
సత్యవేడు ఎమ్మెల్యేను నిలదీసిన జనం
రుణాలన్నీ మాఫీ చేయండి
బుచ్చినాయుడుకండ్రిగ: రైతు, డ్వాక్రా రుణాలను పూర్తి గా మాఫీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే తలారి ఆదిత్యను వైఎస్సార్ సీపీ నాయకుడు గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు, మహిళలు అడ్డుకున్నారు. గురువారం మండలంలోని పల్లమాల గ్రామంలో ఎమ్మెల్యే ఆదిత్య పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకుడు గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక వంచించడం దారుణమన్నారు.
ఇచ్చిన మాటను నిలుపుకోవాలని కోరారు. చంద్రబాబునాయుడు ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. రైతు, డ్వాక్రా మహిళల రుణాలను వెంటనే పూర్తిగా మాఫీ చేయాలన్నారు. దీంతో ఎమ్మెల్యే ఆదిత్య, టీడీపీ నాయకులు, రైతులు, మహిళలకు, వైఎస్సార్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకొంది. టీడీపీ నాయకులు గొడవకు దిగటంతో ఎస్‌ఐ ఈశ్వరయ్య రంగంలోకి దిగి సర్దిచెప్పారు. గొడవ సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు బ్రహ్మయ్య, శ్రీరాములురెడ్డి, అధికసంఖ్యలో రైతులు, మహిళలు పాల్గొన్నారు.