బీమా రంగాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త డిజిటల్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాడు ఆదిత్య దాదియ. ముంబైకి చెందిన ఆదిత్య స్టార్టప్ ‘ఆల్ రైట్’ సూపర్ సక్సెస్ అయింది. ఎన్నో చిక్కుముడులకు పరిష్కార మార్గం చూపించింది. ‘ఆల్‌రైట్’ సృష్టించిన సాఫ్ట్‌వేర్, ఇన్సూరెన్స్ కంపెనీల పనితీరును సులభతరం చేస్తుంది. సమయాన్ని ఆదా చేస్తుంది.
వాణిజ్య బీమా విభాగం పాత దారిలోనే నడుస్తోంది. ఇంటర్నల్ ఇన్సూరెన్స్ ప్రాసెస్ ఇప్పటికీ మాన్యువల్‌గానే ఉంది. ఈ నేపథ్యంలో బీమా కంపెనీలను కొత్త దారిలో నడిపించడానికి ముందుకు వచ్చింది నెక్స్›్ట–జెనరేషన్ టెక్ ΄్లాట్‌ఫామ్ ఆల్‌రైట్. కోవిడ్ మహమ్మారి కాలంలో ‘ఆల్‌రైట్’పై దృష్టి పెట్టాడు కార్పొరేట్ లాయర్ అయిన ఆదిత్య దాదియ.
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఫిన్‌టెక్ స్టార్టప్‌లతో కలిసి పనిచేసిన ఆదిత్య ఆ టైమ్‌లో గమనించిన విషయం ఏమిటంటే.... కమర్షియల్ ఇన్సూరెన్స్ స్పేస్‌లో పని పూర్తిగా మాన్యువల్‌గానే జరుగుతుందని. ఈ నేపథ్యంలోనే ‘ఆల్‌రైట్’పై దృష్టి పెట్టాడు. అయితే ఇది అంత తేలికైన విషయం కాదనేది ఆదిత్యకు తెలుసు. రకరకాల ప్రయత్నాల తరువాత విజయం సాధించాడు. బీమా కంపెనీల పనిని సులభతరం చేసే సాఫ్ట్‌వేర్‌ను సక్సెస్‌ఫుల్‌గా రూపొందించాడు.
"సమయాన్ని ఆదా చేయగలిగే సాఫ్ట్‌వేర్ ఇది. ఉదాహరణకు..రెండు వారాలు పట్టే పనిని నిమిషాల్లో చేయవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్‌కు తక్కువ కాలంలోనే మార్కెట్ నుంచి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఇన్నోవేటివ్ స్టార్టప్‌గా గుర్తింపు పొందిన ‘ఆల్‌రైట్’ గత సంవత్సరం సీడ్ ఫండింగ్ రౌండ్‌లో విజయవంతంగా పది కోట్లు సమీకరించింది". జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలతో పాటు ఏజెంట్లు, ఇన్సూరెన్స్ బ్రోకర్స్, కార్పొరేట్ ఏజెంట్స్ తమ ‘టార్గెట్ కన్జ్యూమర్స్’ అంటున్నాడు ఆదిత్య.
బీమా కంపెనీలు, బ్రోకర్లు, ఏజెంట్లు, కార్పొరెట్ ఇంటర్‌మీడియరీస్, బ్యాంకుల మధ్య అంతరాన్ని తగ్గించే సొల్యూషన్స్ అందించాలని ‘ఆల్‌రైట్’ లక్ష్యంగా పెట్టుకుంది. కోట్ ప్రొక్యూర్‌మెంట్, ప్లేస్‌మెంట్, అండర్ రైటింగ్, యూజర్ మేనేజ్‌మెంట్, నాలెడ్జ్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ టూల్....స్థూలంగా చె΄్పాలంటే బీమా ప్రక్రియను సులభతరం చేయడాన్ని లక్ష్యంగా నిర్ణయించుకుంది ఆల్‌రైట్.
‘ఫోర్స్బ్ 30 అండర్ 30–ఆసియా’ జాబితాలో చోటు సంపాదించిన ఆదిత్య తన కంపెనీ మరింత విస్తరించే ప్రణాళికలతో బిజీగా ఉన్నాడు. ‘ఇది ఇలాగే ఉంటుంది. అంతే’ అనుకునేవారు కొందరు. ‘అలాగే ఎందుకు ఉండాలి? మరోలా కూడా ఉండవచ్చు కదా’ అని అడిగే వాళ్లు కొందరు. ఆదిత్య రెండో కోవకు చెందిన యువకుడు. కొత్తగా ఆలోచిస్తే విజయం ఖాయం అని అక్షరాలా ‘ఆల్‌రైట్’తో నిరూపించిన యువకుడు.
Comments
Please login to add a commentAdd a comment