ఎన్‌సీసీలో విద్యార్థినుల ప్రతిభ
ఎన్‌సీసీలో విద్యార్థినుల ప్రతిభ
Published Wed, Oct 5 2016 9:07 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
పెదకాకాని: నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఎన్‌సీసీ మహిళా క్యాడెట్స్‌కు జాతీయ స్థాయిలో పతకాలు వచ్చాయని కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం వీవీఐటీలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. విద్యాసాగర్ మాట్లాడుతూ వీవీఐటీకి చెందిన ముగ్గురు మహిళా క్యాడెట్స్ జాతీయస్థాయి ఎన్‌సీసీ క్యాంప్‌కు ఎంపికయ్యారన్నారు. ఎంపికైన ముగ్గురు న్యూఢిల్లీలోని ధల్ సైనిక క్యాంప్‌లో శిక్షణ పొందారని చెప్పారు. సెప్టెంబర్ 19 నుంచి 30వ తేదీ వరకూ జరిగిన ఈ క్యాంప్‌కు దేశంలోని 17 డైరెక్టరేట్‌లు పోటీ పడగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డైరెక్టరేట్ మహిళా విభాగం మొదటి స్థానం సాధించిందన్నారు. క్యాంపులో అబ్‌స్టకల్ కోర్స్, మ్యాప్ రీడింగ్, హెల్త్ అండ్ హైజీన్, ఫైరింగ్, జడ్జింగ్ డిస్టెన్స్ అండ్ ఫీల్డ్ సిగ్నల్స్, అడ్వాన్స్ రైఫిల్ షూటింగ్, లైన్ ఏరియా కాంపిటేషన్ విభాగాల్లో వీవీఐటీ క్యాడెట్లు కాంస్య పతకం సాధించారని తెలిపారు. ఈ క్యాంప్‌లో పాల్గొన్న సీఎస్‌ఈ తృతీయ సంవత్సరం విద్యార్థినులు ఐ సాధనారెడ్డి, సీహెచ్ మధురిమ, సివిల్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఎన్ లక్ష్మీనాగ అపర్ణ ఎస్‌ఎస్‌బీ ఎగ్జామ్స్ రాయకుండా డిఫెన్స్ ఉద్యోగాల ఇంటర్వూ్యలకు డైరెక్ట్‌గా హాజరు కావచ్చన్నారు.
Advertisement
Advertisement