హైస్పీడ్ ట్రైన్స్ తయారుచేయడంలో చైనా మరో అడుగు ముందుకేసింది. తాజాగా అత్యాధునిక సూపర్ సోనిక్ అల్ట్రా హైస్పీడ్ ట్రైన్‌ను అభివృద్ధి చేసినట్లు ఆ దేశ పరిశోధకులు ప్రకటించారు. ఆకృతిలో రైలును పోలి, వేగంలో విమానానికి తీసిపోని ఈ ట్రైన్‌కు ‘టీ-ఫ్లైట్’ అని పేరు పెట్టారు.
ప్రత్యేకతలు..
- ఈ ట్రైన్‌కు చక్రాలు ఉండవు.
- ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ శక్తితో ట్రాక్‌పై గాలిలో తేలియాడుతూ నడుస్తుంది.
- దీంతో పట్టాలు, చక్రాలమధ్య ఘర్షణ అనే సమస్యే ఉండకపోవడంతో లక్షిత వేగాన్ని రైలు సులభంగా అందుకోగలదు.
- ఎయిరో డైనమిక్స్ సూత్రాలకు అనుగుణంగా ప్యాసింజర్ల కోసం ఏర్పాటు చేసిన రైక్లెన్డ్ సీట్లును ఏర్పాటు చేశారు.
- టాప్ స్పీడ్‌లో వుహాన్ నుంచి బీజింగ్ (వెయ్యి కిలోమీటర్లు)కు అరగంటలో చేరుకొంటుంది.
- రైలుపైన ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ద్వారా దానికి అవసరమైన శక్తి అందుతుంది.
- ప్రస్తుత వేగం – గంటకు 623 కి.మీ ప్రయాణిస్తుందని పరిశోధకులు చెప్పారు. మరింత అభివృద్ధి చేశాక గంటకు 2 వేల కి.మీ ప్రయాణిస్తుంది.
- ప్రత్యేక ట్యూబ్ గుండా ప్రయాణించే టీ-ఫ్లైట్‌లో మాగ్లెవ్ సాంకేతికత సాయంతో ఘర్షణ లేకుండా ప్రయాణించవచ్చు.
ఇదీ చదవండి: ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు.. చివరి తేదీ ఎప్పుడంటే..
Comments
Please login to add a commentAdd a comment