యూట్యూబ్‌లో పిల్లల సాంగ్స్ కానీ, రైమ్స్ కానీ కనిపిస్తే పట్టించుకోకుండా వదిలేస్తాం. కానీ ఓ పాట మాత్రం యూట్యూబ్‌లో రికార్డులను తిరగరాసి అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. యూట్యూబ్ చరిత్రలోనే ఎక్కువ మంది వీక్షించిన వీడియోగా "బేబీ షార్క్" రికార్డుకెక్కింది. పిల్లల కోసం రూపొందించిన ఈ సాంగ్‌ను దక్షిణ కొరియాలోని పింక్‌ఫాంగ్ అనే కంపెనీ 2016లో జూన్ 17న రిలీజ్ చేసింది. ఆ పాటలో ఉన్న మ్యాజిక్ పిల్లలనే కాదు పెద్దలను కూడా ఆకర్షించింది. ఎలెన్ డీజెనర్స్, జేమ్స్ కార్డన్, సోఫీ టర్నర్ వంటి సెలబ్రిటీలు సైతం 2018లో ఈ పాటను రీక్రియేట్ చేసి చాలెంజ్‌లు విసురుకున్నారు. వాషింగ్టన్ నేషనల్ బేస్‌బాల్ టీమ్ కూడా ఈ పాట నుంచి మనసు తిప్పుకోలేకుండా పోయింది. దీన్ని జాతీయ గేయంగా ప్రకటించింది. ఈ పాట ఇచ్చిన ఉత్సాహంతో గతేడాది ఈ జట్టు ఆటగాళ్లు ప్రపంచ సిరీస్‌ను కైవసం చేసుకోవడం విశేషం. (చదవండి: కనకవ్వ: అన్నీ బతుకుపాటలే..)
2019లో బిల్‌బోర్డ్ హాట్ 100లో ఈ సాంగ్ 32వ స్థానాన్ని సైతం సంపాదించింది. ఇక ఇప్పటివరకు 7.039 బిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో డెత్రోన్ లూయిస్ ఫాన్సికి చెందిన "డెస్పాసిటో" సాంగ్ అత్యధిక మంది వీక్షించిన వీడియోగా తొలిస్థానంలోనే ఉండేది. కానీ బేబీ షార్క్ ఆ రికార్డును బద్దలు కొట్టింది. 7.046 బిలియన్ల వ్యూస్‌తో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. 2.16 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ పాప, ఓ బాబు మాత్రమే ఉంటారు. వాళ్ల చుట్టూ షార్క్(సొరచేప)లు ఉంటాయి. పాట మొత్తంలో 'షార్క్ డుడుడుడు' అనే క్యాచీ పదాలే ఎక్కువగా ఉండటంతో పిల్లలు ఈ పాటను సులువుగా నేర్చేసుకుంటున్నారు. ఇక యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన వీడియోల్లో బేబీ షార్క్ తర్వాత డెస్పాసిటో, షేప్ ఆఫ్ యూ, సీ యూ అగెన్, మాషా అండ్ ద బీర్ రెసిపీ ఫర్ డిజాస్టర్ అనే వీడియోలు తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. (చదవండి: అప్పులపాలై ఇంటికి తిరిగొచ్చిన పిల్లి!)
Comments
Please login to add a commentAdd a comment