Hyperloop train
-
విమానం కంటే వేగంగా వెళ్లే రైలు.. ప్రత్యేకతలివే..
హైస్పీడ్ ట్రైన్స్ తయారుచేయడంలో చైనా మరో అడుగు ముందుకేసింది. తాజాగా అత్యాధునిక సూపర్ సోనిక్ అల్ట్రా హైస్పీడ్ ట్రైన్‌ను అభివృద్ధి చేసినట్లు ఆ దేశ పరిశోధకులు ప్రకటించారు. ఆకృతిలో రైలును పోలి, వేగంలో విమానానికి తీసిపోని ఈ ట్రైన్‌కు ‘టీ-ఫ్లైట్’ అని పేరు పెట్టారు. ప్రత్యేకతలు.. ఈ ట్రైన్‌కు చక్రాలు ఉండవు. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ శక్తితో ట్రాక్‌పై గాలిలో తేలియాడుతూ నడుస్తుంది. దీంతో పట్టాలు, చక్రాలమధ్య ఘర్షణ అనే సమస్యే ఉండకపోవడంతో లక్షిత వేగాన్ని రైలు సులభంగా అందుకోగలదు. ఎయిరో డైనమిక్స్ సూత్రాలకు అనుగుణంగా ప్యాసింజర్ల కోసం ఏర్పాటు చేసిన రైక్లెన్డ్ సీట్లును ఏర్పాటు చేశారు. టాప్ స్పీడ్‌లో వుహాన్ నుంచి బీజింగ్ (వెయ్యి కిలోమీటర్లు)కు అరగంటలో చేరుకొంటుంది. రైలుపైన ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ద్వారా దానికి అవసరమైన శక్తి అందుతుంది. ప్రస్తుత వేగం – గంటకు 623 కి.మీ ప్రయాణిస్తుందని పరిశోధకులు చెప్పారు. మరింత అభివృద్ధి చేశాక గంటకు 2 వేల కి.మీ ప్రయాణిస్తుంది. ప్రత్యేక ట్యూబ్ గుండా ప్రయాణించే టీ-ఫ్లైట్‌లో మాగ్లెవ్ సాంకేతికత సాయంతో ఘర్షణ లేకుండా ప్రయాణించవచ్చు. ఇదీ చదవండి: ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు.. చివరి తేదీ ఎప్పుడంటే.. -
విమానం కంటే స్పీడ్‌గా వెళ్లే రైలు.. కథ కంచికే..
శబ్దవేగంతో దూసుకెళ్లే విమానాల గురించి మనం వినే ఉంటాం. మరి అంతవేగంగా వెళ్లగలిగే ఫ్లైట్‌ని రూపొందించిన శాస్త్రవేత్తలు..అలాంటి ఓ బస్సునో రైలునో ఎందుకు సృష్టించలేకపోతున్నారో ఎప్పుడైనా అనుమానం కలిగిందా? మన చుట్టూ ఉన్న గాలే అందుకు కారణం. వేగంగా వెళ్లే ఏ వస్తువునైనా అది అడ్డుకుంటుంది. ఆ ఘర్షణలో అగ్గిరాజుకుంటుంది. అందుకే విమానాలు కూడా భూవాతావరణంలో తక్కువ వేగంతో వెళతాయి. ఆకాశంలోకి అంటే శూన్యంలోకి వెళ్లాకే వేగం పుంజుకుంటాయి. ‘మరి అదే శూన్యాన్ని నేలపైనా సృష్టించగలిగితే..? అందుకోసం ఓ పెద్ద ట్యూబుని ఏర్పాటుచేస్తే... అందులో ప్రయాణం సాగితే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన వచ్చింది టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌కి! ఈ కొత్త ఆలోచనకి అతను పేటెంట్ తీసుకోలేదు. దీనిపైన ఎవరైనా ప్రయోగాలు చేయొచ్చంటూ ప్రకటించాడు. దాంతో వర్జిన్ హైపర్‌లూప్, జెలెరస్ వంటి పదికిపైగా సంస్థలు దీని తయారీలో తలమునకలయ్యాయి. ఇందుకోసం వేలకోట్లు ఖర్చుపెడుతున్నాయి. తాజాగా చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్న హైపర్‌లూప్ స్టార్టప్‌ల్లో ప్రధాన స్టార్టప్‌గా ఉన్న వర్జిన్ హైపర్‌లూప్ దాని కార్యకలాపాలు మూసివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 31లోపు రిచర్డ్ బ్రాన్సన్ ఆధ్వర్యంలోని వర్జిన్ గ్రూప్‌నకు