రంజీ ట్రోఫీ 2024-25 ఎలైట్ గ్రూప్ మరియు ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లు ఇవాల్టి నుంచి (అక్టోబర్ 11) ప్రారంభమయ్యాయి. ఈ రోజు మొత్తం 16 ఎలైట్ మ్యాచ్‌లు, 3 ప్లేట్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. తొలి రోజు ఆటలో మొత్తం ఏడు సెంచరీలు నమోదయ్యాయి.
బెంగాల్ ఆటగాడు సుదిప్ చటర్జీ 116 పరుగులు చేశాడు.
జమ్మూ కశ్మీర్ ఆటగాడు శుభమ్ ఖజూరియా 130 పరుగులతో అజేయంగా నిలిచాడు.
సర్వీసెస్ ఆటగాడు రవి చౌహాన్ 113 పరుగులు చేశాడు.
గుజరాత్ ఆటగాడు మనన్ హింగ్రజియా 174 పరుగులతో అజేయంగా నిలిచాడు.
హిమాచల్ ప్రదేశ్ ఆటగాళ్లు శుభమ్ అరోరా 118, ప్రశాంత్ చోప్రా 122 పరుగులతో అజేయంగా నిలిచాడు.
గోవా ఆటగాడు సుయాశ్ ప్రభుదేశాయ్ 120 పరుగులు చేశాడు.
తొలి రోజు స్కోర్ల వివరాలు..
బరోడా 241/6 vs ముంబై
జమ్మూ & కాశ్మీర్ 264/5 vs మహారాష్ట్ర
సర్వీసెస్ 298/4 vs మేఘాలయ
హైదరాబాద్ vs గుజరాత్ 334/8
హిమాచల్ ప్రదేశ్ 300/1 vs ఉత్తరాఖండ్
రాజస్థాన్ vs పాండిచ్చేరి 237/9
విదర్భ 118/10 vs ఆంధ్రప్రదేశ్ 114/1 (4 పరుగుల వెనుకంజ)
మధ్యప్రదేశ్ 232/4 vs కర్ణాటక
ఉత్తర్‌ప్రదేశ్ వర్సెస్ బెంగాల్ 269/7
బీహార్ 78 ఆలౌట్ వర్సెస్ హర్యానా 184/7 (106 పరుగుల ఆధిక్యం)
కేరళ vs పంజాబ్ 95/5
రైల్వేస్ 142/10 వర్సెస్ చండీగఢ్ 87/7 (55 పరుగులతో వెనుకంజ)
తమిళనాడు vs సౌరాష్ట్ర 203/10
గోవా 302/7 vs మణిపూర్
ఛతీస్‌గఢ్ 277/6 vs ఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment