Radhika Madan
-
ప్లాస్టిక్ సర్జరీలు తప్పేం కావు.. నేను కూడా ట్రై చేస్తా!: హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా నిలదొక్కుకోవాలంటే ప్రతిభ ఉంటే సరిపోదు.. అందం కూడా ఉండాలి. ఆ అందం ఏమాత్రం తగ్గకుండా కాపాడుకోగలగాలి. ఇందుకోసం కొందరు సర్జరీలు చేయించుకోవడానికి కూడా వెనుకడారు. ముక్కు బాలేదనో, పెదాలు సరిగా లేవనో.. ఇలా శరీర అవయవాలకు శస్త్ర చికిత్స చేయించుకుంటారు. అయితే ఇలాంటి చికిత్సలను ఆశ్రయించడం తప్పేం కాదంటోంది హీరోయిన్ రాధిక మదన్.తప్పేముంది?తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కాస్మొటిక్ సర్జరీలు చేయించుకునేవారిని నేను తప్పుపట్టలేను. ఎందుకంటే దానివల్ల అందం, ఆత్మవిశ్వాసం పెరుగుతుది. అలా అని సర్జరీలే బెస్ట్ అని ఇప్పుడైతే కచ్చితంగా చెప్పలేను. కానీ, భవిష్యత్తులో నేను కూడా దీని గురించి ఆలోచించే ఛాన్స్ ఉంది. భవిష్యత్తులో ఆలోచిస్తాఆ సమయానికి పరిస్థితులు, ఆలోచనలు ఎలా ఉంటాయన్నదాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాను. నా దృష్టిలో అవి తప్పయితే కాదు అని చెప్పుకొచ్చింది. రాధిక మదన్ చివరగా సర్ఫిర మూవీలో హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం సనా మూవీ చేస్తోంది. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రమీత సుధాన్షు సారియా డైరెక్ట్ చేస్తున్నాడు.చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా? -
అంత అందంగా లేనన్నారు, వంక పెట్టారు: హీరోయిన్
హీరోయిన్లు ఎంతందంగా ఉన్నా సరే కొందరు ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు. ముక్కు సరిగా లేదు, మూతి సరిగా లేదు, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందేమో, అసలు తనెలా హీరోయిన్ అయింది? ఇలా నానామాటలు అంటూనే ఉంటారు. తనను కూడా ఇలాగే సూటిపోటి మాటలతో వేధించారంటోంది హీరోయిన్ రాధిక మదన్. కెరీర్ తొలినాళ్లలో చాలామంది తనను విమర్శించారంటోంది. కరీనా కపూర్లా ఫీలయ్యాను తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాధిక మదన్ మాట్లాడుతూ.. 'మొదట్లో నేను హీరోయిన్ కరీనా కపూర్లా ఉన్నానని ఫీలయ్యాను. అలాంటిది జనాలు నాకు వంక పెట్టారు. నీ దవడ కాస్త తేడాగా, వంకరగా ఉంది.. దానివల్ల నువ్వేమీ అంత అందంగా కనిపించట్లేదన్నారు. నేనేమో కరీనా కపూర్లా ఫీలవుతుంటే ఇలా అంటున్నారేంటని షాకయ్యాను. అయినా నా విలువ వీరికేం తెలుస్తుందిలే అని లైట్ తీసుకున్నాను. నా గురించి ఏదిపడితే అది రాస్తూ ఉంటారు. నా గురించి రాసిన ప్రతీది చదువుతాను. అలాంటివి చదివినప్పుడు బాధేసేది కొన్నిసార్లు అవి హద్దులు మీరుతున్నాయనిపిస్తుంది.. కానీ పెద్దగా పట్టించుకోను. మరికొన్నిసార్లు నా గురించి వ్యతిరేకంగా చాలా దారుణంగా ప్రచారం చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో కొంత బాధపడతాను.. నిజమేంటో నిరూపించాలని తహతహలాడుతాను. కానీ సోషల్ మీడియా వచ్చాక అవి మన జీవితాలను చాలావరకు కంట్రోల్ చేస్తున్నాయనిపిస్తోంది' అని చెప్పుకొచ్చింది. కాగా రాధిక చివరగా 'సాజిని షిండే కా వైరల్ వీడియో' సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో సూరరై పోట్రు హిందీ రీమేక్ ప్రాజెక్ట్ ఉంది. ఇందులో అక్షయ్ కుమార్కు జంటగా నటించనుంది. దీనితో పాటు సనా అనే సినిమా కూడా చేస్తోంది. చదవండి: బిగ్ బాస్ విన్నర్ ఎల్విష్ యాదవ్కు షాక్..!