
చిన్నపిల్లల్లో వచ్చే ఆస్తమాకి కాంబినేషన్ మెడిసిన్!
చైల్డ్‌హుడ్ ఆస్తమా అని పిలిచే చిన్నపిల్లల ఆస్తమాకు మరింత మేలైన మందును రూపొందించారు. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోలోని మెడిసిన్ విభాగంలో జరిగిన పరిశోధనల్లో ఈ మందును రూపొందించారు. ఆస్తమా వచ్చినప్పుడు మూసుకుపోయే గాలి మార్గాలు ఈ మందు వల్ల తెరచుకుంటాయి. ‘‘దీని వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఒనగూరతాయి. మొదటిది ఆస్తమా వచ్చినప్పుడు కలిగే ఇన్‌ఫ్లమేషన్‌ను ఇది తగ్గిస్తుంది. రెండోది... ఆస్తమాలో సన్నబారిన గాలి మార్గాలను విశాలంగా చేస్తుంది. ఈ రెండు ప్రయోజనాల వల్ల ఇది మరింత ప్రయోజనకారి’’ అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పిల్లల వైద్య పరిశోధనల్లో పాలుపంచుకున్న పీడియాట్రిక్ నిపుణులు డాక్టర్ స్టాన్లీ జెఫ్లర్. ప్రస్తుతం ఇది ఎంత సురక్షితం అన్న అంశంపై పరిశీలనలు జరుగుతున్నాయి.