చిన్నప్పుడు నన్ను డుంబు అనేవాళ్లు: నటి | They locked me in cupboards, called me blubber: kate winslet | Sakshi
Sakshi News home page

చిన్నప్పుడు నన్ను డుంబు అనేవాళ్లు: నటి

Published Thu, Mar 23 2017 8:17 PM | Last Updated on Tue, Sep 5 2017 6:54 AM

చిన్నప్పుడు నన్ను డుంబు అనేవాళ్లు: నటి

చిన్నప్పుడు నన్ను డుంబు అనేవాళ్లు: నటి

న్యూయార్క్‌: తన చిన్ననాటి మధుర జ్ఞాపకాలు ప్రముఖ హాలీవుడ్‌ నటి, ఆస్కార్‌ విజేత కేట్‌ విన్సెలెట్‌ పంచుకుంది. తాను చిన్నతనంలో ఎంతో బొద్దుగా ఉండేదాన్నని అందరూ తనను ఆటపట్టించేవారని చెప్పింది. తనను ఫాలో అవుతూ, తనలాగే హావభావాలు పలికిస్తూ ఏడిపించేవారని తెలిపింది. లండన్‌లోని వీ డే అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ విషయాలు చెప్పింది. ‘నేనెప్పుడూ నన్ను ఇతరులతో పోల్చుకునేదాన్ని. వాళ్లంతా నన్ను డుంబు అని పిలుస్తూ టీజ్‌ చేసే వాళ్లు. కప్‌బోర్డులో పెట్టి నావైపు చూస్తూ తెగ నవ్వుతుండేవారు. నేను బొద్దుగా ఉండి అందంగా కనిపించకపోయేదాన్ని.

అయితే, చిన్నప్పటి నుంచే నాకు నటన అంటే ఇష్టం. ఈ విషయంలో నేను చాలా లక్కీ అని చెబుతుండేదాన్ని. స్కూళ్లో ప్రదర్శనలకోసం ప్రతిసారి ఆడిషన్‌కు వెళ్లే దాన్ని. నాకెప్పుడు మంచి పాత్రలు రాలేదు. కానీ అలాంటి విషయాలు నేను పట్టించుకోలేదు. ముసలి, కప్ప, డార్క్‌ ఫెయిరీలాంటి పాత్రలు కూడా చాలా బాగా చేసేదాన్ని ఒకసారి కప్పడాన్స్‌ కూడా చేశాను. దానిని ఇప్పటికే నేను ఇష్టపడతాను. నాకు నటనంటే పిచ్చి. అది చిన్నదా పెద్దదా అనే విషయం మాత్రం అస్సలు చూడను. నేను గొప్పగా ఉండాలని అనుకుంటాను. అందుకే ప్రతిక్షణం నేర్చుకుంటూనే ఉంటాను’  అంటూ చెప్పుకొచ్చిందీ అమ్మడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement