ఐదేళ్లకే ముగ్గురు గర్ల్ఫ్రెండ్స్!! | five year old kid suffers with three girl friends | Sakshi
Sakshi News home page

ఐదేళ్లకే ముగ్గురు గర్ల్ఫ్రెండ్స్!!

Published Tue, May 27 2014 4:04 PM | Last Updated on Thu, Apr 4 2019 5:20 PM

ఐదేళ్లకే ముగ్గురు గర్ల్ఫ్రెండ్స్!! - Sakshi

ఐదేళ్లకే ముగ్గురు గర్ల్ఫ్రెండ్స్!!

''ఇప్పటికింకా నా వయసు నిండా ఐదేళ్లే.. కానీ ముగ్గురు గర్ల్ఫ్రెండ్స్తో ఒకటే తలనొప్పే'' అంటూ ఆ బుడతడు చెబుతుంటే, వాళ్ల అమ్మకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఎందుకొచ్చింది, ఆ సంగతేదో నెటిజన్లే చూసుకుంటారని బుడతడి కబుర్లను వీడియో తీసి యూట్యూబ్లో పెట్టేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే, ఐదేళ్ల బుడతడు ఒకడికి గర్ల్ఫ్రెండ్స్ ఎక్కువైపోయి విపరీతంగా ఒత్తిడికి గురవుతున్నాడు. అదే విషయాన్ని తన తల్లికి చెప్పడం మొదలుపెట్టాడు. ఆవిడ వెంటనే ఆ విషయాన్ని వీడియో తీయడం మొదలుపెట్టింది.

తనకున్న ముగ్గరు గర్ల్ఫ్రెండ్స్లో ఒకళ్లని వదులుకోవాల్సి ఉంటుందని, కానీ అందరూ అందంగా ఉండటంతో ఎవరిని వదలాలో తెలియక తికమక పడుతున్నానని చెప్పాడు. ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉంటే ఇబ్బందేంటని అడిగితే, వాళ్లవల్ల తనకు ఒత్తిడి పెరిగిపోయిందని, ముగ్గురిలో ఒకరిని వదిలేయాలనుకుంటున్నానని అన్నాడు. ఎవరిని వదలాలో ఎలా నిర్ణయించుకుంటావని అడిగితే.. 'అదే అర్థం కావట్లేదు.. ముగ్గురూ బావుంటారే!' అంటాడు. మరి ఐదుగురు గర్ల్ఫ్రెండ్స్ ఉంటే ఏం చేస్తావని తల్లి అడిగితే.. అప్పుడా సంఖ్య నాలుగు అవ్వాలని కోరుకుంటానని ఏమాత్రం తడుముకోకుండా చెప్పాడు. కిడ్ ప్రెడికమెంట్స్ అనే పేరుతో యూట్యూబ్లో పెట్టిన ఈ వీడియోను ఇప్పటికి దాదాపు 29 లక్షల మంది చూశారు!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement