త్వరలో తల్లి కాబోతున్న నటి అనుష్క? | Is Anushka Ranjan, Aditya Seal Expecting Their First Child? | Sakshi
Sakshi News home page

Anushka Ranjan: త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న బాలీవుడ్‌ దంపతులు!

Published Sun, Jan 8 2023 5:20 PM | Last Updated on Sun, Jan 8 2023 5:20 PM

Is Anushka Ranjan, Aditya Seal Expecting Their First Child? - Sakshi

బాలీవుడ్‌ నటుడు ఆదిత్య సీల్‌ త్వరలో తండ్రి కాబోతున్నాడట. ఆదిత్య సతీమణి, నటి అనుష్క రంజన్‌ గర్భం దాల్చిందంటూ బీటౌన్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. దీని గురించి ఆదిత్య దంపతులు ఇంతవరకు స్పందించలేదు. అయితే వారి బంధువులు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేశారు. ఆ రూమర్స్‌లో ఎలాంటి నిజం లేదని చెబుతున్నారు. కాగా ఇటీవలే వీరిద్దరూ దుబాయ్‌లో విహారయాత్రను ముగించుకుని ముంబైకి తిరిగి వచ్చారు.

ఇకపోతే అనుష్క తల్లి అను రంజన్‌ ఏర్పాటు చేసిన ఓ ఫ్యాషన్‌ షోలో తొలిసారి ఆదిత్య, అనుష్కల మధ్య పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారగా 2019 అక్టోబర్‌లో ఆదిత్య.. అనుష్కకు ప్రపోజ్‌ చేశాడు. ఆమె ఓకే చెప్పడంతో వీరి ప్రేమ ముందుకు సాగింది. రెండేళ్లపాటు డేటింగ్‌ చేసిన తర్వాత పెద్దలను ఒప్పించి 2021 నవంబర్‌లో పెళ్లి చేసుకున్నారు.

చదవండి: వాల్తేరు వీరయ్య ఈవెంట్‌కు శ్రుతిహాసన్‌ డుమ్మా
కొడుకు బ్లాక్‌మెయిల్‌ చేసిన శ్రీహాన్‌.. చిన్మయి ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement