ప్రశంసలే ప్రశంసలు!
బాల్యంలోనే విద్యార్థుల్లో సృజనాతక్మ శక్తిని పెంపొందిస్తే వాళ్లు మంచి పౌరులుగా ఎదుగుతారనే అంశంతో స్వీయదర్శకత్వంలో భీమగాని సుధాకర్ గౌడ్ రూపొందించిన చిత్రం ‘ఆదిత్య’. శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల మూడో వారంలో విడుదల కానుంది.
చిత్రవిశేషాలను సుధాకర్ గౌడ్ తెలియజేస్తూ -‘‘జాతీ, అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై, ఈ చిత్రం పలువురి ప్రముఖుల ప్రసంశలు పొందింది. అలాగే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వాలచే పన్ను మినహాయింపు పొందింది.
పలువురు ఐఏయస్ ఆఫీసర్స్ కూడా ఈ చిత్రాన్ని అభినందించారు’’ అన్నారు. మల్లికార్జునరావు మాట్లాడుతూ -‘‘ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు జాతీయ స్థాయిలో అవార్డులు తెచ్చుకుంటున్న వైనాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రం చేశారు. విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచే చిత్రం అవుతుంది’’ అని చెప్పారు.