కరీంనగర్లో ఓ సాహసం బాలుడి ప్రాణాలను బలిగొంది.
కరీంనగర్ : కరీంనగర్లో ఓ సాహసం బాలుడి ప్రాణాలను బలిగొంది. యూట్యూబ్‌లో సాహస వీడియో చూసిన బాలుడు దానిని చేసేక్రమంలో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు.
వివరాల్లోకి వెళితే...విద్యానగర్‌కు చెందిన రఘచారి కుమారుడు ధనుష్ నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో ల్యాప్‌టాప్ ఉండటంతో యూట్యూబ్లో సాహసాలను చూసిన ధనుష్ అదేమాదిరిగా సాహసం చేశాడు. నోట్లో కిరోసిన్ పోసుకుని మంటలు ఊదే ప్రయత్నం చేయగా..నోరు కాలి తీవ్రంగా గాయపడ్డాడు. నాలుగు రోజులుగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.