
మీకు బిలాల్ గోరెగెన్ గుర్తుండే ఉంటారు. అతను టర్కిష్‌కు చెందిన వీధి సంగీత కారుడు, వైబింగ్ క్యాట్ మీమ్ ద్వార ప్రసిద్ధి చెందాడు. 1981లో జ్యోతి మూవీకి చెందిన హిట్ సాంగ్ కలియోన్ కా చమన్ పాటను పాడటంతో ప్రస్తుతం మరోసారి వార్తల్లో నిలిచారు. దృష్టిలోపం ఉన్న సంగీత కారుడు బిలాల్ . గత సంవత్సరం తను పాడిన ఒక పాట చాల వైరల్ అయింది. 1930లో ప్రసిద్ధి చెందిన ఇవాన్ పోల్కా అనే పాటను బిలాల్ ఒక పార్కులోని బెంచ్‌పై కూర్చోని దర్బుకా(తబలా) ప్లే చేస్తూ పాడాడు. ఈ వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయి వైరల్ అయింది. చదవండి: (దేశంలో మరింత తగ్గిన కరోనా మరణాలరేటు)
అక్టోబర్ 2020లో ఒక వ్యక్తి బిలాల్ సంగీతానికి పిల్లి ఆశ్వాదిస్తూ తలూపుతున్నట్లు మీమ్‌ను చేశాడు. అది ట్విట్టర్లో, పలు సోషల్ మీడియా వేదికలపై తెగ హల్ చల్ చేసింది. దీంతో బిలాల్ వైబింగ్ క్యాట్ మీమ్ ద్వారా ప్రసిద్ధి చెందాడు. పలు కారణాలతో వార్తల్లో నిలుస్తు వస్తున్న బిలాల్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఐదురోజుల క్రితం దర్బుకా ప్లే చేస్తు కలియోన్ అనే పాటను పాడాడు. చాల అద్భుతంగా పాడిన ఆ పాటను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడంతో 16 లక్షల వ్యూస్‌తో వైరల్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment