Suyash Prabhudessai
-
Ranji Trophy 2024-25: తొలి రోజు ఏడు సెంచరీలు
రంజీ ట్రోఫీ 2024-25 ఎలైట్ గ్రూప్ మరియు ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లు ఇవాల్టి నుంచి (అక్టోబర్ 11) ప్రారంభమయ్యాయి. ఈ రోజు మొత్తం 16 ఎలైట్ మ్యాచ్‌లు, 3 ప్లేట్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. తొలి రోజు ఆటలో మొత్తం ఏడు సెంచరీలు నమోదయ్యాయి.బెంగాల్ ఆటగాడు సుదిప్ చటర్జీ 116 పరుగులు చేశాడు.జమ్మూ కశ్మీర్ ఆటగాడు శుభమ్ ఖజూరియా 130 పరుగులతో అజేయంగా నిలిచాడు.సర్వీసెస్ ఆటగాడు రవి చౌహాన్ 113 పరుగులు చేశాడు.గుజరాత్ ఆటగాడు మనన్ హింగ్రజియా 174 పరుగులతో అజేయంగా నిలిచాడు.హిమాచల్ ప్రదేశ్ ఆటగాళ్లు శుభమ్ అరోరా 118, ప్రశాంత్ చోప్రా 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. గోవా ఆటగాడు సుయాశ్ ప్రభుదేశాయ్ 120 పరుగులు చేశాడు.తొలి రోజు స్కోర్ల వివరాలు..బరోడా 241/6 vs ముంబైజమ్మూ & కాశ్మీర్ 264/5 vs మహారాష్ట్రసర్వీసెస్ 298/4 vs మేఘాలయహైదరాబాద్ vs గుజరాత్ 334/8హిమాచల్ ప్రదేశ్ 300/1 vs ఉత్తరాఖండ్రాజస్థాన్ vs పాండిచ్చేరి 237/9విదర్భ 118/10 vs ఆంధ్రప్రదేశ్ 114/1 (4 పరుగుల వెనుకంజ)మధ్యప్రదేశ్ 232/4 vs కర్ణాటకఉత్తర్ప్రదేశ్ వర్సెస్ బెంగాల్ 269/7బీహార్ 78 ఆలౌట్ వర్సెస్ హర్యానా 184/7 (106 పరుగుల ఆధిక్యం)కేరళ vs పంజాబ్ 95/5రైల్వేస్ 142/10 వర్సెస్ చండీగఢ్ 87/7 (55 పరుగులతో వెనుకంజ) తమిళనాడు vs సౌరాష్ట్ర 203/10గోవా 302/7 vs మణిపూర్ఛతీస్గఢ్ 277/6 vs ఢిల్లీ -
వారిద్దరూ కాదు.. కోహ్లి స్ధానంలో ఎవరూ ఊహించని ఆటగాడు!
ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు ముందు టీమిండియాకు విరాట్ కోహ్లి రూపంలో ఊహించని షాక్ తగిలిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో కోహ్లి తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. విరాట్ తిరిగి రాజ్‌కోట్ వేదికగా జరగనున్న మూడో టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు. ఈ క్రమంలో తొలి రెండు టెస్టులకు విరాట్ స్ధానాన్ని భర్తీ చేసే పనిలో సెలక్టర్లు పడ్డారు. దేశీవాళీ క్రికెట్లో పరుగులు వరద పారిస్తున్న వెటరన్ గోవా యువ ఆటగాడు సుయాస్ ప్రభుదేశాయ్ పేరును సెలక్టర్లు పరిశీలీస్తున్నట్లు తెలుస్తోంది. రంజీ ట్రోఫీ సీజన్-2024లో సుయాస్ అదరగొడుతున్నాడు. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన సుయాస్ 386 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ప్రభుదేశాయ్‌కు మంచి రికార్డు ఉంది. 29 మ్యాచ్‌ల్లో 47.97 సగటుతో 2015 పరుగులు చేశాడు. అయితే కోహ్లికి ప్రత్యామ్నాయంగా సుయాస్తో పాటు వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా, మధ్యప్రదేశ్ ఆటగాడు రజిత్ పాటిదార్ పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. సెలక్టర్లు మాత్రం ప్రభుదేశాయ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇక జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. చదవండి: తొలి రెండు టెస్టులకు కోహ్లి దూరం -
సైగ చేయగానే ఆగిపోయాడు.. నమ్మకాన్ని నిలబెట్టని కోహ్లి
ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి మైదానంలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా కోహ్లి క్యాచ్‌లు పట్టడంలో తనకు తానే సాటి. సాధారణంగా అతను క్యాచ్‌లు వదిలేయడం చాలా తక్కువ. క్లిష్ట పరిస్థితుల్లో, ఒత్తిడిలో తప్పిస్తే మిగతా అన్ని సందర్భాల్లో స్టన్నింగ్ క్యాచ్‌లు కోహ్లి చాలానే తీసుకున్నాడు. అలాంటి కోహ్లి తొలిసారి ఒక క్యాచ్ విషయంలో కన్ఫూజన్‌కు గురయ్యాడు. ఈ ఘటన పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. పంజాబ్ ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్లో జితేశ్ శర్మ భారీ షాట్ ఆడాడు. డీప్ మిడ్వికెట్లో ఉన్న సుయాశ్ ప్రభుదేశాయ్ క్యాచ్ తీసుకుందామని పరిగెత్తాడు. ఇంతలో లాంగాన్‌లో ఉన్న కోహ్లి కూడా పరిగెత్తుకొచ్చాడు. సుయాశ్‌ను గమనించిన కోహ్లి.. ''నువ్వు ఆగు నేను అందుకుంటాలే'' అని సైగ చేశాడు. కోహ్లి సైగను అర్థం చేసుకున్న సుయాశ్ స్లో అయ్యాడు. కానీ కోహ్లి క్యాచ్ అందుకోవడంలో విఫలమయ్యాడు. చేతిలో పడినట్లే పడిన బంతి పట్టుతప్పి జారిపోయింది. క్యాచ్ మిస్ చేసిన అనంతరం సుయాశ్ నిరాశగా చూడగా.. కోహ్లి నవ్వుతూ మిస్ అయింది అని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే విషయమై మ్యాచ్‌లో కామెంటేటర్‌గా వ్యవహరించిన మాథ్యూ హెడెన్ ఎయిర్‌లో.. ''కోహ్లి దృష్టి పక్కదారి పట్టడానికి కారణం సుయాశ్ ప్రభుదేశాయ్.. మరుక్షణమే జరగరాని నష్టం జరిగిపోయింది. '' అంటూ కామెంట్ చేశాడు. చదవండి: IPL 2023: తిన్నగా ఆడటమే రాదు.. ఇంకా ప్రయోగాలు ఒకటి! చెత్త బ్యాటింగ్ Prithvi Shaw: విఫలమవుతున్నా అవకాశాలా? పక్కనబెట్టడం మంచిది! -
IPL 2022: ధర 30 లక్షలు.. ఇంతకీ సూయశ్ ఎవరు?
ఐపీఎల్ అరంగేట్రంలోనే అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు రాయల్ చెలెంజర్స్ యువ ఆటగాడు సూయశ్ ప్రభుదేశాయి. చెన్నై సూపర్‌కింగ్స్ సీనియర్ ప్లేయర్ మొయిన్ అలీ రనౌట్‌లో కీలక పాత్ర పోషించిన సూయశ్.. బ్యాట్‌తోనూ ఆకట్టుకున్నాడు. మొత్తంగా 18 బంతులు ఎదుర్కొన్న అతడు 34 పరుగులు(5 ఫోర్లు, ఒక సిక్సర్) ఆగమనంలోనే తనదైన ముద్ర వేశాడు. కాగా ఐపీఎల్-2022లో భాగంగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ ద్వారా సూయశ్ రూపంలో మరో కొత్త టాలెంట్ మాత్రం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అతడి గురించి ఆసక్తికర అంశాలు! దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటిన సూయశ్ ►సూయశ్ 1997 డిసెంబరు 6న జన్మించాడు. ►గోవా తరఫున దేశవాళీ టోర్నీల్లో ఆడుతున్న కుడిచేతి వాటం గల ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ 2016లో లిస్ట్ ఏ క్రికెట్లో అడుగుపెట్టాడు. ►2016-17 సీజన్లో బెంగాల్‌తో మ్యాచ్‌తో విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీతో అరంగేట్రం చేశాడు. ►2018-19 రంజీ ట్రోఫీలో భాగంగా హర్యానాతో మ్యాచ్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి సూయశ్ ఎంట్రీ ఇచ్చాడు. ►ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఒక సెంచరీ, 8 అర్ధ శతకాలు సాధించడంతో పాటుగా ఇప్పటి వరకు ఎనిమిది వికెట్లు తీశాడు ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. టీ20 ఫార్మాట్లోనూ.. ►సూయశ్ 2018-9 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా సిక్కింతో మ్యాచ్‌లో తొలిసారిగా టీ20 ఫార్మాట్లో అడుగుపెట్టాడు. ►రాజస్తాన్‌తో మ్యాచ్‌లో 23 బంతుల్లో 35 పరుగులు సాధించి గోవాను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు సూయశ్. ►అదే విధంగా మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో 200 స్ట్రైకు రేటుతో 48 పరుగులు సాధించి అజేయంగా నిలిచి సత్తా చాటాడు. ►అంతేగాక తమిళనాడుపై గోవా విజయంలో కీలక పాత్ర పోషించి వార్తల్లో నిలిచాడు. ►దేశీ టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు 20 ఇన్నింగ్స్ ఆడిన సూయశ్ 443 పరుగులు సాధించాడు. గోవా తరఫున నాలుగో ఆటగాడు.. ►ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన సూయశ్ ఐపీఎల్ మెగా వేలం-2022లోకి రాగా ఆర్సీబీ 30 లక్షలు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది. సీఎస్కేతో మ్యాచ్‌లో హర్షల్ పటేల్ దూరమైన నేపథ్యంలో సూయశ్ ఆర్సీబీ తరఫున ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. ►గోవా తరఫున ఐపీఎల్లో ఆడుతున్న నాలుగో ఆటగాడు సూయశ్. అతడి కంటే ముందు స్వప్నిల్ అసోంద్కర్(రాజస్తాన్ రాయల్స్), షాదాబ్ జకాటి(సీఎస్కే, ఆర్సీబీ, గుజరాత్ లయన్స్), సౌరభ్ బండేద్కర్(ఆర్సీబీ) క్యాష్ రిచ్లో ఎంట్రీ ఇచ్చారు. చదవండి: IPL 2022 CSK Vs RCB: సోదరి మరణం.. జట్టుకు దూరం.. అతడి సేవలను మిస్సవుతున్నాం! #CSKvRCB: Post Match Chat We win some. We fight hard, but still lose some. Mike Hesson talks about the positives from today’s match, & we also caught up with the impressive debutant Suyash Prabhudessai. Here are some post match visuals on Game Day.#PlayBold #IPL2022 #RCB pic.twitter.com/ECIqOqIaTk — Royal Challengers Bangalore (@RCBTweets) April 13, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });