
బాల్యంలో హింసకు గురైతే తలనొప్పి!
టొరంటో: బాల్యంలో వివిధ రకాలుగా వేధింపులకు గురయ్యేవారు పెరిగి పెద్దవారయ్యాక తలనొప్పి సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారని తాజా సర్వే వెల్లడించింది. తరచుగా వచ్చే తలనొప్పికి కారణం బాల్యంలో వారు తల్లిదండ్రుల చేతుల్లో హింసకు గురవ్వడమేనని టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన ఎస్మే ఫుల్లర్ థాంప్సన్ తన పరిశోధనలో గుర్తించారు. ఇందుకోసం వివిధ వయసులు, జాతులు, సామాజిక పరిస్థితులు, ఒత్తిళ్లు ఎదుర్కొన్న నేపథ్యాలు, చికాకుతోపాటు చిన్నతనంలో భౌతిక, లైంగిక దాడులకు గురైన పురుషులు, మహిళల్లో 52 శాతం ఈ తలనొప్పి ఛాయలు కనిపించాయి.
బాల్యంలో ఎలాంటి హింస ఎదుర్కోని వారితో పోల్చినపుడు వీరు 64 శాతం ఎక్కువగా తలనొప్పి బారినపడ్డారు. 18పై ఏళ్లు పైబడిన దాదాపు 12,638 మహిళలు, 10,358మంది పురుషులపై ఆరోగ్యస్థితిని పరిశీలించారు. ఇందుకోసం 2012 కెనడియన్ కమ్యూనిటీ హెల్త్ సర్వే-మెంటల్ హెల్త్ నుంచి ఈ వివరాలు సేకరించారు.