ఆప్టెక్‌ ఏవియేషన్‌- జీఎంఆర్‌ డీల్‌, రానున్న పలు ఉద్యోగాలు | GMR Aviation teams up with Aptech Aviation Academy for new course | Sakshi
Sakshi News home page

ఆప్టెక్‌ ఏవియేషన్‌- జీఎంఆర్‌ డీల్‌, రానున్న పలు ఉద్యోగాలు

Published Tue, Sep 13 2022 2:17 PM | Last Updated on Tue, Sep 13 2022 2:18 PM

GMR Aviation teams up with Aptech Aviation Academy for new course - Sakshi

సాక్షి, ముంబై: విమానాశ్రయ నిర్వహణ, కస్టమర్ల సేవలకు సంబంధించి కోర్సును ఆఫర్‌ చేసేందుకు ఆప్టెక్‌ ఏవియేషన్‌ అకాడమీతో, జీఎంఆర్‌ ఏవియేషన్‌ అకాడమీ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. ‘‘ఈ కోర్సులో చేరే అభ్యర్థులకు ఆప్టెక్‌ తన కేంద్రాల్లో పూర్తి స్థాయి శిక్షణ అందించాల్సి ఉంటుంది.

ఆ తర్వాత కోర్సులో మిగిలిన భాగాన్ని ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్‌ ఏవియేషన్‌ అకాడమీలో పూర్తి చేయాలి’’అని జీఎంఆర్‌ ప్రకటించింది. ఈ కోర్సు అనంతరం వారికి ఉపాధి లభించనుంది. ఎయిర్‌పోర్ట్‌ గ్రౌండ్‌ స్టాఫ్, టికెటింగ్, ప్యాసింజర్‌ సర్వీస్, సెక్యూరిటీ, క్యాబిన్‌ క్రూ తదితర విభాగాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement