Actress Keerthy Suresh Shares Her Childhood Photos With Her Sister, Goes Viral - Sakshi
Sakshi News home page

ఆ ఫోటోలోని చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

Mar 11 2023 4:49 PM | Updated on Mar 11 2023 5:22 PM

Actress Keerthy Suresh Shares Childhood Photos With her Sister - Sakshi

సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తుంటారు. ఇక సినీ ప్రముఖులు ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటారు. అలాగే తమ జీవితంలోని ప్రతి సందర్భాన్ని ఫ్యాన్స్‌తో పంచుకోవడం ఇప్పుడు ఓ ట్రెండ్‌గా మారిపోయింది. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఆ ఫోటోలు కనిపిస్తున్న ఇద్దరిలో ఓ పాప స్టార్‌ హీరోయిన్‌. దక్షిణాదిలో పలువురు అగ్ర హీరోలతో నటించింది. తనదైన నటనతో మహానటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకు ఆ పాలబుగ్గల పసిపాప ఎవరో మీకు గుర్తొచ్చిందా? మరెవరో కాదు.. సావిత్రి బయోపిక్‌లో మహానటి సినిమాతో జాతీయ అవార్డును కూడా అందుకున్న నటి కీర్తి సురేశ్.  నేను శైలజా సినిమాతో టాలీవుడ్‌లో ఫేమ్ సాధించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆమె తన ఇన్‌స్టాలో ఆ ఫోటోలు షేర్ చేయడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.  

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది కీర్తి సురేశ్. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. తాజాగా కీర్తి సురేశ్ తన అక్క రేవతి పుట్టిన రోజును పురస్కరించుకుని ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా తనతో దిగిన చిన్నప్పటి ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకుంది. కాగా.. కీర్తి సురేశ్ అక్క రేవతి కూడా విఎఫ్ఎక్స్ స్పెషలిస్ట్. షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్‌లో ఆమె పనిచేశారు.

కీర్తి తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'అక్కా నీ పుట్టినరోజు సందర్భంగా నా గ్యాలరీ నుంచి అందమైన జ్ఞాపకాలు ఇవీ. వీటి ద్వారా ప్రేమ, కౌగిలింతలతో కూడిన శుభాకాంక్షలు పంపుతున్నా. ఈ ఏడాదిలో ఇంతకుముందు లేని విధంగా ప్రత్యేకంగా ఉండనివ్వండి’అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ప్రస్తుతం నానితో కలిసి దసరా చిత్రంలో నటిస్తోంది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్‌లో కనిపించనున్నారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement