కాంగ్రెస్ అగ్రనేత, రాహుల్ గాంధీ బీజేపీపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో గులాంగిరీ నడుస్తుందని( గతంలో కాంగ్రెస్‌లో ఉన్న వ్యక్తిం) ఆ పార్టీ ఎంపీనే తనతో చెప్పారని పేర్కొన్నారు. అయితే ఆ ఎంపీ హృదయం ఇప్పటికీ కాంగ్రెస్‌తోనే ఉందని రాహుల్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘గతంలో కాంగ్రెస్ ఉన్న ప్రస్తుత బీజేపీ ఎంపీ ఒకరు ఆ పార్టీలో(బీజేపీ) గులాంగిరీ నడుస్తుందని నాతో చెప్పి వాపోయారు. ఆయన నన్ను వ్యక్తిగతంగా కలిసి ఈ మాటలు చెప్పారు. ఆయన మనస్సంతా కాంగ్రెస్‌పైనే ఉంది. హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాలు పాటించాలి. పార్టీ కార్యకర్తల గోడును వినే వారుండరు. పార్టీ హైకమాండ్ సూచనలు తమకు నచ్చినా నచ్చకపోయినా మరో అవకాశం ఉండదు. బీజేపీలో అలాగే ఉంటుంది’ అని ఆ ఎంపీ తనతో చెప్పారని రాహుల్ పేర్కొన్నారు.
ఈడీ, సీబీఐ సహా కేంద్ర దర్యాప్తు సంస్ధలన్నీ ప్రభుత్వం నుంచి వచ్చే ఒత్తిళ్లతో పనిచేస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. కాగా కాంగ్రెస్ పార్టీ 139వ వ్యవస్ధాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మహారాష్ట్రలోని నాగపూర్‌లో భారీ ర్యాలీ ప్రదర్శించారు. దీంతో మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించింది. ఈ ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు.
చదవండి: ఖతార్‌లో ఉరిశిక్ష పడిన భారత నేవీ మాజీ అధికారులకు ఊరట..
#WATCH | At Congress' 'Hain Taiyyar Hum' rally in Nagpur, Rahul Gandhi says, "A BJP MP, who was previously in Congress, told me that 'ghulami' works in BJP..." pic.twitter.com/AD7kxzvvJR
— ANI (@ANI) December 28, 2023
Comments
Please login to add a commentAdd a comment