సీక్రెట్‌గా పెళ్లి.. 4 నెలలకే విడాకులు తీసుకున్న నటి! | Apollena Actress Aditi Sharma Headed For Divorce With Husband Abhineet After 4 Months Of Secret Marriage | Sakshi
Sakshi News home page

సీక్రెట్‌గా పెళ్లి.. 4 నెలలకే విడాకులు తీసుకున్న నటి!

Published Tue, Mar 11 2025 12:17 PM | Last Updated on Tue, Mar 11 2025 12:45 PM

Apollena actress Aditi Sharma Headed For Divorce

బాలీవుడ్‌లో నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఎంత సహజమో..విడిపోవడం అంతే సహజం. ఇలా పెళ్లి చేసుకోని అలా విడాకులు తీసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. తాజాగా మరో జంట విడిపోయింది. బాలీవుడ్‌ బుల్లితెర నటి,అపోలీనా(ఫేమస్‌ సైన్స్‌ డ్రామా సిరిస్‌) ఫేం అదితి శర్మ తన భర్త  అభిజిత్‌ కౌశిక్‌తో విడిపోయినట్లు తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఈ జంట.. నాలుగు నెలల కూడా కలిసి కాపురం చేయలేకపోయింది.

నాలుగేళ్లుగా సహజీవనం.. సీక్రెట్‌గా పెళ్లి
బాలీవుడ్‌ బుల్లితెరపై అదితి శర్మకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. సీరియళ్లతో పాటు పలు షోలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత నాలుగేళ్లుగా ఆమె అభిజిత్‌ కౌశిక్‌ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. ఈ విషయం బాలీవుడ్‌ మొత్తానికి తెలుసు. సోషల్‌ మీడియాలోనూ ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్‌ చేసేవారు. కొన్నాళ్ల పాటు సహజీవనం చేసిన తర్వాత గతేడాది నవంబర్‌లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం అత్యంత రహస్యంగా జరిగింది. తన కెరీర్‌కి ఇబ్బంది కలుగొద్దని ఇలా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నామని, ఇప్పుడు ఆమె ప్రవర్తన నచ్చక విడిపోయామని ఆమె భర్త అభిజిత్‌ కౌశిక్‌ చెప్పారు. 

అదితి ఒత్తిడితోనే పెళ్లి!
తాజాగా ఆయన తన న్యాయ సలహాదారు రాకెశ్‌ శెట్టితో కలిసి ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘అదితి నేను నాలుగేళ్లుగా కలిసి ఉంటున్నాం. గతేడాది నవంబర్‌ 12న మేం సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాం.  ఏడాదిన్నరగా అదితి నాపై ఒత్తిడి తెవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లికి ఓకే చెప్పాను. పెళ్లి విషయం బయటకు తెలిస్తే తన కెరీర్‌కి ఇబ్బంది అవుతుందని అదితి చెప్పడంతో మా ఇద్దరి ఫ్యామిలీల సమక్షంలో మాత్రమే పెళ్లి చేసుకున్నాం. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి’ అని అభిషేక్‌ చెప్పారు

రూ.25లక్షలు డిమాండ్‌
అదితి శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న అభిషేకే ఇప్పుడు విడాకులు డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆమె అపోలీనా కో స్టార్‌ సమర్థ గుప్తాతో సన్నిహితంగా ఉంటుందని, వారిద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు తాను చూశానని ఆరోపించాడు. ఈ కారణంగానే తాను విడాకులు కోరానని అభిషేక్‌ చెప్పారు. అయితే విడిపోవడానికి అదితి శర్మ కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తూనే రూ. 25 లక్షలు డిమాండ్‌ చేశారని అభిషేక్‌ న్యాయ సలహాదారు రాకేశ్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement