
పలు తెలుగు సినిమాల్లో విలన్‌గా నటించిన ఆదిత్య మీనన్ ఆస్పత్రిపాలయ్యాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న "హరి హర వీరమల్లు" షూటింగ్‌లో ఆయన గాయపడ్డారు. ఇటీవల సెట్స్‌లో గుర్రపు స్వారీ చేస్తున్న క్రమంలో అదుపు తప్పి కింద పడ్డారు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆయనను ముంబైలోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. తాజాగా ఆయన్ను చెన్నై ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆదిత్య మీనన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేయడంతో కుటుంబ సభ్యులు, చిత్రయూనిట్ ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇదిలా వుంటే ఆదిత్య మీనన్ 'బిల్లా' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. గతంలో పవన్ కల్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' సినిమాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించాడు. ఇక అతడికి ప్రమాదం జరిగిన కారణంగా వీరమల్లు.. షూటింగ్ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడికల్ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయకర్ రావు నిర్మిస్తున్నాడు.
వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో జాక్విలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో పవన్ వజ్రాల దొంగగా ఆలరించనున్నట్లు సమాచారం. ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు. నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment