IPL 2023: Virat Kohli Meets His Childhood Coach Rajkumar Sharma-Touches His Feet - Sakshi
Sakshi News home page

Virat Kohli: 'ఎక్కడ తగ్గాలో తెలిసినోడు'.. చిన్ననాటి కోచ్‌ కాళ్లు మొక్కి

Published Sat, May 6 2023 8:34 PM | Last Updated on Sat, May 6 2023 9:07 PM

Virat Kohli Meets His Childhood Coach Rajkumar Sharma-Touches His Feet - Sakshi

Photo: IPL Twitter

టీమిండియా స్టార్‌ కింగ్‌ కోహ్లి ఏం చేసినా క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. గౌతమ్‌ గంభీర్‌తో గొడవ కోహ్లి తాను ఎంత అగ్రెసివ్‌ అనేది మరోసారి నిరూపించింది. అయితే  తాను అగ్రెసివ్‌ మాత్రమే కాదని.. మంచి మనసు కూడా దాగుందని కోహ్లి చూపించాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ ప్రారంభానికి ముందు కోహ్లి తన చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మను కలుసుకొని కాళ్లు మొక్కడం వైరల్‌గా మారింది. 

తన క్రికెట్లో ఓనమాలు నేర్పిన గురువును చూడగానే కోహ్లీ చేస్తున్న ప్రాక్టీసును ఆపేశాడు. నేరుగా రాజ్ కుమార్ శర్మ వద్దకు చేరుకుని వినయంగా పాదాలకు నమస్కరించాడు. కోహ్లీ విధేయత పట్ల ఎంతో సంతోషించిన ఆయన శిష్యుడి వీపు తట్టి దీవెనలు అందించాడు. అనంతరం ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. 

ఇక కోహ్లి ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 12 పరుగుల స్కోరు వద్ద ఐపీఎల్‌లో ఏడువేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.

చదవండి: 'కింగ్‌' కోహ్లి చరిత్ర.. ఐపీఎల్‌లో తొలి బ్యాటర్‌గా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement