Aptech
-
ఆప్టెక్ సీఈవో అనిల్ పంత్ కన్నుమూత
Aptech CEO Anil Pant passes away: ఆప్టెక్ (Aptech) ఎండీ, సీఈవో అనిల్ పంత్ (Anil Pant) మంగళవారం (ఆగస్టు 15) కన్నుమూశారు. ఈ మేరకు ఆప్టెక్ కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలియజేసింది. "కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో డాక్టర్ అనిల్ పంత్ మరణించారని తెలియజేయడానికి కంపెనీ విచారం వ్యక్తం చేస్తోంది. డాక్టర్ పంత్ సహకారం, శక్తిని కంపెనీ కోల్పోతోంది. కంపెనీ డైరెక్టర్లు, ఉద్యోగులు అందరూ ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు" అని ఆప్టెక్ కంపెనీ పేర్కొంది. గత జూన్ నెలలో అనిల్ పంత్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో నిరవధిక సెలవుపై వెళ్లారు. ఆ సమయంలో తాత్కాలిక సీఈవోను ఎంపిక చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలియజేసింది. ఐటీ, కమ్యూనికేషన్ రంగంలో విశేష అనుభవం అనిల్ పంత్ 2016 నుంచి ఆప్టెక్ ఎండీ, సీఈవోగా ఉన్నారు. దీనికి ముందు ఆయన సిఫీ టెక్నాలజీస్, టీసీఎస్‌లలో పనిచేశారు. ఐటీ, కమ్యూనికేషన్ రంగంలో పంత్‌కు 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఆయన సేల్స్, నాణ్యత, డెలివరీ, మార్కెటింగ్, ఉత్పత్తి నిర్వహణ వంటి బాధ్యతలను నిర్వహించారు. పంత్ మలేషియాలోని లింకన్ యూనివర్సిటీ కాలేజ్ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పీహెచ్‌డీని కూడా పొందారు. -
ఆప్టెక్ ఏవియేషన్- జీఎంఆర్ డీల్, రానున్న పలు ఉద్యోగాలు
సాక్షి, ముంబై: విమానాశ్రయ నిర్వహణ, కస్టమర్ల సేవలకు సంబంధించి కోర్సును ఆఫర్ చేసేందుకు ఆప్టెక్ ఏవియేషన్ అకాడమీతో, జీఎంఆర్ ఏవియేషన్ అకాడమీ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. ‘‘ఈ కోర్సులో చేరే అభ్యర్థులకు ఆప్టెక్ తన కేంద్రాల్లో పూర్తి స్థాయి శిక్షణ అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోర్సులో మిగిలిన భాగాన్ని ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఏవియేషన్ అకాడమీలో పూర్తి చేయాలి’’అని జీఎంఆర్ ప్రకటించింది. ఈ కోర్సు అనంతరం వారికి ఉపాధి లభించనుంది. ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, టికెటింగ్, ప్యాసింజర్ సర్వీస్, సెక్యూరిటీ, క్యాబిన్ క్రూ తదితర విభాగాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. -
ఆప్టెక్ బిగ్ ర్యాలీ
ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ప్రొవైడర్ ఆప్టెక్ ప్రీ స్కూల్ రంగంలో అడుగుపెడుతున్నామన్న ప్రకటన కంపెనీకి మరింత బూష్ట్ ఇచ్చింది. ఈ కొత్త వెంచర్ కోసం అంతర్జాతీయ మోంటానా ప్రీస్కూల్ తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది. ట్రేడ్ పండితుడు రాకేష్ ఝున్ ఝన్ వాలా ఇటీవల భారీ వాటా కొనుగోలుతో జోరుగా ఉన్న ఆప్టెక్ మార్కెట్ బలహీనంగా ఉన్నప్పటికీ, ఈ పొత్తు వార్తల నేపథ్యంలో మార్కెట్ లో ఆప్ టెక్ షేరు దూసుకు పోయింది. ఈ డీల్ ప్రకారం ఆప్టెక్ రాబోయే రెండు సంవత్సరాలలో భారతదేశం లో 1,000 ప్రీస్కూల్స్ ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్టు ప్రకటించింది. ఎడ్యుకేషన్ రంగంలో వేగమైన అభివృద్ధి ఉందని ఆప్టెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ కేకర్ చెప్పారు. ప్రస్తుతం భారతదేశంలో ప్రీస్కూల్ విద్య మార్కెట్ రూ16,000 కోట్లుగా ఉందని తెలిపారు. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో ఐటీ శిక్షణా దిగ్గజం ఆప్టెక్ షేరు 10 శాతం లాభపడింది. 52 వారాల గరిష్టంతో అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఆప్టెక్ 10,000 కిపైగా బ్యాంకింగ్ మరియు ఆర్థిక నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు జీయోజిత్ బీఎన్సీ పరిబాస్ తో కుదిరిన ఒప్పందాన్ని జూలై లో ప్రకటించింది. దీంతోపాటుగా ఎన్ఎస్ఇ డేటా ప్రకారం ఆగస్ట్‌లో ఆప్టెక్ లో ప్రధాన ప్రమోటర్లగా ఉన్న ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కుటుంబం మరింత వాటాను కొనుగోలు చేశారు సంగతి తెలిసిందే. దీంతో ఆప్టెక్ షేర్లు గత మూడు నెలల్లో శాతం 150 శాతం లాభపడిందని నిపుణులు తెలిపారు. కాగా గత జూన్ త్రైమాసికంలో ఆప్టెక్ లిమిటెడ్ రూ 0.46 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇది రూ.2.84 కోట్లు. అయితే ఆదాయంలో మాత్రం వృద్ధిని సాధించి రూ 58 కోట్లుగా నమోదుచేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 50 కోట్లుగా ఉంది.