drummer
-
శివమణితో సమానంగా.. జూనియర్ శివమణి!
డ్రమ్స్ పేరు చెప్తే ఇండియాలో శివమణి గుర్తుకు వస్తాడు. ఆయనో పెద్ద డ్రమ్స్ ప్లేయర్. ప్రితీష్ కూడా ఏం తక్కువ కాదు. జూనియర్ శివమణి అని చెప్పచ్చు. ఎ.ఆర్ ప్రీతీష్ వయసు 13 ఏళ్లు. ప్రస్తుతం తల్లిదండ్రులతోపాటు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఐదేళ్ల వయసులో అతను తొలిసారి డ్రమ్స్ చూశాడు. సరదాగా దాని మీద ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత అదే అతనికి పనిగా మారింది. వయసులో తనకన్నా పెద్దవాళ్ళతో పోటీ పడి మరీ వాయించేవాడు.డ్రమ్స్ మీద రకరకాల ప్రయోగాలు చేసేవాడు. 8వ తరగతి వచ్చేనాటికి ప్రదర్శనలు ఇస్తూ అందరి చేతా శభాష్ అనిపించుకునేవాడు. ఆ తర్వాత అతని దృష్టి గిన్నిస్ రికార్డ్ మీద పడింది. ఎలాగైనా దాన్ని సాధించాలని అత్యంత వేగంగా డ్రమ్స్ వాయించడాన్ని నేర్చుకున్నాడు. ఏడు నెలలపాటు అదే పనిగా డ్రమ్స్ వాయించి ఆ పట్టు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గిన్నిస్ ప్రతినిధుల ముందు నిమిషానికి 2,370 సార్లు డ్రమ్స్ వాయించాడు. అంటే ఒక సెకనుకు దాదాపు 40 సార్లు డ్రమ్ వాయించాడు. అతని ప్రతిభ చూసి గిన్నిస్ ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. అత్యంత చిన్న వయసులో ఒక నిమిషంలో అత్యధిక సార్లు డ్రమ్స్ వాయించిన వ్యక్తిగా అధికారిక రికార్డు అందజేశారు. ప్రీతీష్ కల నెరవేరింది.ఇదీ చదవండి: సముద్రం ఒడ్డున రాళ్లు ఏరుతున్నారా..వద్దొద్దు! చిన్నారులకోసం చిన్నారుల గేయంపాడుదాం గేయం తారకలు..తారకలు..తళతళ మెరిసే తారకలుఆకాశంలో అందంగామెరిసే తెల్లని దీపికలుచంద్రుడి పక్కన చుక్కల్లా మెరిసే బంగరు గోపికలుఅంబరానికి తోరణమై నిలిచే అందాల జ్ఞాపికలుఎగరేసే దారం లేదు ఎవరి చేతి ఆధారం లేదుఎత్తున నిలిచే ఊతం అయినా మెరిసే తారకలుఏ రోజూ సెలవు లేదు ఏనాడూ అలుపు రాదువజ్రాలంటి మెరుపు ΄ోదుఅందుకే అవి తారకలుతారకలు..తారకలు..తళతళ మెరిసే తారకలుఆకాశంలో అందంగామెరిసే తెల్లని దీపికలు∙ -
గవర్నమెంట్ స్కూల్ కుర్రోడి ప్రతిభ.. 'స్టార్లను తయారుచేసేది టీచర్లే కదా'
కేరళకు చెందిన ఓ విద్యార్థి అద్భుతంగా డ్రమ్ము వాయిస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. కేరళలోని వయనాడ్‌కు చెందిన ఓ ప్రభుత్వ పాఠశాలలో అంజనాకుమార్ అనే టీచర్ ఓ జానపద గీతాన్ని క్లాస్‌రూంలోనే ఆలపించగా, ఆ పాట రిథమ్‌కు తగ్గట్టుగా స్కూల్ బెంచ్ మీదే అభిజీత్ అనే విద్యార్థి అత్భుతంగా వాయించాడు. ఈ వీడియోను క్లాస్ టీచర్ ఫేస్బుక్లో పోస్ట్ చేయగా 24గంటల్లోనే లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. టీచర్ పాటకు అభిజీత్ అద్భుతంగా డ్రమ్ వాయించాడంటూ నెటిజన్లు తెగ మురిసిపోతున్నారు. చిన్నారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. స్టార్లను తయారుచేసేదే టీచర్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. This video that has gone viral in Kerala landed in my inbox as I woke up today in Araku. It is a Wayanad folk song sung by a music teacher who had spotted the drumming talent of this student and joined him in an impromptu session in school. It is teachers that create stars. pic.twitter.com/OzvUIiUDvR — Manoj Kumar (@manoj_naandi) July 5, 2023 ఇక అభిజీత్ ప్రతిభకు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వంటి ప్రముఖుల నుంచి పెత్త ఎత్తున ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మట్టిలో మాణిక్యం అంటూ అతడి టాలెంట్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. -
‘ఉర్జా’లో శివమణి మోత
సాక్షి, బెంగళూరు: ప్రముఖ డ్రమ్స్ వాయిద్యకారుడు శివమణి తన ప్రదర్శనతో విద్యార్థులను ఉర్రూతలూగించాడు. రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(రిమ్స్) సంస్థ ‘ఉర్జా-2013’ పేరిట రిమ్స్ ప్రాంగణంలో నిర్వహించిన మూడు రోజుల నేషనల్ ఇంటర్ కాలేజ్ ఫెస్ట్ ముగింపు ఉత్సవాలు శనివారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ సందర్భగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శివమణి తన డ్రమ్స్ వాయిద్యంతో విద్యార్థులను ఉర్రూతలూగించారు. అంతకుముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో శివమణి మాట్లాడుతూ దివంగత కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్‌కుమార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రాజ్‌కుమార్ తన ప్రదర్శనను ఎంతగానో మెచ్చుకునేవారని తెలిపారు. ఉద్యాననగరిగా పేరుగాంచిన బెంగళూరు అంటే తనకెంతో ఇష్టమని, ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ‘రాగి ముద్దె’ తప్పక రుచిచూస్తానని పేర్కొన్నారు. రిమ్స్ డెరైక్టర్ ఎం.ఆర్.పట్టాభిరామ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సమాజసేవపై అవగాహన కల్పించడంలో భాగంగా ‘టైమ్ టు గివ్ బ్యాక్’ నినాదంతో ఈ ఫెస్ట్‌ను నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఫెస్ట్‌లో ఓటు హక్కు వినియోగంపై కూడా చైతన్యాన్ని కల్పించేందుకు వివిధ సెమినార్లను ఏర్పాటుచేసినట్లు తెలిపారు.