ప్లాస్టిక్‌ సర్జరీలు తప్పేం కావు.. నేను కూడా ట్రై చేస్తా!: హీరోయిన్‌ | Radhika Madan Talks About Cosmetic Surgeries | Sakshi
Sakshi News home page

Radhika Madan: సర్జరీలతో ఆత్మవిశ్వాసం.. భవిష్యత్తులో నేను కూడా..

Jul 31 2024 10:25 AM | Updated on Jul 31 2024 10:57 AM

Radhika Madan Talks About Cosmetic Surgeries

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలంటే ప్రతిభ ఉంటే సరిపోదు.. అందం కూడా ఉండాలి. ఆ అందం ఏమాత్రం తగ్గకుండా కాపాడుకోగలగాలి. ఇందుకోసం కొందరు సర్జరీలు చేయించుకోవడానికి కూడా వెనుకడారు. ముక్కు బాలేదనో, పెదాలు సరిగా లేవనో.. ఇలా శరీర అవయవాలకు శస్త్ర చికిత్స చేయించుకుంటారు. అయితే ఇలాంటి చికిత్సలను ఆశ్రయించడం తప్పేం కాదంటోంది హీరోయిన్‌ రాధిక మదన్‌.

తప్పేముంది?
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కాస్మొటిక్‌ సర్జరీలు చేయించుకునేవారిని నేను తప్పుపట్టలేను. ఎందుకంటే దానివల్ల అందం, ఆత్మవిశ్వాసం పెరుగుతుది. అలా అని సర్జరీలే బెస్ట్‌ అని ఇప్పుడైతే కచ్చితంగా చెప్పలేను. కానీ, భవిష్యత్తులో నేను కూడా దీని గురించి ఆలోచించే ఛాన్స్‌ ఉంది. 

భవిష్యత్తులో ఆలోచిస్తా
ఆ సమయానికి పరిస్థితులు, ఆలోచనలు ఎలా ఉంటాయన్నదాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాను. నా దృష్టిలో అవి తప్పయితే కాదు అని చెప్పుకొచ్చింది. రాధిక మదన్‌ చివరగా సర్ఫిర మూవీలో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం సనా మూవీ చేస్తోంది. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రమీత సుధాన్షు సారియా డైరెక్ట్‌ చేస్తున్నాడు.

చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement