ఢాకా నుంచి రవీంద్రుడి విద్యాలయంలోకి.. | mahaswetha devi childhood life | Sakshi
Sakshi News home page

ఢాకా నుంచి రవీంద్రుడి విద్యాలయంలోకి..

Published Thu, Jul 28 2016 4:37 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

ఢాకా నుంచి రవీంద్రుడి విద్యాలయంలోకి.. - Sakshi

ఢాకా నుంచి రవీంద్రుడి విద్యాలయంలోకి..

కోల్కతా: మహాశ్వేతా దేవి 1926 జనవరి 14న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జన్మించారు. వారిది సాహితీ వేత్తల కుటుంబం. గత కొద్ది కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె కుటుంబ నేపథ్యం పరిశీలిస్తే ఆమె తండ్రి పేరు మనీశ్ ఘటక్. ఈయన ప్రముఖ కవి.. నవలా రచయిత కూడా. ఘటక్ సోదరుడు రిత్విక్ ఘటక్ ప్రముఖ చిత్ర దర్శకుడు. శ్వేతాదేవి తల్లి ధాత్రి దేవీ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త.

ఆమె సోదరులు మాత్రం వివిధరంగాల్లో స్థిరపడ్డారు. మహాశ్వేతా దేవీ పాఠశాల విద్యాభ్యాసం ఢాకాలోనే పూర్తయింది. కానీ, విభజన తర్వాత వారి కుటుంబం కోల్ కతాకు వచ్చేసింది. అనంతరం ఆమె రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ లోని విశ్వభారతీ యూనివర్సిటీలో బీఏ పూర్తి చేశారు. ఎంఏ ఇంగ్లిష్ ను కోల్ కతా యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఆమె బిజాన్ భట్టాచార్య అనే ప్రముఖ నాటకాల రచయితను వివాహం చేసుకున్నారు. అయితే, ఆయనతో ఆమె 1959లో విడిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement