తమిళనాడులో భారీ వర్షం.. విద్యాసంస్థలకు సెలువు | Rain Lashes Parts Of Chennai City Tamil Nadu Updates, Schools And Colleges Shut, More Details Inside | Sakshi
Sakshi News home page

Chennai Rainfall Updates: తమిళనాడులో భారీ వర్షం.. విద్యాసంస్థలకు సెలువు

Published Tue, Oct 15 2024 8:44 AM | Last Updated on Tue, Oct 15 2024 10:47 AM

Rain lashes parts of Chennai city Tamil Nadu updates

చెన్నై: తమినాడులో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తోంది. తిరువళ్లూరు నగరం, పొన్నేరి ప్రాంతం, చెన్నైలోని కోయంబేడు, చెన్నై సిటీలో భారీగా వర్షంకుస్తోంది. చెన్నైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

 

మంగళవారం చైన్నె, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఐటీ సంస్థలు తమ సిబ్బంది ద్వారా ఆఫీసులలో కాకుండా, వర్క్‌ ఫ్రం హోం కేటాయించాలని సూచించారు.

 

చైన్నె, శివారు జిల్లాలోని ప్రధాన ప్రాంతాలను మంత్రులు, ఐఏఎస్‌ల బృందం నిత్యం పర్యవేక్షిస్తోంది. పుదుచ్చేరి లోనూ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చెన్నైలోని పల్లికరణై-కోవిలంబాక్కం మధ్య నారాయణపురం సరస్సు ప్రాంతాన్ని పరిశీలించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement