డీఈవో అభినందన
ఇందూరు:
కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్ కార్యక్రమంలో ప్రతిభ చాటిన విద్యార్థులను డీఈవో లింగయ్య అభినందించారు. గత శుక్రవారం నుంచి కరీంనగర్‌లో నిర్వహించిన ‘ఇన్‌స్పైర్’లో ఆర్మూర్ మామిడిపల్లికి చెందిన నరేంద్ర హైస్కూల్ విద్యార్థిని ఎం.భబిత, భీమ్‌గల్, మెంట్రాజ్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఎస్.నవీన్, ఆర్.ప్రశాంత్ ప్రతిభ చాటారు. ఇదే ఉత్సాహంతో జాతీయ స్థాయికి ఎదగాలని డీఈవో వారికి సూచించారు. జిల్లా సైన్స్ అధికారి గంగకిషన్, సుదేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.