ఫేస్‌ బుక్‌ కంటే యూట్యూబే ఇష్టం.. | American Survey Finds Mostly Youth Spend Time In Youtube | Sakshi
Sakshi News home page

ఫేస్‌ బుక్‌ కంటే యూట్యూబే ఇష్టం..

Published Sun, Jun 3 2018 7:28 AM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

American Survey Finds Mostly Youth Spend Time In Youtube - Sakshi

వాషింగ్టన్‌ : సెల్‌పోన్‌లో ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేయడం కంటే యూట్యూబ్‌లో వీడియోలు చూడటానికి యువత ఆసక్తి చూపిస్తోందట. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఫ్యూ పరిశోదన సంస్థ సర్వే చేసి వెల్లడించింది. 13-17 సంవత్సరాల యువతీ యువకుల్లో దాదాపుగా 85% మంది యూట్యూబ్‌లో వీడియోలను చూడటంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారంట. ఈ విషయాలను మొత్తం 743 మంది యువతను ప్రశ్నించి వివరాలను ఫ్యూ సంస్థ సేకరించింది.

యూట్యూబ్‌ తర్వాత ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రాంలో గడిపేస్తున్నారని తెలిసింది. ఇన్‌స్టాగ్రాంలో 72% మంది, చాటింగ్‌లో 69% మంది, ఫేస్‌ బుక్‌లో 57% మంది తమ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నట్లు తెలింది. అమెరకన్లో 95% మందికి స్మార్ట్‌ఫోన్‌ వాడే విధానం తెలుసు. అంతేకాక నిత్యం 43% మంది ఇంటర్నెట్‌ వాడుతున్నారని వెల్లడైంది. సోషల్‌ మీడియాల వల్ల మంచి జరుగుతుందని 31% మంది అంటున్నారు. కాదు చేటు అని 24% మంది నమ్ముతున్నట్లు ఫ్యూ సంస్థ సర్వేలో పేర్కొంది.

ఈ సంస్థ 2014-15లో కూడా సర్వే చేపట్టింది. అప్పటి సర్వేలో కేవలం 24% మంది యువత నిరంతరం ఆన్‌లైన్‌లో ఉండేవారని తెలిసింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్‌ పోన్‌ వాడకం పెరిగిపోయింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement