Kaur
-
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
2024 లోక్‌సభ ఎన్నికల మూడు దశలు ఇప్పటికీ ముగిశాయి. మిగిలిన నాలుగు దశల ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలో పంజాబ్‌లోని భఠిండా లోక్ సభ స్థానంపై ఆసక్తికర చర్చ మొదలయ్యింది. ఈ స్థానం నుంచి ఐఏఎస్ అధికారి పరమ్‌పాల్ కౌర్ సిద్ధూకు బీజేపీ టికెట్ ఇచ్చింది.ఈ నేపధ్యంలో ఆమె రాజీనామాను కేంద్ర సిబ్బంది శాఖ ఆమోదించింది. అయితే పంజాబ్ ప్రభుత్వం ఆమెకు మూడు నెలల నోటీసు వ్యవధి నుండి మినహాయింపు ఇవ్వడానికి నిరాకరించింది. ఉద్యోగంలో కొనసాగాలని కోరింది. అయితే పరమ్‌పల్ కౌర్ ప్రభుత్వ తీరును వ్యతిరేకించారు. పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ తాను ఖచ్చితంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.తనను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రిలీవ్ చేసిందని, జూన్ ఒకటిన పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత తాను రాష్ట్ర ప్రభుత్వానికి సమాధానం చెబుతానని ఆమె తెలిపారు. తనకు నోటీసు పంపించి, ఆప్ ప్రభుత్వం సమయాన్ని వృథా చేసుకుంటున్నదని ఆమె ఆరోపించారు. రిటైర్మెంట్ తర్వాత ఏమి చేయాలన్నది తన ఇష్టమని ఆమె పేర్కొన్నారు.పంజాబ్ ప్రభుత్వం పరమ్‌పాల్ కౌర్ సిద్ధూకు పంపిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వం రూల్ 16 (2) ప్రకారం మూడు నెలల నోటీసు వ్యవధిని మినహాయించలేమని, అందుకే వీఆర్ఎస్ ఆమోదించడానికి సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు విడుదల చేయలేమని పేర్కొంది. ఆమెను రిటైర్డ్‌గా పరిగణించలేమని, ఆమె వెంటనే విధులకు హాజరు కావాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని పేర్కొంది. -
చిక్కుల్లో బీజేపీ అభ్యర్థి పరమ్‌పాల్.. వీఆర్ఎస్ రద్దు.. డ్యూటీకి రావాలంటూ ఆదేశం!
పంజాబ్‌లోని బఠిండా లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన ఐఏఎస్ అధికారి పరమ్‌పాల్ కౌర్ చిక్కుల్లో పడ్డారు. అకాలీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సికందర్ సింగ్ మలుకా కోడలు, పంజాబ్ ఐఏఎస్ అధికారి పరంపాల్ కౌర్ రాజీనామాలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది.రెండు రోజుల క్రితం పరమ్‌పాల్ కౌర్ రాజీనామాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అలాగే దీనికి సంబంధించి పంజాబ్ ప్రభుత్వానికి కేంద్రం లేఖ కూడా రాసింది. అయితే పంజాబ్ ప్రభుత్వం పరమ్‌పాల్ కౌర్ వీఆర్ఎస్ను తిరస్కరించింది. ఆమెను వెంటనే విధుల్లో చేరాలని కోరింది.ఇటువంటి పరిస్థితిలో పరమ్‌పాల్ కౌర్ నామినేషన్ దాఖలు చేయడంలో ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. పరంపాల్ కౌర్ స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత తన భర్తతో కలిసి బీజేపీలో చేరారు. ఈ నేపధ్యంలో పార్టీ ఆమెను బఠిండా అభ్యర్థిగా ప్రకటించింది. పంజాబ్ ప్రభుత్వ పర్సనల్ డిపార్ట్మెంట్ తన నోటీసులో.. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్‌లోని రూల్ 16(2) ప్రకారం సమర్థ ప్రీ-డిశ్చార్జ్ కోసం పరమ్‌పాల్ కౌర్ దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. వృద్ధురాలైన తల్లిని చూసుకోవడానికి రిటైర్మెంట్ కోరుతున్నట్లు ఆమె తన దరఖాస్తులో పేర్కొన్నారు.పదవీ విరమణ దరఖాస్తు నిబంధనల ప్రకారం మూడు నెలల నోటీసు వ్యవధిని మినహాయించాలని పరమ్‌పాల్ కౌర్ అభ్యర్థించారు. అయితే పంజాబ్ ప్రభుత్వ సిబ్బంది విభాగం పంపిన నోటీసులో పదవీ విరమణకు సంబంధించిన నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే సంబంధిత అధికారికి మూడు నెలల నోటీసు వ్యవధి నుండి మినహాయింపు ఇవ్వగలదని స్పష్టం చేసింది . కేంద్ర ప్రభుత్వానికి ఈ హక్కు లేదని దానిలో పేర్కొంది.అలాగే తల్లి సంరక్షణకు కోసం పదవీ విరమణ కోరుతున్నట్లు దరఖాస్తులో పేర్కొన్న కారణం నిరాధారమైనదిగా పరిగణిస్తున్నట్లు నోటీసులో స్పష్టం చేసింది. ఆమె దరఖాస్తు సమర్పించాక రాజకీయాలలో చురుకుగా మారారు. అందుకే ఈ కారణం నిరాధారమని సదరు నోటీసులో పేర్కొన్నారు. పంజాబ్ ప్రభుత్వం ఆమె రిలీఫ్ అప్లికేషన్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఆమె తక్షణమే విధుల్లో చేరాలని ఆ నోటీసులో ఆమెకు తెలియజేశారు. -
బెల్లం పొడి అమ్మేస్తోంది
ఇంట్లో అందరికీ షుగర్ వస్తే మంచి డాక్టర్ ఎవరా అని వెతుకుతారు అంతా.కాని ఎంబీఏ చేసి మంచి హోదాలో ఉన్న నవనూర్ కౌర్ మాత్రం ఉద్యోగం వదిలేసింది. లోకంలో ఇంత మందికి షుగర్ ఉందంటే చక్కెరకు ప్రత్యామ్నాయమైన బెల్లం అమ్మితేఅటు ఆరోగ్యం, ఇటు లాభం అని నిశ్చయించుకుంది. ‘జాగర్‌కేన్’ అనే బ్రాండ్ స్థాపించి నాణ్యమైన బెల్లం పొడిని తెగ అమ్మేస్తోంది.టీలో కలపాలన్నా, స్వీట్ చేయాలన్నా బెల్లం పొడి బెస్ట్ అంటోంది. ఈమె వ్యాపారం జామ్మని సాగుతోంది. నవనూర్ కౌర్ ప్రచార చిత్రాలు ఎవరినైనా ఆకర్షిస్తాయి. ఒక పోస్టర్లో ‘బెల్లం పాలు తాగితే ఎన్ని ఉపయోగాలో తెలుసా? వత్తిడి తగ్గుతుంది, స్త్రీలలో రుతుస్రావ సమస్యలు తగ్గుతాయి, హిమోగ్లోబిన్ పెరుగుతుంది, చర్మానికి మంచిది, జీర్ణక్రియ బాగుంటుంది, కీళ్ల నొప్పలు తగ్గుతాయి’. ఆ పోస్టర్ చూసినవారెవరైనా బెల్లం పాలు తాగాలనే అనుకుంటారు.ఇంకో పోస్టర్లో చక్కెరకు బెల్లానికి ఉన్న వ్యత్యాసాలు చూపిస్తుందామె. ‘చక్కెర రక్తంలో వెంటనే కరిగిపోతుంది. కాని బెల్లం మెల్లగా కరిగి మెల్లగా శక్తిని విడుదల చేస్తుంది. చక్కెరలో ఏ పోషకాలూ లేవు. బెల్లంలో ఐరన్, పొటాషియం ఉంటాయి. చక్కెర అసిడిటీ ఇస్తుంది. బెల్లం జీర్ణానికి అవసరమైన ఆల్కలైన్‌గా మారుతుంది’. నవనూర్ కౌర్ బెల్లం అమ్మకాల్లో ఏదో గుడ్డిగా ప్రవేశించలేదు. ఒక సంపూర్ణ అవగాహన, లక్ష్యంతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. బిజినెస్ స్కూల్ విద్యార్థి నవనూర్ కౌర్‌ది లూధియానా. తండ్రి ప్రొఫెసర్. తల్లి స్కూల్ ప్రిన్సిపాల్. చురుకైన విద్యార్థి అయిన నవనూర్ కౌర్ ఐఎంటి ఘజియాబాద్ నుంచి ఎంబీఏ చేసింది. వెంటనే కొటాక్ మహేంద్ర బ్యాంక్‌లో మంచి ఉద్యోగం వచ్చింది. కాని తనకు వేరే ఏదో చేయాలని ఉండేది. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే చేయదగ్గ వ్యాపారం ఏమిటా అని ఆలోచిస్తే తమ కుటుంబంలో బంధువుల్లో షుగర్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారని అర్థమైంది. డయాబెటిస్ పేషెంట్లు, డయాబెటిస్ ఉన్నవాళ్లు తీపి కోసం బెల్లం ఉపయోగించాలని అనుకున్నా మార్కెట్లో దొరుకుతున్న బెల్లం నాణ్యంగా లేదని తెలుసుకుంది. ఆర్గానిక్ బెల్లం అని చెప్పి అమ్ముతున్నది కూడా కల్తీయే అని అర్థమయ్యాక ఒక వైపు ఉద్యోగంలో తాను సంపాదించిన ఐదు లక్షల రూపాయలతో బెల్లం పొడి తయారీ కేంద్రం పెట్టి, అందులో బెల్లం పొడి తయారు చేసి అమ్మాలని నిశ్చయించుకుంది. అవాంతరాలు ఆర్గానిక్‌గా చెరకు పండించి, రసాయనాలు లేకుండా బెల్లం తయారు చేసి సరుకు వేసేవారి కోసం నవనూర్ కౌర్ పంజాబ్, ఉత్తర ప్రదేశ్ చాలా తిరగాల్సి వచ్చింది. అలా ఇస్తామని చెప్పిన వారు కూడా మోసం చేయక తప్పని పరిస్థితిలో ఉన్నారని గ్రహించింది. అయితే అదృష్టవశాత్తు తన తండ్రి దగ్గర చదువుకుని సేంద్రియ పద్ధతిలో చెరకు పండిస్తున్న కౌశల్ అనే రైతు పంజాబ్‌లోనే ఆమెకు దొరికాడు. అతనికి బెల్లం తయారీ కేంద్రం కూడా ఉంది. ‘నువ్వు నాణ్యమైన బెల్లం తయారు చేయ్. నేను మార్కెటింగ్, బ్రాండ్ చూసుకుంటాను. ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం’ అని చెప్పింది. కౌశల్ సరే అన్నాడు. ఇద్దరూ కలిసి ‘జాగర్‌కేన్’ అనే బ్రాండ్ మొదలుపెట్టారు. వెంటనే ఆదరణ నవనూర్ కౌర్ తయారు చేసిన బెల్లం పొడి వెంటనే ఆదరణ పొందింది. కల్తీ లేనిది కావడాన... రుచి కూడా బాగుండటాన అందరూ కొనడం మొదలెట్టారు. దుకాణం దారులు నిల్వ ఉండటం లేదని ఫిర్యాదు చేస్తే తగిన ప్రయోగాలు చేసి 9 నెలల పాటు నిల్వ ఉండేలా తయారు చేశారు. ఇప్పుడు 22 జిల్లాల్లో ఆమెకు డిస్ట్రిబ్యూషన్ ఉంది. గత సంవత్సరం 2 కోట్ల టర్నోవర్ వచ్చింది. మరో ఐదేళ్లలో 100 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంటామని భావిస్తోంది. కృత్రిమమైన చక్కెర కంటే బెల్లం ఎక్కువ ఆరోగ్యకరమైనదని తెలుసుకునే కొద్దీ తనలా బెల్లం ఉత్పత్తులు చేసేవారు తప్పక విజయం సాధిస్తారని ఆమె గట్టిగా సందేశం ఇస్తోంది. ఉద్యోగాలు మంచివే అయినా ఒక మంచి వ్యాపార ఐడియా ఎక్కడికో చేర్చగలదు. నవనూర సక్సెస్ స్టోరీ అందుకు ఉదాహరణ. -
బర్ఫీబామ్మ.. ఈ జన్మకు ఇంతేలే అనుకోలేదు.. తొంభైలలోనూ వ్యాపారం
‘‘జీవితంలో నాకు కావాల్సిన సంతోషాలన్నీ దొరికాయి. అది లేదు, ఇది లేదు అన్న అసంతృప్తిలేదు. కానీ ఇంతవరకు నా కాళ్ల మీద నేను నిలబడడానికి ప్రయత్నించిందిలేదు. సొంతంగా డబ్బులు సంపాదించలేదు’’ అని చాలా మంది మలివయసులో దిగులు పడుతుంటారు. అచ్చం ఇలాంటి ఆలోచనా ధోరణి ఉన్న తొంభై ఏళ్ల హర్భజన్ కౌర్ తన మనసులో బాధను దిగమింగుకుని, ఈ జన్మకు ఇంతేలే అని సరిపెట్టుకోలేదు. ‘‘వయసు అయిపోతే ఏంటీ నేను ఇప్పుడైనా సంపాదించగలను’’ అని బర్ఫీలు తయారు చేసి విక్రయిస్తోంది. తొంభైలలోనూ వ్యాపారాన్ని లాభాల బాట పట్టిస్తూ బర్ఫీబామ్మగా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. అమృతసర్‌లోని తారన్‌తారన్ ప్రాంతంలో పుట్టిపెరిగింది హర్భజన్ కౌర్. పెళ్లికావడంతో భర్తతో లుథియాణాలో కొత్తజీవితం మొదలు పెట్టింది. సంసారం, పిల్లలతో తొంభై ఏళ్లు గడిచిపోయాయి కౌర్ జీవితంలో. పదేళ్లక్రితం భర్త చనిపోవడంతో చంఢీఘడ్‌లోని తన చిన్నకూతురు దగ్గర ఉంటోంది కౌర్. తొంభై ఏళ్ల వయసులో అన్ని బాధ్యతలు నెరవేరినప్పటికీ..తన కాళ్ల మీద తను నిలబడలేదు, సొంతంగా ఒక్క రూపాయి సంపాదించలేదన్న అసంతృప్తి మాత్రం ఆమె మనసులో ఉండిపోయింది. ఓ రోజు మాటల మధ్యలో తన మనసులో మాటను కూతురు దగ్గర చెప్పింది. అప్పుడు.. కూతురు సరే..ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగింది. అందుకు కౌర్.. శనగపిండితో బర్ఫీలు చేసి విక్రయించాలనుకుంటున్నాను’’ అని చెప్పింది. అందుకు కూతురు సాయం చేయడంతో చంఢీఘడ్‌లోని సెక్టార్–18లో చిన్న స్టాల్ పెట్టి శనగపిండితో చేసిన బర్ఫీలను విక్రయించింది. ఐదు కేజీల బర్ఫీలు విక్రయించగా మూడు వేల రూపాయలు వచ్చాయి. వ్యాపారం ప్రారంభించిన తొలిరోజే మూడు వేల రూపాయలు రావడంతో ఆమె బర్ఫీల వ్యాపారానికి మరింత ప్రోత్సాహం లభించినట్లు అనిపించింది. ఇదే సమయంలో హర్భజన్ బర్ఫీ తయారు చేస్తోన్న వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్విటర్లో షేర్ చేయడంతో వీడియో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ద్వారా వచ్చిన పాపులారిటీతో బర్ఫీల ఆర్డర్లు విరివిగా పెరిగి వ్యాపారం చక్కగా సాగుతోంది. నాన్న నుంచి నేర్చుకుని.. హర్భజన్ తండ్రికి వంటబాగా చేసేవారు. ఆయన నుంచి వంట నైపుణ్యాలను చక్కగా అవపోసన పట్టిన కౌర్... శనగపిండి బర్ఫీ, బాదం సిరప్, టొమాటో చట్నీ, నిమ్మకాయ, మామిడికాయ పచ్చడి, దాల్ హల్వా, పిర్నీ, పంజిరి, ఐస్‌క్రీమ్‌లు వంటివి తయారు చేసి విక్రయిస్తోంది. ముందుగా తనకోసం చేసుకుని రుచి చక్కగా కుదిరిన తరువాత మార్కెట్లో విక్రయిస్తోంది. కౌర్ వంటలకు కస్టమర్లనుంచి విరివిగా ఆర్డర్లు వస్తున్నాయి. గత ఆరేళ్లుగా ఒకపక్క బర్ఫీలు చేస్తూనే తనకు ఏమాత్రం ఖాళీసమయం దొరికినా తన మనవ సంతానానికి చిన్నచిన్న గౌన్లను కుడుతుంది. సోషల్ మీడియాలో తన వీడియోలతో వ్యూవర్స్‌ను ఆకట్టుకోవడమేగాక, ఈ వయసులో కృష్ణా రామా అంటూ కూర్చోకుండా తనకు తెలిసిన పనితో సంపాదిస్తూ మలివయసులో ఊసుపోని వారెందరికో ప్రేరణగా నిలుస్తోంది. మరో తరానికి... నూటపదేళ్లకుపైగా చరిత్ర ఉన్న శనగపిండి బర్ఫీని విక్రయించడం నాకు చాలా గర్వంగా ఉంది. చిన్నప్పడు మా నాన్నగారు ఈ బర్ఫీని ఎంతో రుచికరంగా చేసేవారు. అది చూసి నేర్చుకున్న నేను నా పిల్లలు, తరువాత మనవళ్లకు వండిపెట్టాను. బర్ఫీ ప్రతిముక్కలో నా చిన్నతనం నాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఇంట్లో నేను చేసిన బర్ఫీలను అంతా ఇష్టంగా తినేవారు. ఇప్పుడు బయటివాళ్లు సైతం ఇష్టపడుతున్నారు. ‘చైల్డ్‌హుడ్ మెమొరీస్’ పేరిట ఆన్లైన్లో ఫుడ్ విక్రయిస్తున్నాం. ప్రారంభంలో ఆర్డర్లు తక్కువగా ఉన్నప్పటికీ, ఇప్పుడు బాగా వస్తున్నాయి. నా కూతురు రవీనా సాయంతో నేను ఇదంతా చేయగలుగుతున్నాను. సోషల్ మీడియా అంటే ఏంటో కూడా తెలియని నేను.. నా వీడియోలతో వేలమందిని ఆకట్టుకోవడం సంతోషాన్నిస్తోంది’’. – హర్భజన్ కౌర్ -
పెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది.. అయినా కుంగిపోలేదు
లుథియానా జిల్లా టూసా గ్రామానికి చెందిన సత్విందర్ కౌర్‌కు... అందరి అమ్మాయిల్లానే వయసు రాగానే తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. టీచర్‌గా పనిచేస్తోన్న మంచి వరుడు దొరకడంతో 2009 ఫిబ్రవరి 23న పెద్దల సమక్షంలో కోటి ఆశలతో పెళ్లి చేసుకుంది సత్విందర్. ఆ ఆశలన్నీ మూణ్ణాళ్ల ముచ్చటేనని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. వివాహం అయిన కొద్దిరోజులకే భర్త విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే 2010లో జార్జియా వెళ్లి అక్కడ నుంచి ఉక్రెయిన్‌కు మారాడు. అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో విదేశీ విద్యార్థుల కో ఆర్డినేటర్‌గా పనిచేసేవాడు. అతను మాత్రమే వెళ్లి తనను ఎందుకు తీసుకెళ్లలేదో సత్విందర్‌కు అర్థం కాలేదు. అలా ఐదేళ్లు గడిచిపోయాయి. 2015 జూలై 20 న ఇండియాకు భర్త తిరిగి వస్తున్నారని ఎంతో ఆత్రుతగా ఎదురు చూసింది సత్విందర్. సంవత్సరాల తరువాత విదేశాల నుంచి వచ్చిన భర్త కుటుంబంతో అయిష్టంగా వ్యవహరిస్తూ.. మనం వేరే ఇంటికి అద్దెకు వెళ్దాం అని చెప్పి కిరాయికి ఇల్లు తీసుకుని అక్కడకు మకాం మార్చాడు. నెల తరువాత ‘‘నేను ఇప్పుడు ఉక్రెయిన్ వెళ్తున్నాను. మూడు నెలల తరువాత నిన్ను తీసుకెళ్తాను’’ అని చెప్పి తిరిగి వెళ్లిపోయాడు. కానీ చెప్పినట్లుగా సత్విందర్ను తీసుకెళ్లలేదు. తన భర్త తనని మోసం చేసాడని తెలుసుకున్న సత్విందర్ 2016లో ఎన్ఆర్ఐ సెల్లో ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో ఆమె భర్త విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించాడు. దీంతో కొన్ని వాయిదాల తరువాత పదివేల రూపాయల జీవన భృతితో కోర్టు విడాకులు ఇస్తూ తీర్పు ఇచ్చింది. విడాకులు మంజూరు అయ్యేంత వరకూ సత్విందర్.. తనలాగా భర్తచేతిలో మోసపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఎంతోమంది అమ్మాయిల సాధక బాధలను దగ్గర నుంచి గమనించేది. చిన్న చిన్న అమ్మాయిల జీవితాలు రోడ్డున పడడం వారు న్యాయం కోసం సంవత్సరాలపాటు కోర్టుల చుట్టూ తిరగడం, సత్విందర్‌కు కూడా అటువంటి ప్రత్యక్ష అనుభవం ఉండడంతో తనలాంటి వారికి సాయపడాలనుకున్నారు. అబ్ నహీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ.. భర్తల చేతిలో మోసపోయి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిలను ఆదుకోవాలని నిర్ణయించుకుని 2016లో ‘అబ్ నహీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ’ పేరున స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా మోసపోయిన అమ్మాయిలు, మహిళలకు సాయం చేయడం ప్రారంభించారు. కోర్టులు, పోలీసు స్టేషన్స్ దగ్గర తనకు ఎదురైన అమ్మాయిలను, ఇంకా ఫేస్బుక్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా మరికొంతమంది బాధితులను కలిసి వారి సమస్యలు తెలుసుకుని ఎన్ఆర్ఐ సెల్స్, జాతీయ మహిళ కమిషన్ నిర్వహించే సెమినార్స్‌కు వారిని ఆహ్వానించి అక్కడ వాళ్లకు న్యాయం ఎలా అందుతుందో వివరించేవారు. ప్రభుత్వ పెద్దలను సంప్రదించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. అంతేగాక ప్రపంచవ్యాప్తంగా గురుద్వారాలను సంప్రదించి బాధిత మహిళ వివరాలు తెలుసుకుని వారికి కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఇప్పటిదాకా 700 మంది మహిళలకు సాయపడ్డారు. ఎన్జీవోని సంప్రదించిన 40 మంది పురుషులకు సత్విందర్ సాయపడడం విశేషం. ‘‘నా భర్త నన్ను మోసం చేసినప్పుడు చాలా బాధపడ్డాను. కానీ కొన్నిరోజులకు నన్ను నేను తమాయించుకుని ధైర్యంగా పోరాడాలనుకున్నాను. ఈ క్రమంలోనే నాలా కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారిలో ధైర్యం నింపుతూ.. సాయం చేయాలనుకున్నాను. ఎన్జీవో స్థాపించి నేను చేయగలిగిన సాయం చేస్తున్నాను. సాయం కోసం నా దగ్గరకు వచ్చేవారిలో 65 ఏళ్ల లోపు మహిళలు 22 మంది ఉన్నారు. వీళ్లంతా దశాబ్దాలుగా తమ భర్తల కోసం ఎదురు చూస్తున్నారు. పంజాబ్, హర్యాణ రాష్ట్రాల్లోనే దాదాపు 32 వేల మంది బాధిత మహిళలు ఉన్నారు. వీరిలో చాలా మందికి సరైన న్యాయం అందడం లేదు. కొన్ని సందర్భాల్లో మోసం చేసిన భర్తల పాస్‌పోర్టులు రద్దుచేయించడం, ప్రపంచ నలుమూలల్లో ఏదేశం లో ఉన్నా ఇండియాకు రప్పించి న్యాయం చేస్తున్నాం. ఇప్పటిదాక 20 జంటలను కౌన్సెలింగ్ ద్వారా కలిపాము’’ అని సత్విందర్ వివరించారు. -
ఐదేళ్ల చిన్నారి.. అరుదైన ప్రపంచ రికార్డు
నేటి సాంకేతిక యుగంలో నెలల వయసున్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఆన్లైన్లో బిజీగా గడిపేస్తున్నారు. వీడియో గేమ్స్‌లో మునిగి తేలుతోన్న పిల్లలకు స్కూల్ బుక్స్ చదివే తీరిక కూడా ఉండడంలేదు. అటువంటిది ఐదేళ్ల చిన్నారి తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాలు చదివి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇండో అమెరికన్ చిన్నారి కియరా కౌర్‌కు పుస్తకాలు చదవడమంటే ఎంతో ఇష్టం. ఈ ఇష్టంతో 36 పుస్తకాలను రెండుగంటల్లోపే చదివి అతిచిన్న వయసులో.. లండన్ వరల్డ్ రికార్డ్, ఆసియా వరల్డ్ రికార్డుల జాబితాలో తన పేరును చేర్చింది. చెన్నైకు చెందిన డాక్టర్ రవీంద్రనాథ్ దంపతుల కుమార్తె కియరా. ప్రస్తుతం అబుదాబిలో ఉంటోన్న కియరాకు పుస్తకాలు చదవడమంటే ఎంతో ఇష్టం. కార్లో వెళ్తున్నా, రెస్ట్‌రూంలోకి వెళ్లినా కియరా చేతిలో బుక్ తప్పనిసరిగా ఉండేంత ఇష్టం తనకి. లాక్డౌన్ సమయం లో స్కూళ్లు మూతపడినప్పుడు కియరా మొత్తం సమయాన్ని బుక్స్ చదవడానికి కేటాయించి, వందల పుస్తకాలను చదివేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న 105 నిమిషాల్లో ఏకధాటి గా 36 పుస్తకాలను చదివి.. లండన్ వరల్డ్ రికార్డ్, ఆసియా వరల్డ్ రికార్డులలో స్థానం సంపాదించడంతో.. వరల్డ్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ కియరా ను ‘బాల మేధావి’గా అభివర్ణించింది. ఇంత చిన్నవయసు లో కియరా పుస్తకాల పురుగుగా మారడం విశేషమని కితాబునిచ్చింది. కియరా మాట్లాడుతూ... పుస్తకాలు చదువుతుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. బుక్‌ను పట్టుకుని చదువుతుంటే ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. ఇంటర్నెట్ లేకపోతే ఆన్లైన్లో బుక్స్ చదవలేము, వీడియోలు కూడ చూడలేము. అందుకే మన చేతిలో పుస్తకం ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ఇబ్బంది లేకుండా చదవొచ్చు. రంగురంగుల బొమ్మలు, పెద్ద పెద్ద అక్షరాల్లో టెక్ట్స్ ఉన్న పుస్తకాలు చదవడమంటే నాకెంతో ఇష్టం. నాకు ఇష్టమైన పుస్తకాల జాబితాలో సిండ్రెల్లా, అలీస్ ఇన్ వండర్లాండ్, లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ వంటివి అనేకం ఉన్నాయి. పుస్తకాలు చదవడమేగాక భవిష్యత్తులో మంచి డాక్టర్ని కూడా అవుతాను’’ అని కియరా చెప్పింది. ‘‘కియరాకు వాళ్ల తాతయ్య వాట్సాప్ కాల్లో చెప్పే కథలంటే ఎంతో ఇష్టం. గంటల తరబడి ఆయన చెప్పే కథలు వింటూ ఆమె సమయం గడిపేది. ఆయన ప్రేరణతోనే కియరా ఇలా పుస్తకాలు చదవగలుగుతోంది’’ అని కియరా తల్లి చెప్పారు. కరోనా సమయంలో స్కూళ్లు మూతపడ్డాయి. ఆ సమయంలో కియరా రెండు వందలకు పైగా పుస్తకాలను చదివింది. పుస్తకాలు అయిపోవడంతో కొత్త పుస్తకాలకోసం ఎదురుచూసేది. కొన్ని సందర్భాల్లో చదివిన పుస్తకాలనే మళ్లీమళ్లీ చదువుతూ ఉండేది. ఉద్యోగ రీత్యా మేము ఎంత బిజీగా ఉన్నప్పటికీ షాపింగ్ చేసిన ప్రతిసారి తనకోసం కొన్ని కొత్త పుస్తకాలను కొని తెచ్చిస్తాము’’ అని ఆమె తెలిపారు. విద్యార్థులు ఈ చిన్నారిని చూసైనా కాస్త పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుని మరింత జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆశిద్దాం. ఇక్కడ చదవండి: ఒంటరి తల్లులకు భరోసా ఏదీ? పిల్లలు అకస్మాత్తుగా ఎందుకు స్పృహ తప్పుతుంటారు? -
#AT21: ఆ వయసులో నేను..
