విద్యార్థి ఘనత.. వేతనం రూ. 1.2 కోట్లు | Bangalore Student Placed In Google With Huge Package | Sakshi
Sakshi News home page

విద్యార్థి ఘనత.. వేతనం రూ. 1.2 కోట్లు

Published Sun, Jul 8 2018 2:58 PM | Last Updated on Mon, Aug 20 2018 4:52 PM

Bangalore Student Placed In Google With Huge Package - Sakshi

ఆదిత్య పలివల్‌

బెంగళూరు : నగరంలోని ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐఐఐటీబీ)కి చెందిన 22 ఏళ్ల విద్యార్థి గూగుల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ టీమ్‌లో చోటు సంపాదించాడు. ఏడాదికి 1.2 కోట్ల రూపాయల భారీ పారితోషకాన్ని ఆదిత్య పలివల్‌ అందుకోనున్నారు. ముంబైకి చెందిన ఆదిత్య ఐఐఐటీ-బెంగళూరులో ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ చేస్తున్నారు.

గూగుల్‌ నిర్వహించిన ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ టెస్టులో ప్రపంచవ్యాప్తంగా 6 వేల మంది విద్యార్థులు పాల్గొనగా, 50 మంది సెలెక్ట్‌ అయ్యారు. అందులో ఆదిత్య పలివల్‌ కూడా ఒకరు. బెంగళూరు క్యాంపస్‌లో ప్రొవైడ్‌ చేసిన ఫెసిలిటీస్‌ వల్లే ఈ విజయం సాధించగలిగానని ఆదిత్య తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement