గ్లామర్ పాయింట్
కూడలి
ఆ టీవి.... ఠీవీయే వేరు!
ప్రతిభ ఉండగానే సరిపోదు. ఆ ప్రతిభ పదిమంది దృష్టిలో పడడానికి సరియైన టైమ్ రావాలి. ప్రకటనల్లో, నాటకాల్లో నటించినప్పటికీ నిమ్రత కౌర్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ‘లంచ్‌బాక్స్’ సినిమా ఆమె కెరీర్‌కు కొత్త ఊపు ఇచ్చింది. కౌర్ నటప్రతిభ అంతర్జాతీయస్థాయి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే అమెరికన్ పాప్‌లర్ టీవీ సిరీస్ ‘హోమ్‌లాండ్’లో ఆమెకు నటించే అవకాశం వచ్చింది. ‘‘అమెరికన్ టీవీలో సరే మన ఇండియన్ టీవీ సీరియల్స్‌లో కూడా నటిస్తారా?’’ అనే ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పకపోయినా ‘కాదు’ అనే చెప్పింది కౌర్.
‘‘వేరొకదాన్ని అనుకరిస్తూ చేసే సీరియల్స్‌లో నటించడం అంటే ఇష్టం ఉండదు. కాపీ సీరియల్స్‌లో నటించడానికి కష్టపడాలా? అని కూడా అనిపిస్తుంది. ఏ రకంగా చూసినా మన ఇండియన్ టీవీతో పోల్చితే అమెరికన్ టీవీ వేరు. వారి ప్రమాణాలు, ప్రాధాన్యతలు వేరు’’ అంటుంది నిమ్రత.