హైపర్‌లూప్‌ ‘పాడ్‌’.. అరగంటలో 350 కిలోమీటర్ల ప్రయాణం.. | Ashwini Vaishnaw Key Comments On longest Hyperloop tube IIT Madras | Sakshi
Sakshi News home page

హైపర్‌లూప్‌ ‘పాడ్‌’.. అరగంటలో 350 కిలోమీటర్ల ప్రయాణం..

Published Sun, Mar 16 2025 11:32 AM | Last Updated on Sun, Mar 16 2025 12:37 PM

 Ashwini Vaishnaw Key Comments On longest Hyperloop tube IIT Madras

చెన్నై: భూమి మీద విమాన వేగంతో ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చే హైపర్‌లూప్‌ ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేశారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌. ఆసియాలో అతి పొడవైన హైపర్‌లూప్ ట్యూబ్ (410 మీ) త్వరలో అందుబాటులోకి రానుందన్నారు. ఇదే సమయంలో ‘పాడ్‌’(రైలు బోగీ) నమూనాకు సంబంధించిన ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ఐఐటీ మద్రాస్‌లోని హైపర్‌లూప్ ట్రాప్‌ పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ సహాయంతో అభివృద్ధి చేస్తున్న హైపర్‌లూప్ ట్యూబ్‌ పరిశీలించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘భారత్‌లో త్వరలోనే ప్రపంచంలోనే అతి పొడవైన హైపర్‌లూప్ ట్యూబ్ అవుతుంది. దీని పొడవు 410 మీటర్లు ఉంటుంది. రానున్న కాలంలో మరో 40 మీటర్లు పొడగిస్తాం. ఆసియాలోనే అతి పొడవైన హైపర్‌లూప్ ఇది. హైపర్‌లూప్ రవాణా కోసం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి అభివృద్ధి చేశాం. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న హైపర్‌లూప్ రవాణా సాంకేతికత ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో మంచి ఫలితాలను ఇచ్చింది. త్వరలోనే అందుబాటులోకి వస్తుందనుకుంటున్నాం’ అని అన్నారు. మరోవైపు.. మంత్రి అశ్విని వైష్ణవ్‌ ట్విట్టర్‌ వేదికగా.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.

హైపర్‌లూప్‌ టెస్ట్‌ ట్రాక్‌ను రైల్వే మంత్రిత్వశాఖ తోడ్పాటుతో మద్రాస్‌ ఐఐటీ అభివృద్ధి చేసింది. ఈ తరహా రవాణా వ్యవస్థ సాకారమైతే 350 కిలోమీటర్ల దూరంలోని గమ్యస్థానాన్ని అరగంటలోపే చేరుకోవచ్చు. హైపర్‌లూప్‌ను ఐదో రవాణా విధానంగా అభివర్ణిస్తారు. హైపర్‌లూప్‌ టెక్నాలజీలో హైపర్‌లూప్ అనేది ఓ ప్రత్యేక నిర్మాణం. బాహ్యంగా అంటే రైలు మార్గంపై గానీ.. రైలుకు వెలుపల గానీ ఎటువంటి గాలి అసలుండదు. ఈ హైపర్ లూప్ వాక్యూం రూపంలో ఉన్న గొట్టాలలో ప్రయాణిస్తుంది. దీని కారణంగా దాని మీద ఏరోడైనమిక్ ప్రభావం ఉండదు. అంటే ఏ విధమైన బాహ్యపరమైన ఒత్తిడి రైలుపై గానీ.. దాని వేగంపై గానీ ప్రభావం చూపే అవకాశం లేదు. ఈ కారణంగానే హైపర్ లూప్ టెక్నాలజీలో రైలు అత్యంత వేగంగా ప్రయాణిస్తుందనేది ఓ సిద్ధాంతం. వీటిలో రైలు బోగీలను పోలిన పాడ్‌లు ప్రయాణిస్తాయి.

సాధారణంగా భూమిపై ప్రయాణించే వాహనాలకు గాలి అనేది పెద్దగా ఆటంకం. దానివల్ల అవి ఒక పరిమితికి మించిన వేగంతో రోడ్డుపై వెళ్లడం సాధ్యంకాదు. కానీ గాలి పీడనం బాగా తక్కువగా ఉండే హైపర్ ల్యూబ్ ట్యూబ్‌లోకి బోగీని ప్రవేశపెడితే, దాని వేగంగా వెళ్లొచ్చు. గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగాన్ని ఇవి అందుకునే వీలుందని చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement