Sudhakar Goud
-
స్ఫూర్తి నింపే చిత్రాలు రావాలి
‘‘ఆదిత్య.. క్రియేటివ్ జీనియస్’ సినిమా చాలా బాగుంది. చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పారు. ప్లాస్టిక్ వాడకం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో చూపించారు. బాల–బాలికల్లో స్ఫూర్తి నింపే ఇలాంటి గొప్ప చిత్రాలు తరచూ రావాలి’’ అని తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య అన్నారు. భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన బాలల చిత్రం ‘ఆదిత్య.. క్రియేటివ్ జీనియస్’. 2015 నవంబర్4న విడుదలైన ఈ చిత్రం 19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో ఏకైక తెలుగు చిత్రంగా పురస్కారం అందుకుంది. తాజాగా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్, జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పురస్కారాలు అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘ఆదిత్య’ చిత్రంలో నేనూ నటించాను. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘పిల్లలతో సినిమాలు తెరకెక్కించడం చాలా కష్టం. ఆ శ్రమను గుర్తించే మా చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నాకు నంది పురస్కారం అందించారు’’ అన్నారు భీమగాని సుధాకర్ గౌడ్. నటుడు సుమన్ పాల్గొన్నారు. -
ప్రశంసలే ప్రశంసలు!
బాల్యంలోనే విద్యార్థుల్లో సృజనాతక్మ శక్తిని పెంపొందిస్తే వాళ్లు మంచి పౌరులుగా ఎదుగుతారనే అంశంతో స్వీయదర్శకత్వంలో భీమగాని సుధాకర్ గౌడ్ రూపొందించిన చిత్రం ‘ఆదిత్య’. శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల మూడో వారంలో విడుదల కానుంది. చిత్రవిశేషాలను సుధాకర్ గౌడ్ తెలియజేస్తూ -‘‘జాతీ, అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై, ఈ చిత్రం పలువురి ప్రముఖుల ప్రసంశలు పొందింది. అలాగే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వాలచే పన్ను మినహాయింపు పొందింది. పలువురు ఐఏయస్ ఆఫీసర్స్ కూడా ఈ చిత్రాన్ని అభినందించారు’’ అన్నారు. మల్లికార్జునరావు మాట్లాడుతూ -‘‘ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు జాతీయ స్థాయిలో అవార్డులు తెచ్చుకుంటున్న వైనాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రం చేశారు. విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచే చిత్రం అవుతుంది’’ అని చెప్పారు. -
నేనే కమిషనర్.. కాదు నేనే..
హుస్నాబాద్ : కార్యాలయం ఒక్కటే.. కానీ కమిషనర్లు ఇద్దరు.. ఇది హుస్నాబాద్ నగర పంచాయతీలో సోమవారం చోటుచేసుకున్న విచిత్ర పరిస్థితి. దీనికి ఇటీవల చోటుచేసుకున్న బదిలీ అనంతర పరిణామాలే కారణం. ఇక్కడి కమిషనర్ కూచన ప్రభాకర్‌ను ఈ నెల 15న ప్రభుత్వం వరంగల్ కార్పొరేషన్‌కు, సిరిసిల్లలో పని చేస్తున్న సుధాకర్‌గౌడ్‌ను హుస్నాబాద్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సుధాకర్‌గౌడ్ 16న విధుల్లో చేరారు. అయితే ఈ బదిలీని సవాల్ చేస్తూ ప్రభాకర్ రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ప్రభాకర్‌కు అనుకూలంగా ట్రి బ్యునల్ శనివారం స్టేటస్ కో జారీ చేసింది. సోమవారం బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై ఏర్పాటు చేసిన సమావేశానికి ఇద్దరు కమిషనర్లు హాజరయ్యారు. ఒకరి పక్కనే ఒకరు కూర్చున్నారు. కార్యాలయానికి వచ్చిన కౌన్సిలర్లు అసలు కమిషనర్ ఎవరని ప్రశ్నించారు. కౌన్సిలర్ గాదపాక రవీందర్, బీజేపీ నాయకుడు కవ్వ వేణుగోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు అయిలేని మల్లికార్జున్‌రెడ్డి మాట్లాడుతూ పండుగ ఏర్పాట్ల గురించి ఎవరితో చర్చించాలని అడిగారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పరిస్థితిలో మార్పు రాలేదు. వైస్‌చైర్మన్ బొలిశెట్టి సుధాకర్, పలువురు వార్డు కౌన్సిలర్లు గోవింద్ రవి, ఇంద్రాల సారయ్య, కామిరెడ్డి రామేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్నాయకులు మైల కొంరయ్య, బొల్లి శ్రీనివాస్ వచ్చి చైర్మన్ వివరణ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే నడుచుకుంటామని, ట్రిబ్యునల్ తీర్పు అమలు అధికారులు చూస్తారని చైర్మన్ చంద్రయ్య బదులిచ్చారు. ఈ వివాదంపై చైర్మన్ రీజినల్ డెరైక్టర్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఆర్డీ సలహా మేరకు ప్రభాకర్ ఆయన వద్దకు వెళ్లగా సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేశారు. నేను విధుల్లోనే ఉన్నాను.. : సుధాకర్‌గౌడ్ ఈనెల 16న విధుల్లో చేరాను. ప్రభాకర్ రిలీవ్ అయ్యారు. కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించేటప్పుడు చార్జీ ఇవ్వడమనేది ఉండదు. పైగా బదిలీ అనంతరం ప్రభాకర్‌కు స్టేటస్కో వచ్చింది. నేను చార్జీ ఇవ్వలేదు.. రిలీవ్‌కాలేదు.: ప్రభాకర్ బదిలీ జరిగిన తర్వాత నేను ఎవరికీ చార్జీ ఇవ్వలేదు. రిలీవ్సైతం కాలేదు. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు విధుల్లో చేరేందుకు వచ్చాను. -
విద్యార్థుల్లో చైతన్యం కోసం...
‘ఆదిత్య’ పేరుతో ఓ బాలల చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలింస్ పతాకంపై భీమగాని సుధాకర్‌గౌడ్ స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటుడు, నిర్మాత అశోక్‌కుమార్ ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచాన్ చేయగా, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డా. తాటికొండ రాజయ్య క్లాప్ ఇచ్చారు. పి. విజయవర్మ గౌరవ దర్శకత్వం వహించారు. భీమగాని సుధాకర్‌గౌడ్ మాట్లాడుతూ -‘‘మూడు దశాబ్దాలుగా విద్యావేత్తగా ఉన్నాను. విద్యార్థుల్లో చైతన్యం కలిగించి, వాళ్లల్లో విద్య, వైజ్ఞానిక, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించాలనే సదాశయంతో ఈ చిత్రం చేస్తున్నాను. రెండు షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తి చేసి, ఆగస్ట్ 15న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. బ్రహ్మానందం ముఖ్య పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో బాలనటుల పాత్రలను ప్రవీణ్, రాహుల్, రోమీర్, షణ్ముఖ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, కెమెరా: కందేటి శంకర్, పాటలు: దానయ్య, ఆర్ట్: భాస్కర్.