సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్‌ను నివారించేందుకు కఠినంగా వ్యవహరించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి మాస్కులు ధరించకుంటే 2 వేల రూపాయలు జరిమానా విధించనున్నట్లు తెలిపింది. గురువారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరోనాపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. వివిధ పార్టీల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలో కరోనా వ్యాప్తి పట్ల ముఖ్యమంత్రితో పాటు ఇతర పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ చాలా మంది మాస్కులు పెట్టుకోవటం లేదు.. అందుకోసమే రూ. 500 నుంచి 2000 రూపాయలకు జరిమానా పెంచాలని నిర్ణయించాం. ( మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నదీమ్ అరెస్ట్ )
కరోనా వల్ల ఈ సారి చట్ పూజ ఇంట్లో నిర్వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. చట్ పూజ వల్ల కరోనా వ్యాపించే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఢిల్లీలో కరోనా వ్యాప్తి నివారణకు ధార్మిక సంస్థలు, స్వచ్చంద సంస్థలు పని చేయాలి. ధార్మిక, స్వచ్ఛంద సంస్థలు ఢిల్లీ వ్యాప్తంగా, మార్కెట్లలో మాస్కులు పంచండి. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాల’’ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment