
బాసర టాపర్ మనోడే
♦ ఖేడ్ మండలానికి చెందిన రమేష్ ప్రతిభ
♦ మంత్రి కడియం చేతుల మీదుగా గోల్డ్‌మెడల్
భైంసా/బాసర: ఉమ్మడి రాష్ట్రంలో గాడితప్పిన విద్యావ్యవస్థపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక ద ష్టి సారించిందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. సోమవారం బాసర ఆర్‌జీయూకేటీ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఆర్‌జీయూకేటీలో నిర్మాణాలు పూర్తయిన భవనాలను డార్మెటరీహాల్స్‌ను, స్టడీ సెంటర్లను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రారంభించారు. అనంతరం స్నాతకోత్సవంలో ఆయన మట్లాడుతూ.. ఇంజినీరింగ్ కళాశాలలపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే గ్రేడింగ్ విధానం తీసుకురానుందని చెప్పారు.
వర్సిటీ టాపర్ మెదక్ జిల్లా విద్యార్థి
బాసర ఆర్‌జీయూకేటీ వర్సిటీ టాపర్‌గా నిలిచిన కమ్ముల రమేష్‌కు డిప్యూటీ సీఎం కడియం గోల్డ్‌మెడల్ అందించారు. రమేష్.. నారాయణ్‌ఖేడ్ మండలం చాంద్‌ఖాన్‌పల్లికి చెందిన విద్యార్థి. మెకానికల్ విభాగంలో తూప్రాన్‌కు చెందిన దేవతా భానుకిరణ్ టాపర్‌గా నిలిచాడు.