ఆంధ్ర–తెలంగాణ ఇన్విటేషన్ గ్రీన్ క్యారమ్ టోర్నమెంట్లో రాష్ట్ర క్రీడాకారులు కె. శ్రీనివాస్, ఆదిత్య, జహీర్ అహ్మద్, దినేశ్ బాబు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర–తెలంగాణ ఇన్విటేషన్ గ్రీన్ క్యారమ్ టోర్నమెంట్లో రాష్ట్ర క్రీడాకారులు కె. శ్రీనివాస్, ఆదిత్య, జహీర్ అహ్మద్, దినేశ్ బాబు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మహిళల విభాగంలో రాష్ట్ర ప్లేయర్లు మాధవి, సునీత క్వార్టర్స్ చేరుకున్నారు. కావలిలో శనివారం జరిగిన పురుషుల ఐదో రౌండ్ పోటీల్లో ఆదిత్య 25–0, 25–0తో సృజన్ కుమార్ (ఏపీ)పై, దినేశ్ బాబు (తెలంగాణ) 25–12, 25–0తో శ్రీను (ఏపీ)పై, వైఎస్‌డీ రమేశ్ (ఏపీ) 15–25, 25–4, 16–15తో కృష్ణ (తెలంగాణ)పై, కరీముల్లా (ఏపీ) 17–9, 25–7తో రవీంద్ర రెడ్డి (ఏపీ)పై గెలిచారు.
మహిళల మూడో రౌండ్ పోటీల్లో హుస్నా సమీర (ఏపీ) 25–0, 25–0తో తేజస్విని (ఏపీ)పై, మాధవి (తెలంగాణ) 25–4, 23–2తో నిర్మల (ఏపీ)పై, తనూజ (ఏపీ) 25–0, 25–7తో సరిత (తెలంగాణ)పై, భవాని (ఏపీ) 8–21, 25–0, 17–10తో హారిక (ఏపీ)పై విజయం సాధించారు. లీగ్ పోటీలు ముగిసేసరికి టాప్–8లో నిలిచిన ఆటగాళ్లు క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు.