రూ.3.5 కోట్ల అప్పు.. రోడ్డునపడ్డా! ఈ బతుకు వద్దనుకున్నా: నటి | Rashami Desai Turn Homeless With Rs 3.5 Crore Debt After Divorce | Sakshi
Sakshi News home page

Rashami Desai: నటుడితో విడాకులు.. రూ.3.5 కోట్ల అప్పు.. కారులోనే నిద్ర..

Jul 31 2024 11:22 AM | Updated on Jul 31 2024 12:55 PM

Rashami Desai Turn Homeless With Rs 3.5 Crore Debt After Divorce

రియాలిటీ షో, సినిమాలు, సీరియల్స్‌.. ఏవైనా సరే తనకు కొట్టిన పిండి. బుల్లితెర అయినా, వెండితెర అయినా.. తన పాత్రలో ఇట్టే ఇమిడిపోతుంది రష్మీ దేశాయ్‌. ప్రస్తుతం తన చేతిలో నాలుగైదు చిత్రాలున్నాయి. కెరీర్‌లో జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతున్న ఈ బ్యూటీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడింది. 

రూ.3.5 కోట్ల అప్పు
సీరియల్‌ నటుడు నందీశ్‌ సంధును 2011లో పెళ్లాడగా 2014లో విడిపోయారు. 2016లో విడాకులు మంజూరయ్యాయి. ఆ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించింది. రష్మీ దేశాయ్‌ మాట్లాడుతూ.. సరిగ్గా అప్పుడే నేను ఓ ఇల్లు కొనుక్కున్నాను. నాపై రూ.2.5 కోట్ల అప్పు ఉంది. మిగతా లోన్స్‌ అన్నీ కలుపుకుంటే నాపై మూడున్నర కోట్లదాకా అప్పు ఉంది. పర్వాలేదు, తీర్చేద్దామని ధైర్యంగా ఉన్నాను. 

కుటుంబం దూరం పెట్టింది
అప్పుడే నేను భాగమైన షో ఒకటి క్యాన్సిల్‌ అయింది. నాలుగైదు రోజులపాటు రోడ్డుపైనే ఉన్నాను. నాకున్న ఆడీ కారులోనే నిద్రపోయాను. నాకు సంబంధించినవన్నీ నా మేనేజర్‌ ఇంట్లోనే ఉన్నాయి. కుటుంబం నన్ను దూరం పెట్టింది. రూ.20కు దొరికే భోజనం తిన్నాను. విడాకులు తీసుకున్నందుకు ఫ్రెండ్స్‌ కూడా నేను అందరిలాంటిదాన్ని కాదన్నట్లు ఫీలయ్యారు. నా నిర్ణయాలన్నీ తప్పేనని కుటుంబం బలంగా నమ్మింది. 

ఒత్తిడికి లోనయ్యా..
ఎవరి సాయం లేకపోయినా నెమ్మదిగా అప్పు తీర్చేశాను. కానీ అప్పుడు ఎంతో ఒత్తిడికి గురయ్యాను. ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై సరిగా నిద్రపోయేదాన్నే కాదు. కొన్నిసార్లు చచ్చిపోదామనిపించేది. కానీ సెట్‌లోని వారు నాకు సపోర్ట్‌గా నిలిచారు. యోగా కూడా ఈ బాధ్యలను మర్చిపోయేందుకు కారణమైంది అని చెప్పుకొచ్చింది.

షోస్‌ అండ్‌ సినిమాలు..
జర నచ్‌కే దిఖా 2, జలక్‌ దిఖ్‌లాజా 5, ఫియర్‌ ఫ్యాక్టర్‌: ఖత్రోన్‌ కె ఖిలాడీ 6, నాచ్‌ బలియే 7 వంటి పలు రియాలిటీ షోలలోనూ పాల్గొంది. హిందీ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌లో పాల్గొని టాప్‌ 5 కంటెస్టెంట్‌గా నిలిచింది. ఈ ఏడాది మిషన్‌ లైలా (హిందీ), హిసబ్‌ బరాబర్‌ (హిందీ), మామ్‌ తానే నై సమ్‌జే (గుజరాతీ), చంబే ది బూటి (పంజాబీ), ఎవర- బ్లెస్సింగ్‌ ఆఫ్‌ గాడ్‌ (హిందీ) వంటి చిత్రాల్లో యాక్ట్‌ చేస్తోంది.

చదవండి: ప్లాస్టిక్‌ సర్జరీలు తప్పేం కావు.. నేను కూడా ట్రై చేస్తా!: హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement