హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి హీనా ఖాన్ కుటుంబం కోవిడ్ బారిన పడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన ఆమె తరచూ మాస్కులు ధరించడం వల్ల తన ముఖంపై వచ్చిన ఎర్రటి మచ్చలు కనిపించేలా ఫొటో షేర్ చేసింది. 'ఈ రోజుల్లో జీవితం అన్నా ఇన్‌స్టాగ్రామ్ అన్నా.. ఏదైనా మంచి ఫొటోలు సమకూర్చుకోవడమే, దానికి అందరమైన విజువల్స్ యాడ్ చేయడమే. కానీ అది 2022కి వచ్చేసరికి పరిస్థితులు 2020 కంటే కూడా క్లిష్టంగా మారిపోయాయి'
'ఇంట్లో మీ ఒక్కరు మినహా ప్రతి ఒక్కరూ వైరస్ బారిన పడినప్పుడు మీరు నిరంతరం మాస్కు పెట్టుకునే ఉండి 24 గంటలు సానిటైజర్ వాడుతూ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. అలా రోజంతా మాస్కు పెట్టుకునే ఉండటంతో ముఖంపై ఇలా మచ్చలు వచ్చాయి' అని హీనా ఖాన్ పేర్కొంది. కోవిడ్‌ను నియంత్రించడానికి ఒక వారియర్‌లా పోరాడుతూనే ఉండాలని చెప్పుకొచ్చింది. కాగా గతేడాది ఏప్రిల్‌లో హీనాఖాన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment