగా రూ.1200 కోట్లతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. అట్టడుగున ఉన్న వారితో సహాయాన్ని ప్రారంభించి, వారి అభ్యున్నతిని సాంకేతికతతో నిరంతరం పర్యవేక్షిస్తాం. వ్యవసాయం, సాగునీటి రంగాలను పట్టుబట్టి గాడిలో పెట్టినట్టు, దళితుల సాధికారతకు కూడా అంతే పట్టుదలతో పని చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది..’ అని సీఎం తెలిపారు. ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలి ‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ విధానాన్ని అనుసరిస్తూ దళితుల అభివృద్ధికి ఎస్సీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. చిత్తశుద్ధి గల అధికారులను నియమించుకోవాలి. దళిత యువత ఆలోచనా దృక్పథంలో గుణాత్మక మార్పు తీసుకురావాలి. ఆత్మనూన్యత నుంచి బయటపడి ఆత్మస్థైర్యంతో ఉన్నత స్థాయి ఓరియంటేషన్ అలవర్చుకునే దిశగా చర్యలు చేపట్టాలి. దళిత సమాజాన్ని సాధికారత దిశగా అవకాశాలను అందుకునే పద్ధతిలో చైతన్యం చేయాలి. గోరేటి వెంకన్న వంటి కవులను, ఇతర కళాకారుల సేవలను వినియోగించుకోవాలి’ అని సీఎం అధికారులను ఆదేశించారు. దళిత యువతకు కోటాపై పరిశీలన ‘వ్యాపారం, స్వయం ఉపాధి రంగాల్లో ప్రభుత్వం మంజూరు చేసే లైసెన్స్‌లు, పెట్టుబడి సహాయం విషయాల్లో అర్హులైన దళిత యువతకు రిజర్వేషన్లు అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తాం. దళిత విద్యార్థుల విదేశీ విద్య స్కాలర్షిప్పులకు సంబంధించిన గరిష్ట వార్షిక ఆదాయ పరిమితిని సడలించేందుకు పరిశీలన జరుపుతాం.’ అని హామీ ఇచ్చారు. దళితుల అధీనంలోని భూముల గణన ‘రాష్ట్రంలో 7,79,902 మంది ఎస్సీ రైతుల వద్ద 13,58,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. స్థిరత్వం సాధించిన ఎస్సీ కుటుంబాలకు ఇతరత్రా చేయూతనిస్తూనే, స్థిరత్వం సాధించని, రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలను మొట్ట మొదటగా ఆదుకునే కార్యాచరణ చేపట్టాలి. ఎస్సీల భూముల్లో నీళ్ళు లేని, నీళ్ళు ఉండి ఇతర వసతులు లేని భూములు కలిగి ఉన్న కుటుంబాలను గుర్తించాలి. తెలంగాణ దళిత సమాజం వద్దనున్న వ్యవసాయ భూమిని గణన చేయాలి. లెక్కలను స్థిరీకరించి ఒక సమగ్ర అవగాహనకు రావాలి. రాష్ట్రమంతా అవసరమైతే పది పదిహేను రోజులు భూముల లెక్కల మీదనే ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి. దళితుల అభివృద్ధి కోసం సామాజికంగా, ఆర్థికంగా చేపట్టాల్సిన కార్యాచరణను వేర్వేరుగా సిద్ధం చేసుకోవాలి..’ అని సీఎం అధికారులను ఆదేశించారు. సఫాయి కార్మికులకు పీఆర్సీ తరహాలో.. ‘సఫాయన్న నీకు సలాం అన్న’ అనే నినాదం నాది. సఫాయి కార్మికులు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ. ఎవరూ డిమాండ్ చేయకున్నా ప్రతిసారీ సఫాయి కార్మికుల జీతాలు పెంచుకుంటూ వస్తున్నాం. సఫాయి కార్మికులకు ఉద్యోగ భద్రతతో కూడిన నిర్మాణాత్మక జీతభత్యాల రూపకల్పన విధానం (పీఆర్సీ తరహాలో) అమలుకు చర్యలు తీసుకుంటాం..’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు. దళిత బిడ్డలు నైపుణ్యం పెంచుకోవాలి ‘సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రభుత్వాలది.. చంటి పిల్లను పెంచి పోషించే పాత్ర. నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతయి. అందుకు పాలకులే బాధ్యులు అవుతారు. ‘మేము కూడా పురోగమించ గలం’ అనే ఆత్మస్థైర్యంతో దళిత సమాజం ముందుకు పోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయాలో సూచనలు చేయండి. పైరవీలకు ఆస్కారం లేని, పారదర్శక విధానాన్ని అమలు పరుద్దాం. భూమి ఉత్పత్తి సాధనంగా ఇన్నాళ్లూ జీవనోపాధి సాగింది. మారిన పరిస్థితుల్లో పారిశ్రామిక, సాంకేతిక తదితర రంగాల్లో దళిత యువత స్వయం ఉపాధి అన్వేషించాలి. అద్దాల అంగడి మాయా లోకపు పోటీ ప్రపంచంలో, ఉపాధి అవకాశాలను అంది పుచ్చుకోవడానికి దళిత బిడ్డలు తమ నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంచుకోవాలి. అందుకు ప్రభుత్వం సహకారం అందిస్తది. గోరేటి వెంకన్న రాసిన ‘గల్లీ చిన్నది’ పాటను మనసు పెట్టి వింటే దళితుల సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయి. గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను విడివిడిగా గుర్తించి పరిష్కారాలు వెతకాలి. దళితుల సామాజిక, ఆర్థిక సమస్యలను గుర్తించి సమిష్టి కృషితో సమాధానాలు సాధించాలి’ అని ముఖ్యమంత్రి కోరారు. ఇప్పుడు అమలులో ఉన్న పథకాలను కొనసాగిస్తూనే సీఎం దళిత సాధికారత పథకాన్ని కూడా వర్తింప జేయనున్నట్టు తెలిపారు. ప్రతి లబ్ధిదారునికీ కార్డు ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు. ►రాష్ట్రంలోని దళితుల సమస్యలను ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలుగా విడదీసి గుర్తించాలి. వాటికి పరిష్కార మార్గాలను చూడాలి. గ్రామీణ, పట్టణ స్థాయిల్లో ప్రవేశపెట్టాల్సిన పథకాల వివరాలతో గైడ్‌లైన్స్ తయారు చేసి లబ్ధిదారులకు అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేయదగిన డెయిరీ వంటి స్వయం ఉపాధి అవకాశాల విషయంలో గైడెన్స్ ఇచ్చే మెకానిజం ఏర్పాటు చేయాలన్నారు. ►లబ్ధిదారులకు అందిన ఆర్థిక సాయంతో ప్రారంభించిన పథకాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. దీని కోసం మండల స్థాయిలో ఒక అధికారి ఉండాలి. ►ఆధునిక సాంకేతిక విధానాలను అవలంబించి ప్రతి లబ్ధిదారునికి ఓ కార్డును అందజేయాలి. బార్ కోడ్‌ను కేటాయించి వారి పూర్తి వివరాలు కంప్యూటర్లో నిక్షిప్తం చేసి ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. ►ఎస్సీ కుటుంబాల ప్రొఫైల్ తయారు చేయాలని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను సీఎం ఆదేశించారు. ►సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీతో దళిత విద్యార్థుల కోసం హైక్వాలిటీ స్టడీ సర్కిళ్లను ఎన్నిచోట్ల పెట్టగలమో పరిశీలించాలి. ఈ సెంటర్ల ద్వారా సివిల్ సర్వీసెస్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణనందించాలి. ►దళిత రైతుబంధు లబ్ధిదారుల వివరాలు సేకరించాలి. పెండింగులో ఉన్న దళిత ఉద్యో గుల ప్రమోషన్లను 10 నుంచి 15 రోజుల్లో పూర్తి చేయాలి. ►గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటున్న దళిత రైతులకు రైతుబంధుతో పాటు అర్హత కలిగిన వారికి సీఎం దళిత సాధికారత పథకం కూడా వర్తింపు. ►భూమి ఉన్న దళిత రైతులకే కాకుండా, భూమి లేని నిరుపేద దళిత కుటుంబాలకు కూడా బీమా సౌకర్యం. ►దళిత సాధికారత పథకం విషయంలో దళిత శాసన సభా సంఘం బాధ్యత తీసుకోవాలి. దళిత ప్రజాప్రతినిధులు నిరంతరం చర్చలు చేస్తూ మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ►సామాజిక బాధల నుంచి దళితులకు విముక్తి కలిగించాలి. ►జూలై 1 నుంచి పదిరోజుల పాటు జరగనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో రెండు రోజులు దళిత వాడల సందర్శన, వారి సమస్యల మీద, అభివృద్ధి కార్యక్రమాల మీద వివరాల సేకరణ జరపాలి. జూలై 1 లోపు మొదటి ఎస్సీ శాసనసభా సంఘం సమావేశం జరిపి ఒక జిల్లాను ఎంచుకొని ప్రభుత్వం నుండి రైతుబంధు పొందుతున్న 7,79,902 (13,38,361 ఎకరాలకు గాను) మంది దళిత రైతుల గురించి విచారించి, వాళ్ళకు ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించాలి. ►దళిత సాధికరత అమలు కోసం రిటైర్డు దళిత ఉద్యోగులు, ఎన్జీవోల సహకారం తీసుకోవాలి. ►ఇలావుండగా దళితుల మీద పోలీసుల దాడులు జరిగితే, బాధ్యులైన పోలీసులను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని అఖిల పక్షం చేసిన నిర్ణయానికి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. ►దళితులకు వందశాతం డబుల్ బెడ్ రూం ఇళ్లు కేలాయింపు అనే అంశం మీద ఒక వ్యూహం రూపొందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. -
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..!
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఆదివారం రోజున జరిగిన అఖిలపక్షభేటి ముగిసింది. సామాజికంగా, ఆర్ధికంగా దళితులు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అన్నారు. తెలంగాణలో సీఎం దళిత సాధికారత పథకం ద్వారా దళితులకు నిధులు కేటాయించనున్నారు. ఒక్కో యూనిట్‌కి రూ.10 లక్షల ఆర్థికసాయం అందించనున్నారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున 10వేల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయం అందించనుంది. సుమారు రూ.1200 కోట్లతో సీఎం దళిత సాధికారిత పథకం ప్రారంభంకానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో సమిష్ఠి నిర్ణయాన్ని తీసుకున్నారు. చదవండి: సీఎం దళిత్ ఎంపవర్మెంట్కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం: కేసీఆర్ -
మాస్కు ధరించకుంటే రూ.2 వేలు ఫైన్!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్‌ను నివారించేందుకు కఠినంగా వ్యవహరించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి మాస్కులు ధరించకుంటే 2 వేల రూపాయలు జరిమానా విధించనున్నట్లు తెలిపింది. గురువారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరోనాపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. వివిధ పార్టీల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలో కరోనా వ్యాప్తి పట్ల ముఖ్యమంత్రితో పాటు ఇతర పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ చాలా మంది మాస్కులు పెట్టుకోవటం లేదు.. అందుకోసమే రూ. 500 నుంచి 2000 రూపాయలకు జరిమానా పెంచాలని నిర్ణయించాం. ( మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నదీమ్ అరెస్ట్ ) కరోనా వల్ల ఈ సారి చట్ పూజ ఇంట్లో నిర్వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. చట్ పూజ వల్ల కరోనా వ్యాపించే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఢిల్లీలో కరోనా వ్యాప్తి నివారణకు ధార్మిక సంస్థలు, స్వచ్చంద సంస్థలు పని చేయాలి. ధార్మిక, స్వచ్ఛంద సంస్థలు ఢిల్లీ వ్యాప్తంగా, మార్కెట్లలో మాస్కులు పంచండి. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాల’’ని కోరారు. -
ప్రభుత్వం అప్పుల్లో ఉంది.. మరి ప్రయివేట్ చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: అప్పుల్లో ఉన్న ఆర్టీసీనీ ప్రయివేటీకరణ చేస్తానని చెబుతున్న సీఎం కేసీఆర్.. మరి అప్పుల్లో ఉన్న ప్రభుత్వాన్ని ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించగలరా అంటూ జస్టిస్ చంద్రకుమార్ ప్రశ్నించారు. దాదాపు 50 వేల ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతో సీఎం చెలగాటం ఆడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బుధవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో కోదండరాం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్, టీఎంయూ ఆర్టీసీ యూనియన్ అధ్యక్షుడు అశ్వద్దామరెడ్డి, ఆర్టీసీ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు కార్మికులు, తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఆర్టీసీని బతికించడమే మా లక్ష్యం ఈ సందర్భంగా అశ్వద్దామరెడ్డి మాట్లాడుతూ.. సమ్మె ముఖ్య ఉద్దేశం జీతభత్యాలు కాదని స్పష్టం చేశారు. ‘ఆర్టీసీ సమ్మెపై సీఎం చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. అయితే ఆర్టీసీని బతికించడమే మా లక్ష్యం. గత ఐదేళ్ల నుంచి ఆర్టీసీలో ఒక్క నియామకం జరగలేదు. కార్మికులు దాచుకున్న పీఎఫ్ డబ్బును ఎందుకు ఇవ్వడం లేదు?. ఆర్టీసీపై డిజీల్ భారం ఎక్కువైంది. 27 శాతం డిజీల్‌పై పన్ను వేస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థపై నాలుగో వంతు ప్రజలు ఆధారపడి ఉన్నారు. ప్రజలు మా సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు మాకు సహకరించాలి. అవసరమైతే తెలంగాణ బందుకు పిలుపునిద్దాం’అని అశ్వద్ధామరెడ్డి పేర్కొన్నారు. కాగా, తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె ఐదో రోజుకు చేరింది. ప్రజల ప్రయాణ కష్టాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దసరా పండగ ముగించుకోని తిరిగి గమ్యస్థానాలకు వెళ్లాలనుకునేవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా సమ్మెపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి, న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా పోరాడటానికి ఏం చేయాలనే దానిపై అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తున్నారు. అంతేకాకుండా ఈ సమావేశంతో అనంతరం గవర్నర్‌ను కలవాలని అఖిలపక్ష సభ్యులు భావిస్తున్నారు. -
ఆర్టీసీని బతికించడమే మా లక్ష్యం
-
ప్రత్యేక హోదా ద్రోహి చంద్రబాబు
-
మూడు నెలల్లో సస్పెండ్ చేయాలి
-
మూడు నెలల్లో సస్పెండ్ చేయాలి
న్యూఢిల్లీ: ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు వైఎస్ఆర్ సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్ఆర్ సీపీ తరఫున ఆ పార్టీ ఎంపీలు మేకపాటి, విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మేకపాటి మాట్లాడుతూ మూడు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు చేయాలని, పార్టీ మారిన సభ్యుడు స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే మూడు నెలల్లో సస్పెండ్ చేయాలని మేకపాటి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అనర్హత వేటు వేసే అధికారాన్ని స్పీకర్ నుంచి తప్పించి ఎలక్షన్ కమిషన్‌కు ఇవ్వాలని సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు ప్రజాస్వామ్యానికి మచ్చని, చట్టాన్ని సవరించకపోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని అన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణకు సంబంధించి రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రైవేట్ బిల్లు పెడతారని మేకపాటి తెలిపారు. విభజన సమయంలో ఇచ్చిన అన్ని హామీలను కేంద్ర అమలు చేయాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, విశాఖపట్నంకు ప్రత్యేక రైల్వే జోన్, రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంతో పాటు విశాఖ-చెన్నై మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని విన్నవించారు. ఎంపీ లాడ్స్ నిధులను పెంచాలని మేకపాటి కోరారు. -
రేపు అఖిల పక్ష సమావేశం: కేంద్రం
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ప్రతిష్టంభణను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనుంది. పార్లమెంట్లో లేవనెత్తుతున్న అంశాలకు సంబంధించి అభిప్రాయాలు వెల్లడించడానికి ప్రతిపక్షాలకు తగిన సమయం ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. లలిత్ గేట్ సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్న సంగతి తెలిసిందే. -
అందరి సహకారాన్ని ఆశిస్తున్నా
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా సాగుతాయని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ పార్టీల నాయకులతో ఆమె అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై వాడి వేడిగా సభలో సమరం జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ.. కార్యకలాపాల నిర్వహణకు ఆటంకం రాకుండా నేతలంతా తనకు సహకరిస్తారని హామీ ఇచ్చారన్నారు. విధి నిర్వహణలో మృతిచెందిన సాయుధ దళాల సిబ్బందికి నివాళులు అర్పించేందుకు ఇకపై లోక్‌సభలో ఒక రోజును కేటాయించనున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం అఖిలపక్ష సమావేశంలో తెలిపారు. సమావేశాలకు, సమావేశాలకు మధ్య కాలంలో చనిపోయిన ప్రస్తుత, మాజీ పార్లమెంటు సభ్యులకు, ఉగ్రవాద ఘటనలు, ప్రకృతి వైపరీత్యాలు, ఉభయ సభల్లో నివాళులు అర్పించటం సంప్రదాయంగా ఉంది. విధి నిర్వహణలో చనిపోయిన భద్రతా బలగాల సిబ్బందికి కూడా పార్లమెంటులో నివాళులు అర్పించాలన్న సూచనను సభ్యులందరూ ఆహ్వానించారని ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. పార్లమెంటులో 64 పెండింగ్ బిల్లులు వివాదాస్పద భూ సేకరణ బిల్లుతో సహా మొత్తం 64 బిల్లులు పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్నాయని.. పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే అధ్యయన బృందం వెల్లడించింది. ఇందులో.. జీఎస్టీ బిల్లు, అవినీతి నిరోధక (సవరణ బిల్లు), ప్రజావేగుల భద్రత (సవరణ) బిల్లు వంటి ముఖ్యమైనవి కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వామపక్షాల ఆందోళనలు న్యూఢిల్లీ: లలిత్‌గేట్, వ్యాపమ్ స్కాంలలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ బీజేపీ నేతలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చూస్తూ సోమవారం దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. ఢిల్లీ ఆందోళనలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొన్నారు. -
'సర్కార్ వైఖరితో విద్యారంగంలో అయోమయం'
టీఆర్ఎస్ ప్రభుత్వ అస్పష్ట వైఖరితో విద్యారంగంలో అయోమయం నెలకొందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. పాఠ్యాంశాల మార్పు, ఫాస్ట్ పథకం, ఎంసెట్, పోటీ పరీక్షల అంశంపై గందరగోళాన్ని తొలగించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ దృక్కోణంతో పాఠ్యాంశాల మార్పు పేరుతో తెలుగు నేతల చరిత్రను తొలగించాలనుకోవడం సరికాదని చెప్పారు. దేశం, తెలుగుజాతి కోసం కృషిచేసిన మాదిగల చరిత్రను తెలంగాణ పాఠ్యాంశాల నుంచి తొలగించడం తగదన్నారు. సిలబస్ మార్పు పేరుతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు పెండింగ్‌లో పెట్టడం అన్యాయమని పొంగులేటి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. -
ఈ నెల 16న తెలంగాణ అఖిలపక్ష సమావేశం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరోసారి అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ నెల 16న ఈ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ అఖిల పక్ష సమావేశం జరిగింది. నాలుగున్నర పాటు సాగిన ఈ భేటీలో హైదరాబాద్ సంబంధిత అంశాలపై చర్చించారు. కాగా హైదరాబాద్ విషయంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. గణేష్ నిమజ్జనానికి విడిగా వినాయక్‌సాగర్ నిర్మాణాన్ని బీజేపీ వ్యతిరేకించింది. హుస్సేన్ సాగర్‌లోని గణేష్ నిమజ్జనం చేయాలని బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు. -
రాజకీయానికి వేళకాదు
‘సమైక్య’ అఖిలపక్షం అభిప్రాయం ఇకపైనా ఉద్యోగ జేఏసీ ద్వారానే ఉద్యమం భేటీని తుస్సుమనిపించిన టీడీపీ, కాంగ్రెస్ రాజకీయ జేఏసీ అవసరమే లేదన్న వైనం వైఎస్సార్సీపీ అనుమానించినంతా జరిగింది విభజనవాదులతో వేదిక పంచుకోబోమని ముందే చెప్పిన పార్టీ సీమాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పాటుచేయ తలపెట్టిన రాజకీయ జేఏసీకి ఇది సరైన సమయం కాదని శనివారం సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశం తేల్చేసింది. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన ఈ తరుణంలో రాజకీయ జేఏసీ ఏర్పాటుకు యత్నించడం సమయాన్ని వృథా చేయడమేనని నిర్ధారణకు వచ్చింది. ఇప్పటిదాకా నిర్వహించిన తరహాలోనే భవిష్యత్తులో కూడా ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని కొనసాగించాలని, రాజకీయ పార్టీలు దానికి మద్దతు ఇవ్వాలని తీర్మానించింది. అవసరమైతే అన్ని పార్టీలతో కలిసి, ఉద్యోగ సంఘాల ఉద్యమానికి తోడుగా సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని, సీమాంధ్రలో జిల్లాలవారీగా కూడా జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని మరోసారి చెప్పింది. రాష్ట్ర విభజన ప్రక్రియను అడ్డుకునే అవకాశం ఇప్పుడు ఎమ్మెల్యేల చేతుల్లో ఉందని, కాబట్టి విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో మూకుమ్మడిగా గళం విప్పటమే గాక అఫిడవిట్లు సమర్పించాలని ఆయా పార్టీలను కోరింది. ‘‘సందర్భాన్ని బట్టి రాష్ట్రపతిని కలిసి అఫిడవిట్లు అందజేయాలి. మెజార్టీ ప్రజాప్రతినిధులు విభజనకు వ్యతిరేకంగా ఉన్నారన్న స్పష్టమైన విషయాన్ని ఆయన ముందుంచాలి. తద్వారా బిల్లుకు అంగీకారం తెలపడంపై ఆయన పునరాలోచించే పరిస్థితి తేవాలి. రాష్ట్రపతిని కలిసే విషయంలో పార్టీలన్నీ కలిసి రావాలి’’ అని వేదిక పక్షాన ఏపీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు కోరారు. ఉద్యమ కార్యాచరణ సిద్ధమయ్యాక దాని ఆచరణలో కూడా పార్టీల పూర్తి సహకారం కావాలన్నారు. రాజకీయ జేఏసీ అవసరమే లేదు: కాంగ్రెస్, టీడీపీ రాష్ట్ర విభజనకు సహకరిస్తున్న పార్టీలతో వేదికను పంచుకోవటం ఇష్టం లేదని పేర్కొంటూ ఈ అఖిలపక్షంలో పాల్గొనేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరాకరించడం తెలిసిందే. ఈ విషయంలో వైఎస్సార్సీపీ ఏదైతే అనుమానించిందో, అఖిలపక్షంలో సరిగ్గా అదే జరిగింది. సీమాంధ్ర ఉద్యమానికి ఊపిరులూదేందుకు రాజకీయ జేఏసీ ఏర్పాటుకు ఈ అఖిలపక్షం వేదికవుతుందని భావించగా, టీడీపీ, కాంగ్రెస్ నేతలు మాత్రం దాన్ని తుస్సుమనిపించారు. అసెంబ్లీకి చేరిన బిల్లు అక్కడితో ఆగిపోవాలంటే, అందులో రాజకీయ పార్టీలు పోషించాల్సిన పాత్రే చాలా ఎక్కువగా ఉన్నందున రాజకీయ జేఏసీపై నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న చర్చ ప్రారంభం కాగానే రెండు పార్టీల నేతలు అందుకు పూర్తి వ్యతిరేక అభిప్రాయాలు వెల్లడించారు. రాజకీయ జేఏసీ అవసరమే లేదన్నారు. ఉద్యోగ సంఘాలు యథావిధిగా ఉద్యమం నిర్వహిస్తే తమ వంతు చేయూతనందిస్తామంటూ తేల్చేశారు. దాంతో అఖిలపక్షం ఏర్పాటే హాస్యాస్పదంగా మారిపోయింది. ఏదో హడావుడి చేస్తున్నారంటూ జనం దృష్టిలో పడేందుకు చేసిన ప్రయత్నంగా మారింది. ఎలాంటి కీలక నిర్ణయాలూ తీసుకోకుండా రెండు గంటల పాటు సమావేశాన్ని నిర్వహించి, అంతటితో మమ అనిపించి నేతలు జారుకున్నారు. అఖిలపక్షంతో ఉద్యమానికి కీలక మలుపు ఖాయమనేలా ఎన్నో రోజులుగా ఉద్యోగ సంఘాల నేతలు చెబుతూ వస్తున్నదంతా వ్యర్థమయ్యేలా కాంగ్రెస్, టీడీపీ నేతలు వ్యవహరించారు. పైగా ఇంతకాలం తమను ఉద్యమంలో కలుపుకోలేదంటూ టీడీపీ నేతలు ఒక దశలో ఏపీ ఎన్జీఓల సంఘం నేతలపై ఎదురుదాడికి కూడా దిగారు. ప్రస్తుతమున్న ‘వ్యవస్థ’తోనే భావి ఉద్యమాన్ని నిర్వహించాలని నిర్ణయించామని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అఖిలపక్షం తర్వాత విలేకరులకు చెప్పడం విశేషం. కాంగ్రెస్ తరపున ఎంపీ సబ్బం హరి, మంత్రి శైలజానాథ్, ఉగ్ర నరసింహారెడ్డి, టీడీపీ నుంచి ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు కేశవ్, కె.యి.ప్రభాకర్, శివరామరాజు ఇందులో హాజరయ్యారు. ఎమ్మెల్సీ శ్రీనివాసులు నాయుడు, సీపీఎం నుంచి వై.వెంకటేశ్వరరావు, ఎస్.వీరయ్య, లోక్‌సత్తా నుంచి శ్రీనివాసరావు పాల్గొన్నారు. సొంత ఉద్యమాలే: సీపీఎం, లోక్‌సత్తా ‘‘పార్టీలపరంగా కాకుండా ఆయా పార్టీల్లోని నేతలు ప్రాంతాలుగా విడిపోయి చేస్తున్న ఉద్యమంలో కలిసి రాకూడదన్న ఉద్దేశంతోనే ఇంతకాలం సమైక్యోద్యమాన్ని సొంతంగా నిర్వహించాం. ఇక ముందు కూడా ఇదే పంథాను కొనసాగిస్తాం’’ అని సీపీఎం నేతలు వై.వెంకటేశ్వరరావు, వీరయ్యలు భేటీ అనంతరం స్పష్టం చేశారు. లోక్‌సత్తా నేత శ్రీనివాసరావు కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మున్ముందు ఉద్యోగ సంఘాలు చేసే సమైక్యోద్యమానికి క్షేత్రస్థాయిలో మద్దతు ఇస్తామని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల చెప్పారు. సమైక్యానికి కట్టుబడ్డామంటూ ఎమ్మెల్యేలతో రాష్ట్రపతికి అఫిడవిట్లు పంపే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగ సంఘాల ఉద్యమానికి కాంగ్రెస్ పక్షాన మద్దతుంటుందని, ఇతర విషయాలపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శైలజానాథ్ అన్నారు. అఖిలపక్షం విజయవంతం: అశోక్‌బాబు ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో విభజనకు వ్యతిరేకంగా మాట్లాడటంతో పాటు సమైక్యానికి కట్టుబడి ఉన్నామంటూ అఫిడవిట్లు ఇవ్వాలంటూ భేటీ తీర్మానించిందని అశోక్‌బాబు చెప్పారు. ఉద్యమం మొదలయ్యాక మున్నెన్నడూ లేనివిధంగా సమైక్యానికి అనుకూలంగా ఉన్న పార్టీలను ఒక్కచోటికి తెచ్చినందుకు ఈ భేటీ విజయవంతమైందనే భావిస్తున్నామన్నారు. ‘‘సమైక్యానికి కట్టుబడి ఉన్నామని ఇప్పటికే స్పష్టం చేసిన వైస్సార్సీపీ సొంత కారణాలతో భేటీకి రాలేదు. అది ఆ పార్టీ విధాన నిర్ణయమైనందున దాన్ని గౌరవిస్తాం’’ అన్నారు. -
బ్రిజేష్‌కుమార్ తీర్పుపై అఖిలపక్ష భేటీ
కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వెలువరించిన తీర్పుపై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 3న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత అఖిలపక్ష భేటి నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి సమావేశమయ్యారు. బ్రిజేష్‌కుమార్ తీర్పుపై ప్రభుత్వం సరిగా స్పందించలేదనే విమర్శలు వస్తున్నాయి. శనివారం ఉదయం జరగాల్సిన సుదర్శన్ రెడ్డి ప్రెస్‌మీట్ వాయిదా పడింది. కృష్ణా మిగులు జలాల పంపిణీలో రాష్ట్రానికి అన్యాయం జరిగిన సంగతి తెలిసిందే.