
Photo: IPL Twitter
ఆర్‌సీబీ స్టార్ విరాట్ కోహ్లి మైదానంలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా కోహ్లి క్యాచ్‌లు పట్టడంలో తనకు తానే సాటి. సాధారణంగా అతను క్యాచ్‌లు వదిలేయడం చాలా తక్కువ. క్లిష్ట పరిస్థితుల్లో, ఒత్తిడిలో తప్పిస్తే మిగతా అన్ని సందర్భాల్లో స్టన్నింగ్ క్యాచ్‌లు కోహ్లి చాలానే తీసుకున్నాడు. అలాంటి కోహ్లి తొలిసారి ఒక క్యాచ్ విషయంలో కన్ఫూజన్‌కు గురయ్యాడు. ఈ ఘటన పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో చోటుచేసుకుంది.
విషయంలోకి వెళితే.. పంజాబ్ ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్లో జితేశ్ శర్మ భారీ షాట్ ఆడాడు. డీప్ మిడ్‌వికెట్‌లో ఉన్న సుయాశ్ ప్రభుదేశాయ్ క్యాచ్ తీసుకుందామని పరిగెత్తాడు. ఇంతలో లాంగాన్‌లో ఉన్న కోహ్లి కూడా పరిగెత్తుకొచ్చాడు. సుయాశ్‌ను గమనించిన కోహ్లి.. ''నువ్వు ఆగు నేను అందుకుంటాలే'' అని సైగ చేశాడు.
కోహ్లి సైగను అర్థం చేసుకున్న సుయాశ్ స్లో అయ్యాడు. కానీ కోహ్లి క్యాచ్ అందుకోవడంలో విఫలమయ్యాడు. చేతిలో పడినట్లే పడిన బంతి పట్టుతప్పి జారిపోయింది. క్యాచ్ మిస్ చేసిన అనంతరం సుయాశ్ నిరాశగా చూడగా.. కోహ్లి నవ్వుతూ మిస్ అయింది అని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదే విషయమై మ్యాచ్‌లో కామెంటేటర్‌గా వ్యవహరించిన మాథ్‌యూ హెడెన్ ఎయిర్‌లో.. ''కోహ్లి దృష్టి పక్కదారి పట్టడానికి కారణం సుయాశ్ ప్రభుదేశాయ్.. మరుక్షణమే జరగరాని నష్టం జరిగిపోయింది. '' అంటూ కామెంట్ చేశాడు.
చదవండి: IPL 2023: తిన్నగా ఆడటమే రాదు.. ఇంకా ప్రయోగాలు ఒకటి! చెత్త బ్యాటింగ్
Prithvi Shaw: విఫలమవుతున్నా అవకాశాలా? పక్కనబెట్టడం మంచిది!