కత్రినాకి లవర్ బాయ్ గిఫ్ట్ | Aditya gifts pashmina shawl to Katrina | Sakshi

కత్రినాకి లవర్ బాయ్ గిఫ్ట్

Jan 12 2016 10:01 PM | Updated on Apr 4 2019 5:42 PM

కత్రినా కైఫ్ కు ఫితూర్ హీరో ఆదిత్యరాయ్ కపూర్ స్వయంగా ఒక బహుమతి కొనిచ్చాడట. స్వచ్ఛమైన కాశ్మీరీ పష్మీనా శాలువాను ఆమెకు బహుకరించాడు.

ముంబై: కత్రినా కైఫ్ కు ఫితూర్ హీరో ఆదిత్యరాయ్ కపూర్ స్వయంగా ఒక బహుమతి  కొనిచ్చాడట. స్వచ్ఛమైన కాశ్మీరీ పష్మీనా శాలువాను ఆమెకు బహుకరించాడు.  'ఆషికీ' ఫేం ఆదిత్యరాయ్ కపూర్  స్వయంగా దగ్గరుండి మరీ  ఎంతో  ఇష్టంగా ఈ కానుకను సెలెక్ట్ చేశాడని చిత్ర  వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే  లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఆదిత్య, కత్రీనాల ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీ  ఎలావుంటుందోనని ఇప్పటికే  బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
పష్మీనా షాల్ శాలువాపై చేతితో చేసిన ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఇదే దీని ప్రత్యేకత కూడా.. ఇదిలా ఉండగా, చార్లెడ్ డికెన్స్ రచించిన ‘గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్' నవల ఆధారంగా కత్రినా కైఫ్, ఆదిత్యరాయ్ కపూర్ జంటగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఫితూర్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో వీరిద్దరి మధ్య ఉన్న రొమాంటిక్ సీన్ల గురించి ఇప్పటికే హాట్ టాపిక్ గా వినిపిస్తోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement