
నాగ్‌పూర్: దేశంలో దీపావళి సందడి నెలకొంది. మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీపావళి షాపింగ్‌కు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో నితిన్ గడ్కరి తన మనుమడు, మనుమరాలితో దీపావళి షాపింగ్ చేయడాన్ని చూడవచ్చు. గడ్కరీ ఒక బాణసంచా దుకాణంలో తన మనుమలకు బాణసంచా కొనిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను నితిన్ గడ్కరీ కార్యాలయం విడుదల చేసింది.
ఇదిలావుండగా పాన్ మసాలా, గుట్కా తిని రోడ్డుపై ఉమ్మివేసే వారికి బుద్ధి చెప్పేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక వినూత్న ఆలోచన వెలిబుచ్చారు. అటువంటివారి ఫొటోలు తీసి పత్రికల్లో ప్రచురించాలని, అప్పుడే వారికి బుద్ధి వస్తుందన్నారు. దేశ ప్రజలు రోడ్లు మురికిగా మారకుండా కాపాడుకోవాలని మంత్రి సూచించారు.
ఇది కూడా చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు
Comments
Please login to add a commentAdd a comment