
ముంబై: గొంతులో బెలూన్ ఇరుక్కోవడంతో ఊపిరాడక ఓ అరేళ్ల బాలుడు మృతి చెందాడు. నాగ్‌పూర్‌కు చెందిన విజయ్ పటేల్(6)కు అతని తల్లిదండ్రులు బుధవారం ఉదయం అడుకునేందుకు కొన్ని ఆటవస్తువులు, బెలూన్లు ఇచ్చారు. విజయ్ వాటితో ఆడుకుంటుండగా ఓ బెలూన్‌లోంచి గాలి పోయింది. దీంతో ఆ బెలూన్‌ను నోటిలో పెట్టుకుని గాలిఊదే ప్రయత్నం చేశాడు.
ప్రమాదవశాత్తూ అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో అతనికి ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే తల్లిదండ్రులు పరుగున వచ్చి సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీపావళి వేడుకలతో సంతోషాలు నిండాల్సిన ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.