ఇరవై ఏళ్ల క్రితం యూనివర్సిటీలో డీన్ ఆర్డర్ కాపీని డీన్ ఎదుటే ముక్కలు ముక్కలుగా చింపి డీన్ ముఖాన విసిరికొట్టిన విద్యార్థి ఈరోజు.. జీవితం ఏరోజుకా రోజు పాస్ చేస్తుండే ఆర్డర్స్‌ని విధేయుడై ఒబే చేస్తుండవచ్చు. **** ఇరవై ఏళ్ల క్రితం నాన్న పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే అమ్మ సపోర్టుతో ఇంట్లోంచి జంప్ అయిపోయి ఢిల్లీ చేరుకుని హాస్టల్ లో ఉండి, చిన్న ఉద్యోగం చేసుకుంటూ సివిల్స్‌కి ప్రిపేర్ అయిన అమ్మాయి ఈరోజు.. మహిళా సంక్షేమ శాఖలో పెద్ద ఆఫీసర్ గా పని చేస్తూ ఉండొచ్చు. **** మరీ ఇంత గంభీరమైనవే కాకున్నా.. ఆ వయసులో.. 21, 22 ఏళ్ల వయసులో.. తామెలా ఉన్నదీ ట్విట్టర్లో కొందరు షేర్ చేసుకుంటున్నారు! అందుకు వాళ్లకు ప్రేరణ నిచ్చింది.. ప్రస్తుతం వార్తల్లో ఉన్న ఐదుగురు యువతులు.. దిశ, సఫూరా, ప్రియాంక, నవదీప్, నిఖిత. బయటి ప్రపంచంలో, ఇంటర్నెట్లో రెండు చోట్లా ఇప్పుడు యువ ప్రభంజనమే విప్లవిస్తోంది! బయటి ప్రపంచానికి ఒక ప్రతిఫలనంగా, ఒక ప్రతిధ్వనిగా సోషల్ మీడియా పల్లవిస్తోంది. రైతు ఉద్యమాన్నే చూడండి. ఇప్పుడిది మెల్లిగా ఒక యువ మహోద్యమంగా మలుపు తీసుకుంటున్నట్లే ఉంది. దిశ రవి, నవదీప్ కౌర్, నిఖితా జాకబ్, సఫూరా జర్గార్, ప్రియాంక పాల్.. అంతా తమ ఇరవైలలో ఉన్న గళాలు, స్వరాలు, శంఖారావాలు. వీళ్లలో కొందరు జైళ్లలో ఉన్నారు. మరికొందరు జైళ్ల బయట అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నారు. అకస్మాత్తుగా ఇండియా కు జవసత్వాలు వచ్చినట్లయింది. నేటి యువతరం మధ్యలోకి నాటి ఇరవైల యువతీయువకులు కూడా వచ్చేసి ఆనాటి తమ పిడికిళ్లను ఉత్సాహంగా విప్పి చూపిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం తామెలా ఉద్యమించిందీ, తమనెలా పెద్దవాళ్లు నిరుత్సాహపరిచిందీ, తామెలా గెలిచిందీ, తామెలా నిలిచిందీ.. ట్విట్టర్లో ‘ఎట్ 21’ హ్యాండిల్‌తో.. ‘ఆ వయసులో నేను’ అంటూ అనుభవాలు షేర్ చేసుకుంటున్నారు. అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఇప్పటి యూత్‌ని ప్రశంసిస్తున్నారు. అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. వాళ్లను ఇంతగా ప్రభావితం చేసి, వాళ్ల పాత జ్ఞాపకాలు గుర్తు చేసిన ఈతరం యంగ్ లీడర్స్ ఈ ఐదుగురు గురించైతే తప్పకుండా తెలుసుకోవలసిందే. దిశా రవి (21) ప్రస్తుతం ఈమెపై ఢిల్లీలో విచారణ జరుగుతోంది. స్వీడన్ టీనేజ్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌కు భారత్‌లోని రైతు ఉద్యమ ‘వ్యూహ రచన’లో సహాయం చేసిందన్న ఆరోపణ పై బెంగుళూరు నుంచి దిశను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆమెపై ‘టూల్‌కిట్’ కేసు పెట్టారు. రైతు ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు కుట్రపూరితంగా ఒక ప్రణాళిక తయారైందని అనుమానిస్తూ ఆ ప్రణాళికకే పోలీసులు ‘టూల్‌కిట్’ అని పేరుపెట్టారు. దిశ ‘ఫ్రైడేస్ ఫర్ ఫార్యూన్ ఇండియా’ (ఎఫ్.ఎఫ్.ఎఫ్.) సంస్థ వ్యవస్థాపకురాలు. పర్యావరణ పరిరక్షణ కోసం పని చేస్తుంటారు. 2018లో ఎఫ్.ఎఫ్.ఎఫ్. ప్రారంభం అయింది. భవిష్యత్ వాతావరణ సంక్షోభంపై దిశ కాలేజీ స్టూడెంట్స్‌ని చైతన్యవంతులను చేస్తుంటారు. పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు. గత ఆదివారం ఆమె బెంగళూరులోని తన ఇంట్లో ఉండగా ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ఢిల్లీలోని పాటియాలా కోర్టులో హాజరపరిచారు. టూల్‌కిట్‌తో ఆమెకు ఉన్నాయని అనుకుంటున్న సంబంధాలపై దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతం దిశ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆమెను విడుదల చేయాలని బెంగళూరు, ఇతర నగరాలలో విద్యార్థులు ప్రదర్శనలు జరుపుతున్నారు. సఫూరా జర్గార్ (28) సఫూరా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాలో ఎం.ఫిల్. విద్యార్థిని. 2019 పౌరసత్వం సవరణ చట్టం ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు గత ఏడాది ఏప్రిల్‌లో అరెస్ట్ అయ్యారు. అప్పటికి ఆమె గర్భిణి. 2020 ఢిల్లీ అల్లర్లకు కుట్ర పన్నారన్నది ఆమెపై ప్రధాన అభియోగం. ఆరో నెల గర్భిణిగా ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో గత జూన్‌లో ఆమెను జైలు నుంచి విడుదల చేశారు. సఫూరా కశ్మీర్ అమ్మాయి. మానవ హక్కులు, మత సామరస్యం, శాంతియుత సహజీవనం వంటి వాటి మీద ప్రసంగాలు ఇస్తుంటారు. ప్రియాంకా పాల్ (19) ప్రియాంకకు ‘ఆర్ట్వోరింగ్’ అనే వెబ్సైట్ ఉంది. ఆమె చిత్రకారిణి, కవయిత్రి, రచయిత్రి, కథావ్యాఖ్యాత. ఎల్.జి.బి.టి. సభ్యురాలిగా తనని తాను ప్రకటించుకున్నారు. కులం, లైంగిక వివక్ష, మానసిక ఆరోగ్యం, బాడీ పాజిటివిటీ (తమ దేహాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆత్మ విశ్వాసంతో అంగీకరించడం) వంటి సామాజిక అంశాలపై తన ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్లో స్పష్టమైన, పదునైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. గత నవంబర్‌లో ప్రియాంక, కంగనా రనౌత్ ట్విట్టర్ వేదికగా మాటా మాటా అనుకున్నారు. మొదట కంగనానే ప్రియాంకను బాడీ షేమింగ్ చేయడంతో ఘర్షణ మొదలైంది. నవ్‌దీప్ కౌర్ (23) నవదీప్ కౌర్ ‘మజ్దూర్ అధికార్ సంఘటన్’ (మాస్) కార్యకర్త. ఢిల్లీ సరిహద్దులోని సింఘులో ఆమె పని చేస్తున్న ఫ్యాక్టరీ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడటంపై ఆమె నోరు విప్పారు. ఫలితంగా ఫ్యాక్టరీ యాజమాన్యం ఆమెపై కేసులు పెట్టింది. జనవరి 12 నుంచి కౌర్ పంజాబ్‌లోని కర్నాల్ జైల్లో ఉన్నారు. ఈ దళిత యువతిపై జైల్లో లైంగిక అకృత్యాలు జరిగాయని, ఆమె లేవలేని పరిస్థితిలో ఉన్నారని సహ ఖైదీల నుంచి సమాచారం బయటికి పొక్కడంతో దేశవ్యాప్తంగా నవ్‌దీప్ కౌర్ విడుదల కోసం ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇప్పటికి మూడుసార్లు ఆమె బెయిల్ నిరాకరణకు గురైంది. ఢిల్లీలో పీహెచ్.డీ చేస్తున్న ఆమె చెల్లెలు రజ్వీర్ కౌర్ అక్కను విడిపించుకునేందుకు న్యాయ పోరాటం చేస్తున్నారు. సోమవారం ఒక కేసులో మాత్రం ఆమెకు బెయిలు లభించింది. 50 వేల రూపాయలు కట్టి, అవసరమైన పత్రాలు అందజేస్తే ఆ కేసులో బెయిలు లభించినప్పటికీ, రెండో కేసులో కూడా బెయిల్ వచ్చేంతవరకు నవ్‌దీప్ విడుదల అయ్యే అవకాశం లేదు. నిఖితా జాకబ్ (29) టూల్‌కిట్ కేసులో ఏ క్షణాన్నయినా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్న మరో యువతి నిఖితా జాకబ్. ముంబైలో ఆమె లాయర్. దిశా రవితో కలిసి పుణెకు చెందిన శంతను, నిఖిత టూల్ కిట్ తయారు చేశారని.. వీళ్లంతా ఖలిస్తాన్ సాను భూతి సంస్థ ‘పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్’ నిర్వహించిన జూమ్ సమావేశానికి హాజరయ్యారని పోలీసుల ప్రధాన ఆరోపణ. ముందస్తు బెయిలు కోసం నిఖిత బాంబే కోర్టును ఆశయ్రించారు. -
శ్రమయేవ జయతే
అది పందొమ్మిది వందల తొంబై ఐదవ సంవత్సరం. పంజాబ్‌లోని లూథియానా జిల్లా, పిండ్ గ్రామం. ఆడపిల్ల అంటే... మగవాళ్ల ఎదుట పడకుండా, తల మీది గూంఘట్ సవరించుకుని, తలుపు చాటు నుంచి మాట చెప్పి, అణకువగా ఒదిగి ఉండాలని నిర్దేశించే రోజులు. ఆ రోజుల్లో అమ్మాయి చదువుకోవడమే ఒక విడ్డూరం. అలాంటి ఊరికి ఓ చదువుకున్న అమ్మాయి కోడలిగా వచ్చింది. చదువుకోవడమే విడ్డూరమైతే ఇక ఉద్యోగం, వ్యాపారం చేయడమన్నది మరీ విచిత్రం. ఆ అమ్మాయిని గ్రహాంతర వాసిని చూసినట్లు చూసేవాళ్లు. ఆ చూపులను ఎదుర్కొన్న గురుదేవ్ కౌర్‌ను ఇప్పుడు అదే ఊరి వాళ్లు ఒక సెలబ్రిటీని చూసినట్లు చూస్తున్నారు. పాతికేళ్ల నిరంతర శ్రమ ఆమెను స్టార్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిలబెట్టింది. తేనె రుచి గురుదేవ్ కౌర్ పెళ్లి నాటికి బీఈడీ చేస్తోంది. పెళ్లితో ఆమె చదువు ఆగిపోయింది. అయితే ఆగిపోయింది టీచర్ ట్రైనింగ్ మాత్రమే. తన వంతుగా... మహిళా సమాజాన్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యతకు ఎటువంటి ఆటంకం కలగకూడదు అనుకుందామె. అప్పుడామె చెప్పిన మంచి మాటలేవీ ఆ గ్రామ మహిళలకు చెవికెక్కనేలేదు. అలాగని గుర్దేవ్ కౌర్ నిరాశపడనూ లేదు. ఈ ప్రయత్నం ఇలా ఉండగానే తనకు ఇష్టమైన తేనెటీగల పెంపకంతో కెరీర్‌ను ప్రారంభించింది. తన ఇంటి వెనుక ఉన్న కొద్ది స్థలంలో ఐదు బాక్సులతో మొదలు పెట్టింది. నాలుగేళ్లకు ఆమె తేనెటీగల పెంపకం 450 బాక్సులకు అభివృద్ధి చెందింది. ఒక్కొక్క బాక్సు నుంచి ఇరవై నుంచి పాతిక కిలోల స్వచ్ఛమైన తేనె ఉత్పత్తి అయ్యేది. మొదట్లో ఆమె సహాయంగా ఉండడానికి కూడా మహిళలు ముందుకు రాలేదు. మగవాళ్లతోనే పని మొదలు పెట్టింది. క్రమంగా ఆమె దగ్గర పని చేయడానికి, పని నేర్చుకోవడానికి మహిళలు ముందుకొచ్చారు. మహిళలకు స్వయం స్వావలంబన అంటే ఏమిటో తెలియచేసింది గురుదేవ్ కౌర్. తేనె రుచితోపాటు సొంతంగా ఒక రూపాయి సంపాదించడంలో ఉండే సంతోషాన్ని కూడా రుచి చూపించింది. అలా ఆమె... పితృస్వామ్య సమాజం మహిళలకు విధించిన కంటికి కనిపించని లక్ష్మణరేఖలను తుడిచేయగలిగింది. ఇప్పుడు పంజాబ్‌లో గుర్దేవ్ కౌర్ ఆధ్వర్యంలో 350 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. నెలకో వంద పొదుపు గురుదేవ్ కౌర్ తన పరిశ్రమను అభివృద్ధి చేయడం కోసం... పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఫుడ్ ప్రాసెసింగ్‌లో మెళకువలు నేర్చుకుంది. ఆ మెళకువలను గ్రామీణ మహిళలకు నేర్పించింది. ఆ మహిళ చేత స్వయం సహాయక బృందాలను రిజిస్టర్ చేయించింది. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయించి నెలకు వంద రూపాయలు పొదుపు చేసేటట్లు ప్రోత్సహించింది. ఆరు నెలల తర్వాత ఆ మహిళలకు రుణాలివ్వడానికి బ్యాంకులే చొరవ చూపించాయి. ఇప్పుడు వాళ్లు సొంతంగా ఆర్జిస్తున్నారు. సమాజంలో ధీమాగా ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు. విజయం ఊరికే రాలేదు అయితే... గుర్దేవ్ కౌర్ వ్యాపార ప్రయాణం మనం పైన చెప్పుకున్నంత సులువుగా ఏమీ సాగలేదు. మహిళలను చైతన్యవంతం చేయడానికి ఆమె తన గ్రామంలో ఇంటింటి తలుపు తట్టింది. ఆడవాళ్లు ఇంటి బయటకు వచ్చి పని చేయడం తప్పు కాదని నచ్చచెప్పింది. అందరి సహకారంతో తేనె, పచ్చళ్లు, జామ్, మురబ్బా, షర్బత్, ఆర్గానిక్ బెల్లం, అప్పడాలు, మసాలా దినుసుల వంటి మొత్తం 32 ఉత్పత్తులను తయారు చేయగలిగింది. కానీ వాటిని మార్కెట్ చేయడం మాత్రం తయారు చేసినంత సులభంగా జరగలేదు. పెద్ద ఎగ్జిబిషన్లలో ఒక టేబుల్ వేసుకుని ‘టేబుల్‌టాప్ షాప్’లు పెట్టింది. ఎగ్జిబిషన్లు లేని రోజుల్లో రోడ్డు పక్కన టేబుల్ వేసుకుని కొనుగోలుదారుల కోసం ఎదురు చూసింది. ‘అప్నీ మండీ’ పేరుతో తన ఉత్పత్తులను మార్కెట్ చేయడం మొదలు పెట్టింది. తర్వాత ‘అప్నీ కిసాన్ మండీ’ పేరుతో తన వ్యాపారాన్ని విస్తరించింది. పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ఐదు వందల కుటుంబాలు గుర్దేవ్ కౌర్ వ్యాపార సామ్రాజ్యంలో భాగమయ్యాయి. విజయం ఎవరికీ ఊరికే రాదు. దాని వెనుక కఠోరమైన శ్రమ ఉంటుంది. ఇప్పుడు గుర్దేవ్ కౌర్ అందుకుంటున్న గౌరవం... పాతికేళ్ల శ్రమ సాధించిన విజయం. ఇప్పుడామె సమావేశాల్లో అదే మాట చెబుతున్నారు. ‘‘ఇప్పుడు నాకు దక్కుతున్న ఈ గౌరవాలను మాత్రమే చూడవద్దు. నేను వేసిన తొలి అడుగును కూడా చూడండి. అనామకంగా వేసిన ముందడుగు అది. నన్ను చూసి స్ఫూర్తి పొందుతామంటే నాకు అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. అయితే మీ కెరీర్ ప్రస్థానంలో ఒడిదొడుకులు ఎదురైనప్పుడు నిరుత్సాహపడకండి. రెండు దశాబ్దాల కఠోరశ్రమ తర్వాత మాత్రమే నేను ఈ దశకు చేరుకున్నాననే నిజాన్ని కూడా గుర్తు చేసుకోండి’’ అని చెబుతుంటారు గురుదేవ్ కౌర్. – మంజీర -
సరబ్జిత్ సోదరిగా 'ఐశ్వర్యరాయ్'
-
గ్లామర్ పాయింట్
కూడలి ఆ టీవి.... ఠీవీయే వేరు! ప్రతిభ ఉండగానే సరిపోదు. ఆ ప్రతిభ పదిమంది దృష్టిలో పడడానికి సరియైన టైమ్ రావాలి. ప్రకటనల్లో, నాటకాల్లో నటించినప్పటికీ నిమ్రత కౌర్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ‘లంచ్‌బాక్స్’ సినిమా ఆమె కెరీర్‌కు కొత్త ఊపు ఇచ్చింది. కౌర్ నటప్రతిభ అంతర్జాతీయస్థాయి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే అమెరికన్ పాప్లర్ టీవీ సిరీస్ ‘హోమ్‌లాండ్’లో ఆమెకు నటించే అవకాశం వచ్చింది. ‘‘అమెరికన్ టీవీలో సరే మన ఇండియన్ టీవీ సీరియల్స్‌లో కూడా నటిస్తారా?’’ అనే ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పకపోయినా ‘కాదు’ అనే చెప్పింది కౌర్. ‘‘వేరొకదాన్ని అనుకరిస్తూ చేసే సీరియల్స్‌లో నటించడం అంటే ఇష్టం ఉండదు. కాపీ సీరియల్స్‌లో నటించడానికి కష్టపడాలా? అని కూడా అనిపిస్తుంది. ఏ రకంగా చూసినా మన ఇండియన్ టీవీతో పోల్చితే అమెరికన్ టీవీ వేరు. వారి ప్రమాణాలు, ప్రాధాన్యతలు వేరు’’ అంటుంది నిమ్రత.