చెందిన ఈ ప్రాజెక్ట్‌ను నిలిస్తేస్తున్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఎలాన్‌మస్క్‌కు 2013లో హైపర్‌లూప్ అనే ఆలోచన వచ్చినప్పటి నుంచి 2014లో ‘హైపర్‌లూప్ వన్’ స్టార్టప్‌ను స్థాపించి వందల కోట్లును ఖర్చు చేశారు. టెక్నికల్ డెమోలు, టెస్ట్ ట్రాక్‌లు మినహా ప్రాజెక్ట్‌లో ఎలాంటి పురోగతి లేదని తెలిసింది. అయితే తాజాగా సంస్థ తన ఆపరేషన్స్‌ను నిలిపేస్తున్నట్లు ప్రకటించడంతో టెక్నాలజీ రంగంలో కొంత ఆందోళన మొదలైనట్లు సమాచారం. హైపర్‌లూప్ వన్ 2014లో ప్రారంభించిన తర్వాత బ్రాన్సన్ 2017లో అందులో పెట్టుబడి పెట్టారు. దాంతో అప్పటి నుంచి వర్జిన్ హైపర్‌లూప్ వన్ అనే పేరుతో దీన్ని పిలుస్తున్నారు. కానీ 2018లో జమాల్ ఖషోగ్గి హత్య తర్వాత బ్రాన్సన్ సౌదీ అరేబియాను తీవ్రంగా విమర్శించారు. దాంతో సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హైపర్‌లూప్ ప్రాజెక్ట్‌పై ప్రభావం పడంది. ఫలితంగా బ్రాన్సన్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఇదీ చదవండి: ఇకపై ఆధార్‌కు పాస్‌పోర్ట్ తరహా వెరిఫికేషన్.. కానీ.. అనంతరం దుబాయ్ పోర్ట్ ఆపరేటర్ డీపీ వరల్డ్ హైపర్‌లూప్ వన్ స్టార్టప్‌లో మెజారిటీ వాటా కలిగి ఉండడంతో కంపెనీకు సంబంధించి పూర్తి నియంత్రణ దాని చేతిలోకి వెళ్లిపోయింది. 2022 ప్రారంభంలో ఆ సంస్థ హైపర్‌లూప్ వన్‌లోని సగానికిపైగా సిబ్బందిని తొలగించింది. దాంతోపాటు డీపీ వరల్డ్ కార్గోసేవలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తోంది. ఫలితంగా హైపర్‌లూప్ వన్ మేధో సంపత్తి ముగిసిపోతోందని టెక్ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ స్టార్టప్‌కు చెందిన కొన్ని ఆస్తులను సైతం డీపీ వరల్డ్ విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. -
హైపర్‌లూప్.. గంటకు 1,200 కి.మీ. వేగంతో దూసుకెళ్లేలా..
ఢిల్లీలో ఉంటూ.. ముంబైలో ఉద్యోగం చేయొచ్చా? కుదురుతుంది కాకపోతే జీతం లక్షల్లో, కోట్లలో ఉండాలి.. వేలకు వేలు పోసి విమానాల్లో ప్రయాణించాలి.. అయితే అంత అవసరం లేదంటోంది హైపర్‌లూప్! గంటకు 1,200 కిలోమీటర్ల వేగంతో.. గొట్టాల్లో దూసుకెళ్లేలా చేయగలిగేదే హైపర్‌లూప్ ఈ రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తే.. కారుకు అయ్యే ఖర్చుతోనే దూర ప్రయాణాలు చేయొచ్చని చెబుతోంది.. దేశంలో హైపర్‌లూప్ కార్యకలాపాలు, ప్రత్యేకతలపై సంస్థ భారతీయ వ్యవహారాల డైరెక్టర్ నౌషాద్ ఊమర్ ‘సాక్షి’కి ఇచ్చిన వివరాలు.. సాక్షి: భారత్‌లో ఎక్కడెక్కడ హైపర్‌లూప్ వ్యవస్థలు ఏర్పాటు అవుతాయి? నౌషాద్: భారత్‌లో ముంబై–పుణే మధ్య హైపర్‌లూప్ ఏర్పాటు కానుంది. ఈ రెండు మహా నగరాల మధ్య ఉన్న 200 కిలో మీటర్ల దూరాన్ని అరగంట కంటే తక్కువ సమయంలో ప్రయాణించొచ్చు. కారులో వెళ్తే.. 3.50 గంటలు పడుతుంది. కరోనా కారణంగా ప్రాజెక్టు పురోగతి కొంత మందగించినా ప్రస్తుతం మళ్లీ పట్టాలెక్కనుంది. కర్ణాటకలోని బెంగళూరు కేంద్రం నుంచి అక్కడి విమానాశ్రయానికి 10 నిమిషాల్లోనే చేరుకునేలా హైపర్‌లూప్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల నివేదిక సిద్ధం చేస్తున్నాం. పలు మార్గాలను పరిశీలిస్తున్నాం. 2019 డిసెంబర్లో పంజాబ్ ప్రభుత్వ రవాణా శాఖతో హైపర్‌లూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్తర భారతదేశంలో తగిన హైపర్‌లూప్ మార్గాల అన్వేషణ కొనసాగిస్తాం. ఇతర రాష్ట్రాలతో చర్చలు జరిపి దేశం మొత్తం హైపర్‌లూప్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలన్నది మా లక్ష్యం. సాక్షి: ముంబై–పుణే మార్గం గురించి చెప్పండి? నౌషాద్: రెండు దశల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ముందుగా 11 కిలోమీటర్ల పొడవైన హైపర్‌లూప్ మార్గాన్ని నిర్మిస్తాం. హైపర్‌లూప్ పూర్తిగా సురక్షితమైందని ఈ ట్రాక్ ద్వారా నిరూపించి, ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తర్వాత రెండో దశలో మిగిలిన మార్గం నిర్మాణాన్ని చేపడతాం. ఈ ప్రాజెక్టు కారణంగా మహారాష్ట్రకు సుమారు రూ.3,600 కోట్ల పెట్టుబడులు వస్తాయి. హైపర్‌లూప్ నిర్మాణానికి అవసరమైన హైటెక్ ఫ్యాక్టరీ కొత్త ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా స్థానిక తయారీ రంగానికి ఊతమిస్తుంది. ప్రాజెక్టు రెండో దశ మొదలు కాగానే మహారాష్ట్రకు వచ్చే పెట్టుబడులు రూ.72,000 కోట్లకు చేరతాయి. మొత్తమ్మీద 18 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌లూప్ సేఫ్టీ సర్టిఫికెట్‌ను 2025 కల్లా సాధించగలమని మా నమ్మకం. వాణిజ్యస్థాయిలో హైపర్‌లూప్ తొలి మార్గం 2030 నాటికి మొదలవుతుంది. ముంబై–పుణే మార్గంలో ఏడాదికి 20 కోట్ల మంది ప్రయాణించేందుకు హైపర్‌లూప్ వీలు కల్పిస్తుంది. ఈ మార్గం పూర్తయితే ఏడాదికి 15 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నివారించవచ్చు. బస్సు, రైలు, విమానాల మాదిరిగా హైపర్‌లూప్ టైమ్ టేబుల్ ప్రకారం నడవదు. ప్రయాణికులు ఎప్పుడు వస్తే అప్పుడే స్టార్ట్ అవుతుంది. సాక్షి: హైపర్‌లూప్ ప్రత్యేకతలేంటి? నౌషాద్: ఇది పూర్తిగా విద్యుచ్ఛక్తితో పనిచేసే రవాణా వ్యవస్థ. రైలు కంటే 4 రెట్లు, హైస్పీడ్ రైలు కంటే 50%, విమాన ప్రయాణం కంటే 10 రెట్లు ఎక్కువ ఇంధన సామర్థ్యంతో పని చేస్తుంది. హైపర్‌లూప్ మలుపులు విమానం మాదిరిగానే ఉంటాయి. గాలి లేని గొట్టంలో ప్రయాణిస్తుంది కాబట్టి మలుపులు తిరిగేందుకు చాలా తక్కువ స్థలం సరిపోతుంది. 6 రెట్లు ఎక్కువున్న ఎత్తులను రైలుతో పోలిస్తే హైపర్‌లూప్ సులువుగా అధిగమించగలదు. సాక్షి: హైపర్‌లూప్ ప్రయాణం ఖరీదైన వ్యవహారమా? నౌషాద్: కానే కాదు. టికెట్ ధరలు భరించలేనంతగా ఉంటే ఎవరూ హైపర్‌లూప్ ఎక్కరని తెలుసు. సామాన్యులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు హైపర్‌లూప్ ఉపయోగపడుతుందని నమ్ముతున్నాం. చిన్న నగరాల్లో నివసించేవారు రోజూ ముంబైలాంటి నగరాలకు వెళ్లి పనిచేసేందుకు ఇది పనికొస్తుంది. మార్గాన్ని బట్టి టికెట్ ధర ఎంతన్నది చెప్పడం కష్టమే. కానీ ఇటీవలే అమెరికాలోని మిస్సోరిలో హైపర్‌లూప్ ద్వారా వెళ్లిన దూరం.. కారులో వెళ్తే అయ్యే పెట్రోల్ ఖర్చు కన్నా తక్కువగా ఉంటుందని తేలింది. – సాక్షి, హైదరాబాద్ -
అరగంటలో 200 కిలోమీటర్లు
గంటకు పన్నెండొందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రవాణా వ్యవస్థ హైపర్‌లూప్ కొంగొత్త రూపు సంతరించుకుంది. శూన్యంతో కూడిన గొట్టాల్లో అయస్కాంత క్షేత్రాలపై తేలియాడుతూ వెళ్లే హైపర్‌లూప్ బోగీలు అందుబాటులోకి వచ్చేందుకు ఇంకొన్నేళ్ల సమయం పడుతుంది. కానీ ఇందుకు సన్నాహాలు మాత్రం జోరందుకుంటున్నాయి. కొన్ని నెలల క్రితమే భారతీయ ఇంజనీర్ తనయ్ మంజ్రేకర్ హైపర్‌లూప్‌లో ప్రయాణించిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించగా.. తాజాగా వర్జిన్ హైపర్‌లూప్ సంస్థ కొత్త పాడ్(బోగీ) డిజైన్‌ను విడుదల చేసింది. కమర్షియల్ వెహికల్ అని పిలుస్తున్న పాడ్‌లో చాలా హైటెక్ హంగులను సమకూర్చారు. వైర్లెస్ చార్జింగ్ వీటిల్లో ఒకటైతే.. సహజ వెలుతురును ప్రతిబింబించేలా ‘ఆర్టిఫిషియల్ స్కైలైట్’ మరొకటి. ఒక్కో పాడ్‌లో 28 మంది సులభంగా కూర్చుని ప్రయాణించవచ్చు. అతి త్వరలో వాణిజ్య స్థాయి వినియోగం.. ఈ హైపర్‌లూప్‌లో ప్రయాణించేందుకు అయ్యే ఖర్చు కారు ప్రయాణానికి దాదాపు సమానంగా, విమాన చార్జీలకంటే తక్కువగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. గంటల సమయం పట్టే ప్రయాణాలను నిమిషాల్లో పూర్తి చేయగలిగితే సమయం ఆదా అవు తుందని, దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని కంపెనీ చైర్మన్, డీపీ వరల్డ్ సీఈవో సుల్తాన్ బిన్ సులాయెం తెలిపారు. హైపర్‌లూప్ టెక్నాలజీ సామర్థ్యాన్ని తాము ఇప్పటికే ప్రపంచానికి తెలిపామని, అతి త్వరలో వాణిజ్యస్థాయి వినియోగమూ మొదలవుతుందని ఆయన వివరించారు. ముంబై నుంచి పుణేకు ఉన్న దాదాపు రెండు వందల కిలోమీటర్ల దూరాన్ని హైపర్‌లూప్‌లో అరగంటలో ముగించవచ్చునని వర్జిన్ హైపర్‌లూప్ మేనేజింగ్ డైరెక్టర్ (మిడిల్ ఈస్ట్ అండ్ ఇండియా) హర్జ్ ధలీవాల్ తెలిపారు. మహారాష్ట్రతోపాటు భారత్‌లోని పలు ప్రాంతాల్లో హైపర్‌లూప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వివరించారు. – సాక్షి, హైదరాబాద్ -
తొలిసారి హైపర్‌లూప్‌లో ప్రయాణికులు
వాషింగ్టన్ : అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో రిచర్చ్ బ్రాన్సన్కు చెందిన వర్జిన్ గ్రూప్ ఆదివారం నాడు హైపర్ లూప్ రైలును(కత్రిమ సొరంగ మార్గం గుండా అతివేగంగా నడిచే రైలు) తొలిసారి ప్రయాణికులతో నడిపి విజయం సాధించింది. గతంలో 400 సార్లు హైపర్ లూప్ రైలు ట్రయల్స్‌ను నిర్వహించిన ఈ సంస్థ ప్రయాణికులతో నడపడం మాత్రం ఇదే మొదటిసారి. హైపర్‌లూప్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జోష్ జోజెల్, డైరెక్టర్ ఆఫ్ ప్యాసింజర్ ఎక్స్‌పీరియెన్స్ సారా లుచియాన్ తొలి ప్రయాణికులుగా ప్రయాణించారు. ప్రయాణికులు కూర్చొని వెళ్లే రైలును ప్రస్తుతం సైన్స్ పరిభాషలో ‘లెవిటేటింగ్ పాడ్’ అని, రైలు మార్గాన్ని ట్యూబ్ అని వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో దీన్ని ఆంగ్లంలో ‘ట్యూబ్ ట్రెయిన్’ అని పిలిస్తే తెలుగులో గొట్టం రైలుగా చెప్పుకోవచ్చేమో! ఈ రైలుకు గంటకు 600 మైళ్ల వేగంగా దూసుకెళ్లే సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రయాణికులతో నడపడం తొలిసారి కనుక గంటకు వంద మైళ్ల వేగంతో రైలును నడిపారు. ( కరోనా వ్యాక్సిన్ : ఫైజర్ పురోగతి ) ఆ రైలు 15 సెకండ్లలో 0.3 మైళ్లు, అంటే 500 మీటర్ల దూరం దూసుకెళ్లింది. అత్యద్భుతమైన హైపర్‌లూప్ టెక్నాలజీని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చేందుకు తమ వర్జిన్ గ్రూప్ విశేషంగా కృషి చేస్తోందని గ్రూప్ వ్యవస్థాపకులు పర్ రిచర్డ్ బ్రాన్సన్ తెలిపారు. ఈ సంస్థ నెవడాలోని ఎడారిలో తన హైపర్‌లూప్ మార్గాన్ని నిర్మించి గత కొన్నేళ్లుగా ప్రయోగాలు నిర్వహిస్తోంది. హైపర్‌లూప్‌లో గాలిని కూడా తొలగిస్తారు కనుక ఎలాంటి బాహ్య ఒత్తిడి లేకుండా రైలు వేగంగా ప్రయాణిస్తుందన్నది సైద్ధాంతికంశం. ప్రస్తుతం 600 మైళ్ల వేగంతో నడపడమన్నది కంపెనీ లక్ష్యం కాగా, దాన్ని భవిష్యత్తులో గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగం వరకు పెంచవచ్చన్నది భవిష్యత్ వ్యూహం. -
హైపర్‌లూప్‌కు పచ్చదనం తోడు
బీజింగ్ : విమానం కంటే ఎక్కువ వేగంతో భూమ్మీదే ప్రయాణించేందుకు వీలు కల్పించే హైపర్ లూప్ టెక్నాలజీ ఇప్పుడు పర్యావరణ అనుకూలంగా మారింది. హైపర్‌లూప్ మార్గాల వెంబడి పచ్చదనాన్ని పెంచేందుకు ఎంఏడీ ఆర్కిటెక్ట్స్ అనే సంస్థ హైపర్‌లూప్ టీటీతో జట్టు కట్టింది. హైపర్‌లూప్ రైళ్లు గాలి లేని గొట్టాల్లో అయస్కాంత క్షేత్రంలో వెళ్తాయన్నది మనకు తెలిసిందే. ఈ గొట్టాల పైభాగంలో పాదచారుల కోసం ఏర్పాట్లు, స్తంభాల మధ్యభాగంలో వ్యవసాయం చేపట్టేందుకు వీలుగా ఎంఏడీ ఆర్కిటెక్ట్ ఒక డిజైన్ ప్రతిపాదిస్తోంది. నగర ప్రాంతాలను మినహాయిస్తే.. మిగిలిన చోట్ల గొట్టాల పైభాగంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి, ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతోనే రైళ్లు నడుస్తాయని ఇప్పటికే దాదాపు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఎంఏడీ ఆర్కిటెక్ట్స్ సిద్ధం చేసిన డిజైన్‌కు ప్రాచుర్యం లభిస్తోంది. దీని ప్రకారం సుమారు 23 అడుగుల ఎత్తైన స్తంభాలపై హైపర్‌లూప్ గొట్టాలు ఏర్పాటవుతాయి. దిగువభాగంలో అత్యాధునిక హైడ్రోపోనిక్స్ టెక్నాలజీతో పంటలు పండించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తారు. రెక్కలు అవసరం లేని పవన విద్యుత్తు కేంద్రాలను గొట్టం వెంబడి ఏర్పాటు చేయడం ద్వారా విద్యుదుత్పత్తి మరింత పెంచుతారు. -
ముంబై-పూణే మధ్య హైపర్ లూప్..
-
11 నిమిషాల్లో ముంబై నుంచి పుణేకు!
హైపర్ లూప్ రైలును ప్రవేశపెట్టేందుకు పీఎంఆర్డీఏ సన్నాహాలు ఇప్పటికే హైపర్‌లూప్ కంపెనీ ప్రతినిధులతో చర్చించిన ప్రధాని మోదీ త్వరలో ప్రారంభం కానున్న పనులు.. ముంబై: ముంబై నుంచి పుణేకు కేవలం 11 నిమిషాల్లో చేరుకోగలమా అంటే అవునని టక్కున చెప్పే రోజులు త్వరలోనే రానున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక వేగంగా పరుగులు తీసే రవాణా వ్యవస్థగా పేరుగాంచిన ‘హైపర్ లూప్’ రైలును ముంబై–పుణే మధ్య ప్రవేశపెట్టేందుకు ‘పుణే మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ’ (పీఎంఆర్డీఏ) సన్నాహాలు చేస్తోంది. మాములుగా ముంబై నుంచి పుణేకు రోడ్డు మార్గం మీదుగా వెళితే కనీసం మూడు గంటల సమయం పడుతుంది. విమానంలో వెళితే 20 నిమిషాల సమయం పడుతుంది. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ‘హైపర్ లూప్ ట్రాన్స్‌మేషన్ టెక్నాలాజీ’ అనే కంపెనీకి చెందిన నిపుణుల బృందం పీఎంఆర్డీఏ పరిధిలో పర్యటించింది. వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఈ ప్రాజెక్టును ఇక్కడ నెలకొల్పేందుకు ప్రాథమికంగా సంసిద్ధత వ్యక్తం చేసింది. దేశంలోనే మొదటిసారిగా.. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలో దేశంలోనే మొదటిసారిగా ముంబై నుంచి పుణే మధ్య హైపర్ లూప్ రైలు పట్టాలెక్కనుంది. దుబాయ్‌లోని అబుదాబీ, రష్యాలోని మాస్కో, చైనా ఇలా మూడు దేశాల్లో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఈ కంపెనీలు హైపర్ లూప్ పనులు ప్రారంభించింది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రధాని మోదీ దేశంలో ఏర్పాటు చేసేందుకు సాధ్యమవుతుందా? ఒకవేళ సాధ్యమైతే ఏ ఏ నగరాల మధ్య దీన్ని చేపట్టవచ్చనే దానిపై కంపెనీ అధ్యక్షుడు బీబాప్ గెస్ట్రాతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ భేటీ అయి చర్చించారు. ఇందులో ముంబై–పుణే నగరాల మ«ధ్య ఈ హైపర్ లూప్‌ను ప్రవేశపెట్టేందుకు అనుకూలంగా ఉందని గడ్కారీ అభిప్రాయడ్డారు. దీంతో కంపెనీ బృందం పీఎంఆర్డీయే పరిధిలో పర్యటించింది. హైపర్ లూప్ అంటే ఏమిటి? స్పేస్ఎక్స్ కంపెనీ సంస్థాపకుడు, ప్రముఖ పెట్టుబడిదారుడు ఇలాన్ మాస్క్ ఈ హైపర్ లూప్ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని 2013లో ప్రపంచానికి పరిచయం చేశారు. గంటకు 1,220 కి.మీ. వేగంతో పరుగులు తీసే ఈ రైలు లూప్‌లో ప్రయాణికులు కూర్చుంటారు. దీని మార్గం క్యాప్సూల్ లేదా ట్యూబ్ లేదా సొరంగం లాగా ఉంటుంది. అందులోంచి రైలు దూసుకెళ్తుంది. క్యాప్సుల్ పొడవు 30 మీటర్లు, వెడల్పు 2.7 మీటర్లు, బరువు సుమారు 20 టన్నుల వరకు ఉంటుంది.