చెన్నై: భారత రవాణా రంగంలో మరో కలికితురాయి. ఐఐటీ మద్రాస్,భారత్ రైల్వేలు, ఇతర స్టార్టప్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారత్ తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. ఐఐటీ చెన్నైలోని తైయూర్ క్యాంపస్‌లో 410 మీటర్ల హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్‌ను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా ప్రస్తావించారు.
భారత్ తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ (410 మీటర్లు) పూర్తయింది. రైల్వేస్, ఐఐటీ-మద్రాస్ ఆవిష్కార్ హైపర్‌లూప్ బృందం,ఓ స్టార్టప్ సంస్థ భాగస్వామ్యంలో ఈ హైపర్ లూప్‌ను నిర్మించినట్లు చెప్పారు.
హైపర్ లూప్ టెక్నాలజీ
హైపర్ లూప్ అనేది ఓ ప్రత్యేక నిర్మాణం. బాహ్యంగా అంటే రైలు మార్గంపై గానీ.. రైలుకు వెలుపల గానీ ఎటువంటి గాలి అసలుండదు. ఈ హైపర్ లూప్ వాక్యూం రూపంలో ఉన్న గొట్టాలలో ప్రయాణిస్తుంది. దీని కారణంగా దాని మీద ఏరోడైనమిక్ ప్రభావం ఉండదు. అంటే ఏ విధమైన బాహ్యపరమైన ఒత్తిడి రైలుపై గానీ..దాని వేగంపై గానీ ప్రభావం చూపే అవకాశం లేదు. ఈ కారణంగానే హైపర్ లూప్ టెక్నాలజీలో రైలు అత్యంత వేగంగా ప్రయాణిస్తుందనేది ఓ సిద్ధాంతం. ఇప్పుడి హైపర్‌లూప్ ట్రాక్‌ను టెస్ట్ చేసేందుకు సర్వం సిద్ధమైంది.
సాధారణంగా భూమిపై ప్రయాణించే వాహనాలకు గాలి అనేది పెద్దగా ఆటంకం. దానివల్ల అవి ఒక పరిమితికి మించిన వేగంతో రోడ్డుపై వెళ్లడం సాధ్యంకాదు. కానీ గాలి పీడనం బాగా తక్కువగా ఉండే హైపర్ ల్యూబ్ ట్యూబ్‌లోకి బోగీని ప్రవేశపెడితే, దాని వేగంగావెళ్లొచ్చు. ఈ హైపర్‌లూప్ ఈ పద్దతిపై ట్రయల్ రన్ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment