
ముంబై: పౌరసమాజం అభ్యున్నతికి రాజకీయాలు అక్కరకురావాలిగానీ ప్రస్తుత సమాజంలో రాజకీయాలు అధికారం చేజిక్కించుకునేందుకు వినియోగిస్తున్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. శనివారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో గడ్కరీ ప్రసంగించారు.
‘రాజకీయాలకు మించిన జీవితం ఉందని నాకనిపిస్తోంది. రాజకీయాల నుంచి తప్పుకోవాలనిపిస్తోంది. దేశంలో సామాజిక, ఆర్థిక సంస్కరణలు తేచ్చేందుకే రాజకీయాలను ఒక సాధనంగా వాడుకోవాలి. సంక్షేమం కోసం పాటుపడాలి. కానీ ప్రస్తుతం అధికారకాంక్షతో రాజకీయాలు చేస్తున్నారు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment