Hina Khan Tweet And Slams Intrusive People Who Are Not Aware Of Boundaries - Sakshi
Sakshi News home page

Hina Khan: అలాంటి వారిని దగ్గరికి రానివ్వకండి, హద్దులు పెట్టండి

Published Sun, Jun 12 2022 11:13 AM | Last Updated on Sun, Jun 12 2022 11:52 AM

Hina Khan Shares Interesting Tweet And Warns Who Do Not Have Limits - Sakshi

సినీ సెలబ్రెటీలు తమకు సంబంధించిన ఫొటోలను, వ్యక్తి విషయాలను తరచూ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. అంతేకాదు తమ హాట్‌హాట్‌, గ్లామరస్‌ ఫొటోషూట్‌లను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌ను కనువిందు చేస్తుంటారు. అలాగే ప్రముఖ బుల్లితెర నటి, బాలీవుడ్‌ హీరోయిన్‌ హీనా ఖాన్‌ సైతం సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన వ్యక్తిగత విషయాలను, ఫొటోలతో అలరించే ఆమె రీసెంట్‌గా చేసిన ఓ ట్వీట్‌ చర్చనీయాంశమైంది. అయితే ఇందులో ఆమె ఎవరికో గట్టి వార్కింగ్‌ ఇచ్చింది. కానీ వారి పేరు, ఎవరన్నది మాత్రం ప్రస్తావించలేదు.

చదవండి: ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రత్యూష ఆత్మహత్య, ఎమోషనలైన ఉపాసన

దీంతో ఈ కామెంట్స్‌ ఎవురిని ఉద్దేశించి చేసిందో తెలియక ఆమె ఫాలోవర్స్‌ ఆలోచనలో పడ్డారు. ఇంతకి ఆ ట్వీట్‌ హీనా ఏం రాసుకొచ్చిందంటే.. ‘కొంచెం కూడా సున్నితత్వం, సభ్యత, మర్యాద లేని మనుషులు ఎన్నో విధాలుగా సరిహద్దులు తెలియకుండా మన జీవితంలోకి వచ్చేస్తుంటారు. వారు అవసరం లేకున్నా నీ పనిలో కలగజేసుకొని, నువ్వు బాధపడేలా చేస్తుంటారు. వారికంటూ లిమిట్ ఏం పెట్టుకోకుండా పక్కవారి జీవితాన్ని డిస్టర్బ్‌ చేయడమే పనిగా పెట్టుకుంటారు. అలాంటి వారికి మనమే సరిహద్దు పెట్టాలి. వారికి దూరంగా ఉండాలి. సరిహద్దులు అనేవి మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడతాయి’ అని పేర్కొంది. 

చదవండి: ‘నా సినిమా ఫ్లాప్‌ అయినా కూడా రానా బాగుందనేవాడు’

అయితే ఉన్నట్టుండి ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇంతకి హీనా వార్కింగ్‌ ఎవరికి ఇచ్చింది? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా బుల్లితెర నటిగా సత్తా చాటిన ఆమె వెండితెరపై హీరోయిన్‌గా కూడా రాణిస్తోంది. అంతేకాదు పలు రియాలిటీ షో కంటెస్టెంట్‌ అలరిస్తూ ఉంటుంది. ఇటీవల ఆమె డిజిటల్‌ ఎంట్రీ కూడా ఇచ్చింది. పలు వెబ్‌ సిరీస్‌, చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తూ వరుస ఆఫర్స్‌ అందుకుంటోంది. కాగా హీనా ఖాన్‌ గత కొంకాలంగా నిర్మాత రాఖీ జైస్వాల్‌తో డేటింగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీ బిగ్‌బాస్‌ 11వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లిన హీనాకు గెస్ట్‌ ఎపోసోడ్‌లో భాగంగా హౌజ్‌లోకి వచ్చిన రాఖీ జైస్వాల్‌ ఆమెకు ప్రపోజ్‌ చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement